TJU ఆధ్వర్యంలో విశ్వకర్మ జర్నలిస్ట్ సంఘం ప్రధాన కార్యదర్శి లక్ష్మీనారాయణకి ఘన సన్మానం.
తెలంగాణ జర్నలిస్టు యూనియన్ ఆధ్వర్యంలో విశ్వకర్మ జర్నలిస్ట్ సంఘం ప్రధాన కార్యదర్శి లక్ష్మీనారాయణకి ఘన సన్మానం.
యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి పట్టణ కేంద్రంలో శనివారం రోజున విశ్వకర్మ జర్నలిస్టు సంఘం జిల్లా కమిటీ ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.
జిల్లా ప్రధాన కార్యదర్శిగా ఏకగ్రీవంగా ఎన్నికైన మా ఆత్మీయ మిత్రుడు సీనియర్ జర్నలిస్టు పి లక్ష్మీనారాయణ మరియు జిల్లా ఉపాధ్యక్షులు కూరెళ్ళ మల్లేష్ కీ శాలువాతో సత్కరించి శుభాకాంక్షలు తెలిపిన తెలంగాణ జర్నలిస్ట్ యూనియన్ యాదాద్రి భువనగిరి జిల్లా అధ్యక్షులు మొహమ్మద్ శానూర్ బాబా
అనంతరం వారు మాట్లాడుతూ విశ్వకర్మ జర్నలిస్టుల సమస్యలపై పోరాటం చేయాలని ప్రభుత్వ నుండి రావాల్సిన పథకాల ద్వారా స్కీముల ద్వారా విశ్వకర్మ జర్నలిస్టులకు అందించే విధంగా కృషి చేయాలని కోరారు.
విశ్వకర్మ జర్నలిస్టులకు తెలంగాణ జర్నలిస్ట్ యూనియన్ అండగా ఉంటుందని తెలిపారు.
ఈ కార్యక్రమంలో తెలంగాణ జర్నలిస్టు యూనియన్ జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ గోపరాజు వెంకన్న, సీనియర్ జర్నలిస్టు దాత్రాక్ దయాకర్ , జిల్లా కార్యవర్గ సభ్యులు గట్టిగప్పుల శ్రీనివాస్ టీ జే యూ సభ్యులు గడ్డమీ సత్యనారాయణ ,శివ తదితరులు పాల్గొన్నారు.
Comments
Post a Comment