మేడే ను జయప్రదం చేయండి*. పల్లా దేవేందర్ రెడ్డి, ఏఐటీయూసీ కార్యదర్శి పిలుపు,
*మేడే ను జయప్రదం చేయండి*.
పల్లా దేవేందర్ రెడ్డి, ఏఐటీయూసీ కార్యదర్శి పిలుపు,
ప్రపంచ కార్మిక దినోత్సవం మే డే ను జయప్రదం చేయాలని ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి పల్లా దేవేందర్ రెడ్డి కార్మిక శ్రేణులకు పిలుపునిచ్చారు. 138వ మేడే దినోత్సవం సందర్బంగా ఏఐటీయూసీ నల్లగొండ జిల్లా కార్యలయం లో గోడ పత్రికలను విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రపంచవ్యాప్తంగా కార్మిక పండుగగా మే డేని భావిస్తారని మే 1వ తేదీన అంతర్జాతీయంగా దాదాపు 180 దేశాలు మేడే దినోత్సవాన్ని జరుపుకుంటాయని ఆయన ఈ సందర్భంగా తెలియజేశారు. 1886 వ సంవత్సరంలో పని గంటల కొరకు చికాగోలో మొదలైన పోరాటంలో కార్మికుల రక్తం నుండి ఉద్భవించిందే ఎర్రజెండా అన్నారు. దాదాపు అన్ని రాజకీయ పార్టీలు ఇతర కార్మిక సంఘాలు వారి వారి జండాలను సృష్టించుకున్నారని కేవలం ఎర్రజెండా మాత్రం కార్మికుల రక్తం నుంచి ఉద్భవించిందన్నారు. భారతదేశంలోకి మొదటిసారిగా ఏఐటీయూసీ ద్వారానే ఎర్రజెండా వచ్చిందన్నారు. 104 సంవత్సరాల సుదీర్ఘమైన చరిత్ర కలిగిన ఏకైక సంఘం ఏఐటీయూసీ నే అని ఆయన కొనియాడారు. భారతదేశంలో మొదటిసారిగా ఏఐటీయూసీ నాయకులు, కమ్యూనిస్టు నేత సింగారవేలి శెట్టి ఆర్ 1923వ సంవత్సరంలో మద్రాసు నగరంలో ఎగరవేశారన్నారు. తాడిత పీడత అనగారిన వర్గాల శ్రేయసు కై పోరాడేది కేవలం ఎర్రజెండా నేనన్నారు. కార్మికుల సంక్షేమం కొరకు జరిగే పోరాటానికి ఏఐటీయూసీ ఎల్లప్పుడూ కట్టుబడి ఉంటుందని ఆయన తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా జరిగే ఈ పండుగకు ఎలాంటి ఎలక్షన్ కోడ్ ఆంక్షలు పెట్టకూడదని ఆయన ఈ సందర్భంగా అధికారులను కోరారు. మే డే. స్ఫూర్తితో భవిష్యత్తులో కార్మికుల హక్కుల సాధనకై పోరాడరని ఆయన ఈ సందర్భంగా కార్మిక లోకానికి పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఏఐటీయూసీ జిల్లా కోశాధికారి డి వెంకటేశ్వర్లు, వి లెనిన్, గుండె రవి,ఎండి జానీ , యూసఫ్, మదార్ దస్తగిరి, బుర్రి రాములు,పి యాదయ్య,,నాగరాజు,కొండ రాములు,రాజు, తదితరులు పాల్గొన్నారు.
Comments
Post a Comment