కేసిఆర్ అంటేనే ఆర్భాటం , ఆరంభం, అంతం. ప్రజల్ని కాపాడాల్సిన సీఎం కన్నీరు పెట్టుకుంటే ఎలా ?
ప్రజల్ని కాపాడాల్సిన సీఎం కన్నీరు పెట్టుకుంటే ఎలా ?
సీఎం రేవంత్ కు సవాల్ ప్రతి సవాల్ విసిరిన బిజెపి మెదక్ ఎంపీ అభ్యర్థి రఘునందన్ రావు
రింగ్ రోడ్డు ను అష్టవంకర్లు తిప్పిన వ్యక్తీ వెంకట్రామి రెడ్డి
ప్రతి వంక వద్ద రాజపుష్పకు భూములు ఎక్కడివి ?
మెదక్ జిల్లా కు వెంకట్రాం రెడ్డికి ఏం సంబంధం
2015 లో ఓటు కి నోటు కేసు వస్తె 2024 వరకు రేవంత్ ను కాపాడింది ఎవరు?*
పఠాన్ చెరువు లో కాంగ్రెస్ వ్యక్తిని ఒడగొట్టిన వ్యక్తికి మెదక్ అభ్యర్థి గా కాంగ్రెస్ ప్రకటించింది
ఇంటింటికి ఓట్లు పంచి నన్ను ఓడించింది హరీష్ రావు కొత్త ప్రభాకర్ రెడ్డి
డబ్బు పంచలేదని వెంకటేశ్వర స్వామి గుడిలో ప్రమాణం చేద్దామా హరీష్ నేను సిద్ధం
తెలంగాణ జర్నలిస్ట్ యూనియన్ ఆధ్వర్యంలో
క్రాస్ టాక్ విత్ రఘునందన్ రావు
ఆదిత్య పార్క్ హోటల్ లో టీజేయు రాష్ట్ర అధ్యక్షులు కప్పర ప్రసాద్ అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలోబీజేపీ మెదక్ ఎంపీ అభ్యర్థి రఘునందన్ రావు పాల్గొని జర్నలిస్టులు అడిగిన ప్రశ్నలకు సమాధానాలు చెప్పారు
DCP రాధాకిషన్ వాగ్మూలంలో వెంకట్రామిరెడ్డి కంపెనీ రాజ్ పుష్ప నుంచి ఎన్నికలకు డబ్బులు పంపించాం అని వెల్లడించిన
వెంకట్రామిరెడ్డి రాజ్ పుష్ప మీద రేవంత్ సర్కార్ఎందుకు చర్యలు లేవు ఆలోచించండని .రింగ్ రోడ్డు ను అష్టవంకర్లు తిప్పిన వ్యక్తీ వెంకట్రామి రెడ్డి కి ప్రతి వంక దగ్గర భూములు ఎక్కడివన్నారు.
వెంకట్రాంరెడ్డి పొంగులేటి శ్రీనివాసరెడ్డి వియ్యంకుడని అందుకే ఆయనపై చర్యలు ఉండమన్నారు
కాంగ్రెస్ కి బీ అర్ ఎస్ తో సంబంధాలు లేకుంటే వెంకట్రామిరెడ్డి పై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదో సమాధానం చెప్పాలన్నారు
*2015 లో ఓటు కి నోటు కేసు వస్తె 2024 వరకు రేవంత్ ను కాపాడింది ఎవరు?రేవంత్ ను దేవుడు కూడా కాపాడలేడు అన్న కేసీఆర్ ఎందుకు ముందడుగు వేయలేదు సమాధానం చెప్పాలన్నారు
రేవంత్ ఓటు కు నోటు దొంగ అని అంతా అన్నారు కదా ఇప్పుడు మంచోడు అయ్యిండా అన్నారు
రెండు కుటుంబాల మధ్య సత్సంబంధాలు ఉన్నాయి కాబట్టే వెంకట్రామిరెడ్డి, కవితను అరెస్ట్ చేయట్లేదని మెదక్ కి వెంకట్రామిరెడ్డి కి ఏం సంబంధం ? ఏమిటో చెప్పా లాన్నారు ఆయనేందుకు మెదక్ ప్రజలు భరించాలని పోరాటాల గడ్డ మీద ఒక్క ఉద్యమకారుడు మెదక్ ఎంపీ టిఆర్ఎస్ అభ్యర్థిగా కేసిఆర్ కు దొరకలేదా! అని ప్రశ్నించారు.
