ధరణి దరఖాస్తులను ఎప్పడికప్పుడు పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలి - జిల్లా కలెక్టర్ దాసరి హరిచందన
నల్గొండ, 6.3.2024
ధరణి దరఖాస్తులను ఎప్పడికప్పుడు పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ దాసరి హరిచందన అన్నారు.
బుధవారం రాష్ట్ర ముఖ్యమంత్రి ఏనుముల రేవంత్ రెడ్డి ఆన్లైన్ ద్వారా "రైతు నేస్తం " వీడియో కాన్ఫెరెన్స్ విధానాన్ని ప్రారంభించగా , తిప్పర్తి రైతు వేదికలో ఈ కార్యక్రమంలో పాల్గొనే నిమిత్తం వచ్చిన జిల్లా కలెక్టర్ ముందుగా తహసిల్దార్ కార్యాలయాన్ని సందర్శించి ధరణి వెబ్ సైట్లో ని దరఖాస్తులు, ఫైళ్ళ నిర్వహణ తదితర అంశాలను పరిశీలించారు. ధరణిలో ఉన్న వివిధ రకాల మాడ్యూల్స్ పై వచ్చిన దరఖాస్తులపై ఆరా తీశారు. భూముల సర్వే ,కోర్ట్ కేసులు తదితర అంశాలను తహసీల్దార్ స్వప్న ద్వారా అడిగి తెలుసుకున్నారు.
మండల తహసిల్దార్ తో పాటు, డిప్యూటీ తహసీల్దార్,సర్వేయర్ లకు పలు సూచనలు చేశారు.
అనంతరం కార్యాలయ ఆవరణలో సైదు బాయి గూడెం కి చెందిన దివ్యాంగురాలు జక్కా లక్ష్మి తనకు రేషన్ కార్డు కావాలని జిల్లా కలెక్టర్ కు దరఖాస్తు ఇవ్వగా జిల్లా కలెక్టర్ సానుకూలంగా స్పందించారు .రేషన్ కార్డుతో పాటు ఉపాధి చేసుకునేందుకు ముందుకు వస్తే అవకాశం కల్పిస్తామని ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ తెలిపారు .
రెవెన్యూ అదనపు కలెక్టర్ జె. శ్రీనివాస్, ఆర్డిఓ రవి, తిప్పర్తి తహసిల్దార్ స్వప్న, తహసిల్దార్ కార్యాలయ సిబ్బంది తదితరులు ఉన్నారు.
Comments
Post a Comment