5వ రోజు నల్గొండ పార్లమెంట్ నియోజకవర్గానికి 8 మంది 9 సెట్ల నామినేషన్లను
5వ రోజు నల్గొండ పార్లమెంట్ నియోజకవర్గానికి 8 మంది 9 సెట్ల నామినేషన్లను
లోకసభ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియలో భాగంగా 5 వ రోజైన మంగళవారం నల్గొండ పార్లమెంట్ నియోజకవర్గానికి మొత్తం (8) మంది అభ్యర్థులు (9) సెట్ల నామినేషన్లను దాఖలు చేశారు. వీరిలో ఇద్దరు రాజకీయ పార్టీ అభ్యర్డులు కాగా, మిగిలిన ఆరుగురు స్వతంత్ర అభ్యర్థులు.
బి ఆర్ ఎస్ పార్టీ తరఫున కంచర్ల కృష్ణారెడ్డి (2) సెట్లు నామినేషన్ దాఖలు చేయగా,ఎస్ జె పి( సోషల్ జస్టిస్ పార్టీ ఆఫ్ ఇండియా) తరపున సుంకర లింగయ్య ఒక సెట్ నామినేషన్ దాఖలు చేశారు.
స్వతంత్ర అభ్యర్థులుగా అఖిల్ సంపంగి (1) సెట్, రేళ్ళ పెద్ద నరసింహారావు (1) సెట్, సుంకరి రమేష్ (1) సెట్, అబ్దుల్ మాలిక్ (1) సెట్, కిన్నెర యాదయ్య (1) సెట్, పోలిశెట్టి వెంకటేశ్వర్లు (1) సెట్ నామినేషన్లు దాఖలు చేశారు.
స్వతంత్ర అభ్యర్థుల్లో కిన్నెర యాదయ్య ఈ నెల 19న ఒక సెట్ నామినేషన్ దాఖలు చేసి, తిరిగి ఈరోజు మరో సెట్ నామినేషన్ దాఖలు చేశారు.
నల్గొండ లోకసభ నియోజకవర్గ రిటర్నింగ్ అధికారి దాసరి హరిచందన నామినేషన్లను స్వీకరించారు
_________________________________
జారీ చేసిన వారు సహాయ సంచాలకులు, సమాచార శాఖ, నల్గొండ*
Comments
Post a Comment