అరువు తెచ్చుకున్న వ్యక్తీ ఉద్యమకారుడుగా నాకు పోటీయే కాదన్నారు
రూపాయి ఖర్చు లేకుండా 2021 లో కేసిఆర్ కాళ్ళు మొక్కి వెంకట్రామిరెడ్డి mlc అయిన వెంకట్రాంరెడ్డి స్వచ్ఛంద సేవ సంస్థ ఎందుకు పెట్టలేదని నాలుగు సంవత్సరాలు ఎమ్మెల్సీ ఉన్న ఎంపీ గా ఎందుకు పోటీ అన్నారు
కాంగ్రెస్ పరిస్థితి మరీ దారుణం అని
పఠాన్ చెరువు లో కాంగ్రెస్ వ్యక్తిని ఒడగొట్టిన వ్యక్తికి మెదక్ అభ్యర్థి గా కాంగ్రెస్ ప్రకటించింది అధికారం ఉన్న అభ్యర్థులు దొరకని పరిస్థితుల్లో కాంగ్రెస్ ఉందన్నారు
ఇంటింటికి నోట్లు పంచి నన్ను దుబ్బాక లో హరీష్ , ప్రభాకర్ రెడ్డి ఒడగొట్టాని డబ్బులు పంచలేదని దుబ్బాక వేంకటేశ్వర స్వామి గుడి మీద ఒట్టేస్తారా? నేను సిద్ధమంటూ హరీష్ రావుకు కొత్త ప్రభాకర్ రెడ్డి సవాల్ విసిరారు
విద్యాసంస్థలలో పూర్వ వైభవం తీసుకొస్తామని
తక్షశిల నలంద విశ్విద్యాలయాలకు పూర్వ వైభవం తీసుకొచ్చి అన్నని ద్రాక్షగా ఉన్న విద్య లో అందరి హక్కుగా మారుస్తామన్నారు.
*కేసిఆర్ కి రేవంత్ పెద్ద తేడా ఏమీ కనపడట్లేదు*
టిఆర్ఎస్ ను బీ అర్ ఎస్ గా మార్చగానే crs ఇచ్చి ఇంటికి పంపారు సైకిల్ గుర్తు మీద గెలిచిన వ్యక్తికి కేసిఆర్ మంత్రి పదవి ఇస్తే కార్ గుర్తుపై గెలిచిన గెలిచిన అభ్యర్థులకు రేవంత్ ఎంపీ సీట్లు ఇచ్చారు కాంగ్రెస్ , బీ అర్ ఎస్ లది బొమ్మ బొడుసు బంధం
కేసిఆర్, రేవంత్ తెలంగాణకు హాని చేసే వ్యక్తులు ముందు ముందు ముసల్ల పండగ ఉందని
బీజేపీ కి నరేంద్ర మోడీకి వ్యతిరేకంగా మాట్లాడే రేవంత్ కి మాకు ఎలా సంబంధం ఉంటాదన్నారు
ఆయన ఎడమ, కుడి పక్కన కూర్చున్న వాళ్లే ఆయన కుర్చీ లాక్కుంటారు తప్ప ఇంకొక్కరు లాక్కునే పరిస్థితి లేదని ఆయన ఐదేళ్లు సీఎం గా ఉండాలని కోరుకుంటున్నా అన్నారు
*పదేళ్ల మోడీ పాలనలో ఒక్క మత ఘర్షణ లేదు **
బీజేపీ మతం పేరు మీద రాజకీయం చేస్తుంది అనేది అబద్ధం ఇది అబద్ధపు ప్రచారం మాత్రమే
రాజ్యాంగం మార్చే యోచనలో మేము లేము
అటువంటి తప్పుడు ఆలోచన మాకు లేదు
వీటిపై కాంగ్రెస్ కావాలనే రెచ్చగొట్టి తప్పుడు ప్రచారం చేస్తుందని అన్నారు.
