బిజెపి విజయానికి కృషి చేయండి-OFBJPUK జూమ్ మీటింగ్ లో రఘునందన్ రావు
మెదక్ పార్లమెంటు కు బిజెపి అభ్యర్థిగా పోటీచేస్తున్న రఘునందన్ రావు తో (OFBJPUK) ఓవర్సీస్ ఫ్రెండ్స్ ఆఫ్ యునైటెడ్ కింగ్డమ్ వారు జూమ్ మీటింగ్ నిర్వహించారు.ఈ జూమ్ మీటింగులో ఆయన మాట్లడుతూ UKలో ఉన్న మీరు మెదక్ పార్లమెంటు లో ఉన్న మీ కాంటాక్ట్స్ కు మరియు తెలంగాణ లో ఉన్న మీ కాంటాక్ట్స్ కు రోజు కొంత సమయం కేటాయించి బిజెపి కి ఓటు వేయమని అడగాలని బిజెపి విజయానికి కృషి చేసి సహాయ, సహకారాలు అందించాలని ఆయన కోరారు. మెదక్ పార్లమెంటు నియోజవర్గ లో కొన్ని ప్రాంతాలలో పారిశ్రామికంగా అభివృద్ధి చెందినదని అలాగే మొత్తం నియోజక వర్గం లో పెరిగేందుకు కృషి చేస్తానని అన్నారు. రాజకీయాల్లోకి రావాలని ఆసక్తి ఉన్న ఎన్నారైలకు మీ సూచన ఏమిటి అన్న ప్రశ్నకు ప్రజలకు మేలు చేయాలని అనుకున్నవారు రాజకీయాల్లోకి రావచ్చని ఇది మంచి plarfarm అని అన్నారు. బిజెపి నాయకులు సురేష్ మంగళగిరి, తులసి, గుండా షణ్ముఖ, భారత్ వాసా, రంజిత్, భూపతి రాజు తదితరులు సుమారు 80 మంది పాల్గొన్నారు.
Comments
Post a Comment