250 కోట్ల స్కాం లో రైస్ మిల్లు ఓనర్ ఇమ్మడి సోమనర్సయ్య అరెస్ట్: డి ఎస్పీ. గతంలో గూఢచారి ఈ కుంభకోణం పై వార్త కథనం
*రూ.250 కోట్ల స్కాం లో రైస్ మిల్లు ఓనర్ ఇమ్మడి సోమనర్సయ్య అరెస్ట్: డి ఎస్పీ.*
సూర్యాపేట జిల్లా రైస్ మిల్లర్స్ అసోసియేషన్ అధ్యక్షులు ఇమ్మడి సోమనర్సయ్య ను అరెస్ట్ చేసినట్లు సూర్యాపేట డిఎస్పీ రవి తెలిపారు. పోలీసులు తెలిపిన వివరాల మేరకు… సి.ఎం.ఆర్ బియ్యం ను ప్రభుత్వానికి అప్పగించకుండా కోట్లు విలువైన ధాన్యాన్ని పక్కదారి పట్టించారని తిరుమలగిరి పోలీసు స్టేషన్ లో పౌర సరఫరా శాఖ అధికారులు ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసు నమోదు చేశారు.
ఈ ఫిర్యాదు మేరకు ఇమ్మడి సోమనర్సయ్య కు చెందిన మూడు మిల్లులలో అధికారులు తనిఖీలు నిర్వహించిన విషయం తెలిసిందే. ఈ తనిఖీల్లో సుమారు రూ.250 కోట్ల విలువైన ధాన్యం మాయమైనట్టు నెల క్రితం అధికారులు గుర్తించారు. ఇందులో భాగంగానే ఆదివారం రాత్రి ఇమ్మడి సోమనర్సయ్య ను, ఇమ్మడి సోమనర్సయ్యను అరెస్ట్ చేసి జుడీషియల్ రిమాండ్ కు తరలించినట్టు సూర్యాపేట డిఎస్పీ తెలియజేశారు
.
గతం లో ఈ విషయం పై gudachari vartha
https://www.gudachari.page/2024/04/blog-post_17.html
Comments
Post a Comment