వెంకట్రాంరెడ్డి నాకంటే ఎక్కువ చదువుకున్నోడేం కాదని డబ్బు ఉండొచ్చు కానీ ఆయన ఒక మూర్ఖుడు అన్నారు
కేసిఆర్ గురించి మూడు ముక్కలో చెప్తాను
*కేసిఆర్ అంటేనే ఆర్భాటం , ఆరంభం, అంతం.*
ఆయన పార్టీని స్థాపించాడు , trs ను బీ అర్ ఎస్ గా మార్చారు .. ఆయన చేతిలోనే పార్టీ అంతమయ్యే అవకాశం ఉంటుంది అన్నారు
*దిగ్విజయ్ సింగ్ చేసిన తప్పిదం వల్లే 10 పదేళ్లు బీ అర్ ఎస్ బతికింది*
*భస్మాసుర హస్తం వలె ఆయన తల పై ఆయనే చెయ్యి పెట్టుకున్నా ఉద్యమ సమయంలో కేసిఆర్ ఐబై ఏళ్లు. ఇప్పుడేమో 70 ఏళ్లు అప్పటికి ఇప్పటికీ చాలా తేడా ఉంటాది ఆయన రాజకీయం వదిలేసి వ్యవసాయం చేసుకుంటే బాగుంటని నా అభిప్రాయం
నా దగ్గర ఎనభై కోట్లు లేవు కాబట్టే దుబ్బాకలో ఓడిపోయా
మేము ప్రభుత్వాన్ని పడగొట్టం
వారి స్వయంకృతం అపారదంతో ప్రభుత్వాన్ని కూలగొట్టుకుంటే దానికి మేము బాధ్యులం కాదన్నారు
ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రజలకు అవసరం వచ్చే అనేక పనులు చేశాడన్నారు బ్యాంక్ ఖాతాలు ఓపెన్ చేయించి పారదర్శకత పెంచామని
మధ్యవర్తుల ప్రమేయం లేకుండా ఉపాధి హామీ కూలీ డబ్బులు నేరుగా లబ్ది దారుడి అకౌంట్ లో వేసిన ఘనత మోడీ కి దక్కుతుందన్నారు.
కూరగాయలు అమ్మే వారు కూడా డిజిటల్ పేమెంట్స్ పెట్టుకుంటున్నారు అంటే నరేంద్ర మోడీ డిజిటల్ పేమెంట్ చేయడం కాదా అని ప్రశ్నించారు.
కాంగ్రెస్ కి హామీలు ఇచ్చి మర్చిపోవడం అలవాటే
ఆంధ్ర ప్రదేశ్ పునర్విభజన చట్టంలో కూడా హామీలు పెట్టింది అమలు చేయకుండా చేసింది కాంగ్రెస్ కాదని విమర్శించారు.
పోలవరం కు ఆరోజే జాతీయ హోదా ఇవ్వాల్సిందని వారికి పాలనలో చిత్తశుద్ధి లేదని హామీలతో కాలం వెళ్లా కొట్టడం నాటి ఇందిరా నుంచి నేటి వరకు అదే వరుసలో ఉన్నారన్నారు.
ఒక్క రాష్ట్రంలో ప్రాజెక్ట్ కి జాతీయ హోదా ఇచ్చి రెండవ రాష్ట్రానికి ఇవ్వకపోవడం ఎంటని ప్రశ్నించారు.
