రాజకీయ ప్రకటనల ప్రచారం కోసం అభ్యర్థులు తప్పనిసరిగా ఎం సి ఎం సి ముందస్తు అనుమతిని తీసుకోవాలి
లోకసభ ఎన్నికల సందర్భంగా సోషల్ మీడియాలో రాజకీయ ప్రకటనల ప్రచారం కోసం ఎన్నికలలో పోటీ చేసే అభ్యర్థులు తప్పనిసరిగా మీడియా సర్టిఫికేషన్ మానిటరింగ్ కమిటీ (ఎం సి ఎం సి) ముందస్తు అనుమతిని తీసుకోవాలని జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి, నల్గొండ పార్లమెంటు నియోజకవర్గం రిటర్నింగ్ అధికారి దాసరి హరిచందన ఒక ప్రకటనలో తెలిపారు.
సోషల్ మీడియా (వాట్సాప్, ట్విట్టర్, ఫేస్ బుక్ ఇన్స్టాగ్రామ్) తో పాటు, ఎలక్ట్రానిక్ మీడియా ,స్థానిక కేబుల్ ఛానల్లు, ఎఫ్ఎం రేడియో , ఇతర ఆన్లైన్ మీడియా, బల్క్ ఎస్ఎంఎస్ లు,వీడియో మెసేజ్ లు, సినిమా థియేటర్లలో అడ్వర్టైజ్మెంట్లకు, అలాగే కరపత్రాల ముద్రణకు కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు తప్పనిసరిగా ఎంసీఎంసీ ముందస్తు అనుమతిని తీసుకోవాలని తెలిపారు. ఇందుకోసం నల్గొండ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో మీడియా సర్టిఫికేషన్ మానిటరింగ్ కమిటీ (ఎంసీఎంసీ) ని ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. సోషల్ మీడియాలో రాజకీయ ప్రకటనల ప్రసారం కోసం పోటీలో ఉన్న అభ్యర్థులు 24 గంటలు ముందు ఎం సి ఎం సి కి దరఖాస్తు చేసుకోవాలని కోరారు.
ఎన్నికల ప్రచార కరపత్రాలలో తప్పనిసరిగా ప్రచురణకర్త పేరు ,చిరునామా ,ప్రింటర్ పేరు ఉండాలని, ఈ కరపత్రాలు ఎవరికి వ్యతిరేకంగా ఉండకూడదని, అంతేకాక ఏదైనా కులం, మతానికి అనుకూలంగా కానీ, కోర్టు కేసులకు సంబంధించిన అంశాలు లేకుండా 1951 ప్రజాప్రాతినిధ్య చట్టంలోని 127 A నియమ నిబంధనలను పాటిస్తూ ప్రచురించాలని తెలిపారు. ఒకవేళ ఎవరైనా 1951 ప్రజా ప్రాతినిధ్య చట్టంలోని నిబంధనలను ఉల్లంఘించి కరపత్రాలను ముద్రించినట్లయితే సంబంధిత ప్రచురణకర్తను ప్రాసిక్యూట్ చేయడం జరుగుతుందని ఆమె స్పష్టం చేశారు.
________________________________
జారీ చేసిన వారు సహాయ సంచాలకులు, సమాచార శాఖ, నల్గొండ*
Comments
Post a Comment