ఓటు హక్కు ఉన్న ప్రతి ఒక్కరూ పాల్గొని ఎక్కువ పోలింగ్ అయ్యేవిధంగా చూడాలి-
లోకసభ ఎన్నికలలో ఓటు హక్కు ఉన్న ప్రతి ఒక్కరూ పాల్గొని ఎక్కువ పోలింగ్ అయ్యేవిధంగా చూడాలని లోకసభ ఎన్నికల జిల్లా సాధారణ పరిశీలకులు మనోజ్ కుమార్ మాణిక్ ర్రావు సూర్యవంశి అన్నారు.
శనివారం ఆయన నల్గొండ పార్లమెంటు పరిధిలోని వివిధ మండలాలలో పోలింగ్ కేంద్రాలను తనిఖీ చేశారు. కేషరాజుపల్లి, తిప్పర్తి, మాడుగుల పల్లి, కుక్కడం, వేములపల్లి తదితర మండలాలు, గ్రామాలలోని పోలింగ్ కేంద్రాలను తనిఖీ చేసి కనీస సౌకర్యాలను ,ఇతర అంశాలను పరిశీలించారు.
అనంతరం మిర్యాలగూడలోని లోకసభ ఎన్నికల పంపిణీ రిజిస్ట్రేషన్ కేంద్రాన్ని, స్ట్రాంగ్ రూము తనిఖీ చేశారు.
ఆయా పోలింగ్ కేంద్రాల సందర్శన సందర్భంగా ఆయన మాట్లాడుతూ లోకసభ ఎన్నికల సందర్భంగా ఎక్కువ పోలింగ్ అయ్యేవిధంగా చూడాలని ,ఓటు హక్కు ఉన్న ప్రతి ఒక్కరికి ఓటర్ చిట్టిలను పంపిణీ చేయాలని, అదే సమయంలో పోలింగ్ తేదీని సైతం తెలియజేయాలని సూచించారు.
మిర్యాలగూడ ఆర్డిఓ శ్రీనివాసరావు, తహసిల్దార్ హరిబాబు ,ఆయా మండలాల తహసిల్దార్లు ఉన్నారు.
____________________________________
జారీచేసినవారు సహాయ సంచాలకులు, సమాచార శాఖ, నల్గొండ*
Comments
Post a Comment