హామీలు ఇవ్వడం కాంగ్రెస్ వంతు అమలు చేయడం బిజెపి వంతు అని
1980 లో మెదక్ కి రైల్ ఇస్తానని ఇందిరా గాంధీ హామీ ఇచ్చిందని మోడీ నేతృత్వంలో బిజెపి కేంద్ర సర్కార్ హయాంలో మెదక్ కి రైల్ తెచ్చాం అన్నారు
నిన్న సీఎం రేవంత్ మెదక్ లో ఏదంటే అదే మాట్లాడి వెళ్ళారని
ఆయన ఒక సీఎంల కాకుండా మాట్లాడడం ఆయన విజ్ఞతకే వదిలేస్తున్నానన్నారు. ఆయన ఒక గడియల ద్వారా ఈయన ఒక గడియలు దొర అని మాట్లాడుతున్నాడని నా ఇల్లు గడిని ఆయన ఎవరు పేరు చెప్తే వారికి రిజిస్ట్రేషన్ చేపించడానికి సిద్ధంగా ఉన్నానంటూ సవాల్ విసిరారు. దుబ్బాక అభివృద్ధి కోసం సీఎం రేవంత్ వస్తానంటే బస్సు చార్జీలు తానే భరిస్తానని అభివృద్ధిపై బుక్కు రెడీగా ఉందని ఏ సమయానికైనా మీడియాతో రావాలంటూ సవాల్ విసిరారు.
మోడీ పాలన చూసి ఓటేయాలని ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నానన్నారు.
ఏ సర్వేలు చూసిన మోడీ మూడోసారి ప్రధాని అవుతారని వస్తున్నాయి వీటిని ఓర్వలేకనే కాంగ్రెస్ విషపు ప్రచారం చేస్తుందని ప్రజలు అది గమనిస్తారన్నారు
ఇంకొన్ని దేశానికి చేయాల్సిన పనులు మిగిలి పోయాయి. కాబట్టి 400 సీట్లు లక్ష్యంగా ముందుకి వెళ్తున్నాం గత ప్రభుత్వాలు తీసుకొని నిర్ణయాలు మోడీ అమలు చేస్తున్నారని మోడీ ప్రభుత్వానికి హిందూ ముస్లిం అనే భేదం ఉండదని సబ్ కా సాత్ సబ్ కా వికాస్ అనే నినాదంతో ముందుకు వెళుతున్నామన్నారు.
నేను ఎమ్మెల్యేగా దుబ్బాక కి ఏమి చేశానో ఒక పుస్తకం తయారు చేసి.. మా నియోజక వర్గంలో 75 వేల మందికి పంపిణీ చేశానని రేవంత్ రెడ్డిసిఎం ఎప్పుడూ వచ్చిన సరే ..మా గడిని మీకు రిజిస్ట్రేషన్ చేసి ఇస్తాను అన్నారు దుబ్బాక అబివృద్ధి పై మీరెప్పుడు వచ్చిన నేను రెఢీ ఉన్నానని సమయం చెప్పాలన్నారు.
దుబ్బాక లో ఓడిపోయిన రఘునందన్ రావు మెదక్ లో పనికి వస్తారా ? అని హరీష్ రావు, రేవంత్ మాట్లాడుతున్నారని కామారెడ్డి లో ఓడిపోయిన కేసిఆర్ రేపటి నుంచి బస్సు యాత్ర ఎలా చేపడతారని ప్రశ్నించారు
2018 లో కొడంగల్ లో ఓడిన రేవంత్ మల్కాజ్ గిరి నుంచి పోటీ చేయలేదా! గెలుపోటంలో రాజకీయంలో సహజం అన్నారు.
బీసీ గురించి మాట్లాడుతున్న రేవంత్ రెడ్డి కేబినెట్లో బీసీల్లో ఎంతమంది మంత్రులు ఉన్నారని ప్రశ్నించారు మోడీ కేబినెట్లో 27 మంది ఓబీసీలు ఉన్నారన్నారు రేవంత్ కేబినెట్లో న్యాయం చేయాలని మీరు బీసీలకు న్యాయం చేస్తారా కాంగ్రెస్ లో ఒక్క ముదిరాజ్ mla ఉన్నాడు కదా మంత్రిని ఎందుకు చేయడం లేదంటూ ప్రశ్నించారు.
నేనుకూడా ఉద్యమాలు చేసి వచ్చా
వ్యక్తిగతంగా ఏమన్నా నేను సమాధానం చెప్పేందుకు సిద్దంగా ఉన్నానని నేను కూడా కొడంగల్ వచ్చి మీ మీద మాట్లడగల అన్నారు
దుబ్బాక ఎంత దూరమో కొడంగల్ కూడా అంతే దూరంగా అది సీఎం రేవంత్ మర్చిపోవద్దని
అప్పు తీస్తే తప్ప రాష్ట్రాన్ని నడిపే శక్తి రేవంత్ సర్కార్ దగ్గర లేదునిన్న మరో రెండు వేల కోట్లు అప్పు తెచ్చుకున్నారు అప్పు తీసుకుంటే తప్ప మీకు డిసీల్ కూడా రాదన్నారు
రేవంత్ లా డ్యుయల్ రోల్ చేయలేను
కేరళ కి వెళ్లి రేవంత్ కమ్యూనిస్టు లను తిట్టి వస్తారు
అదే సమయంలో ఇక్కడ డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క కమ్యూనిస్టు లతో చర్చలు జరుపుతారు
ఇంతకీ మేము ఎవరీ మాట నమ్మాలన్నారు
ప్రజల్ని కాపాడాల్సిన సీఎం కన్నీరు పెట్టుకుంటే ఎలా ?
రేవంత్ కి భవిష్యత్తు బాగా కనిపిస్తుందని అందుకే రేవంత్ తన సీటు గుంజుకుంటారని కన్నీరు పెడుతున్నారన్నారు.
తెలంగాణలో బీజేపీ కి డబుల్ డిజిట్ సీట్లు వస్తాయి
బీజేపీ కి డబుల్ డిజిట్ వస్తె తెలంగాణలో జరిగే పరిణామాలు ఏ విధంగా ఉంటాయో రేవంత్ కి బాగా తెలుసన్నారు
అందుకే సానుభూతి కోసం రేవంత్ రెడ్డి కొడంగల్ ప్రజల తో అలా మాట్లాడుతున్నారని తనకు ఏదైనా ఇబ్బంది ఉంటే డిజిపి కి కంప్లైంట్ చేయాలని అలా మాట్లాడడం ఏమిటి అన్నారు
కవిత కంటే ముందు సోనియా గాంధీ, రాహూల్ గాంధీ, రాబర్ట్ వాద్రా ను కూడా ఈడిపిలిచి ప్రశ్నించిందని
సోనియా ను అరెస్ట్ చేయలేదు కాబట్టి కాంగ్రెస్, బీజేపి ఒక్కటే అని ఎందుకు మాట్లాడడం లేదన్నారు
కొంత మంది కమ్యూనిస్ట్ ముసుగులో ఛానెల్స్ పెట్టుకొని బిజెపి మీద అసత్య ప్రచారాలు చేస్తున్నారు
కవిత ను అరెస్ట్ చేయకుంటే బీజేపీ, బీ అర్ ఎస్ ఒక్కటా?
గత నవంబర్ లో ఉన్న వాతావరణమే ఈరోజు ఉంది
నేతలు ఇటు నుంచి అటు వెళ్లే బదులు అటు నుంచి ఇటు వస్తె పరిస్థితి ఎంటి ?
తెలంగాణ జర్నలిస్ట్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు కప్పర ప్రసాద రావు ఏబీవీపీ పూర్వజాతీయ అధ్యక్షులు ప్రొఫెసర్ మురళీ మనోహర్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బింగి స్వామి IFWJ జాతీయ ఉపాధ్యక్షులు పెద్దపురం నరసింహ వర్కింగ్ కమిటీ మెంబర్ కపిలవాయి రవీందర్ టీజేయు రాష్ట్ర ఉపాధ్యక్షులు సాయి కృష్ణ టీజేయు రాష్ట్ర కార్యదర్శి కనకా రెడ్డి సహాయ కార్యదర్శి బాబురావు సిద్దిపేట జిల్లా అధ్యక్షులు ఎల్లయ్య మేడ్చల్ జిల్లా అధ్యక్షులు శ్రీనివాస్ రాష్ట్ర నాయకులు సిద్ధల రవి గ్రేటర్ మహబూబాబాద్ కన్వీనర్ సతీష్ హైదరాబాద్ జనరల్ సెక్రెటరీ వేముల సుదర్శన్ తదితరులు పాల్గొన్నారు
Comments
Post a Comment