గుజ్జుల ప్రేమేంధర్ రెడ్డి కి మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలి - ఈటెల
గుజ్జుల ప్రేమేంధర్ రెడ్డి కి మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలి - ఈటెల
*ఇంత తక్కువ కాలంలో ప్రజల చేత ఛీ కోట్టించుకున్న పార్టీ కాంగ్రెస్ పార్టీ :*
*కాంగ్రెస్ పార్టీ అబద్ధాల పునాదుల మీద ఉంది:*
*ప్రజలకు పాలన అందించే శక్తి, సత్తా బీజేపీ కి మాత్రమే ఉంది:*
*ప్రజలు ఏ పార్టీ వైపు ఉండరు డైనమిక్ గా మారుతారు:*
*గుజ్జుల ప్రేమేంధర్ రెడ్డి కి మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలి : మాజీ మంత్రి, / బీజేపీ చేరికలు కమిటీ చైర్మన్/ మల్కాజ్ గిరి పార్లమెంట్ అభ్యర్థి ఈటెల రాజేందర్.*
నల్లగొండ జిల్లా బీజేపీ కార్యాలయంలో ప్రెస్ మీట్ లో
ఈటెల రాజేందర్ మాట్లాడుతూ విద్యార్థి దశ నుండి విద్యార్థుల సమస్యల కోసం పోరాడిన వ్యక్తి ప్రేమేంధర్ రెడ్డి అన్నారు,ప్రజలకు న్యాయకత్వం వహించే వ్యక్తి ఈయన అన్నారు. 40 ఏండ్ల త్యాగానికి ఎన్ని వడుదొడుకులు వచ్చిన పార్టీని అంటి పెట్టుకొని ఉన్నారు.34 నియోజకవర్గాలకు ప్రతి నియోజకవర్గంలో ఒక ఇంచార్జి ని నియమించి పట్టభద్రులను దగ్గర అయ్యేలా చేస్తాం అన్నారు.ప్రజలకు పాలన అందించే సత్తా..శక్తి ఒక్క బీజేపీ కి మాత్రమే ఉంది,కేవలం ఒక్క ప్రాంతానికి పరిమితం అనుకున్నరు కానీ దేశం అంత బీజేపీ చాలా గట్టి పోటీ ఇస్తూ ఉంది అన్నారు.17 నియోజకవర్గ ల్లో మోడీ గెలవాలి అని ప్రజలు ఓట్లు వేశారు,బీజేపీకి యువత మొత్తం సహకరించారు.బుద్ధి జీవులు అందరూ బీజేపీ కి మద్దతు గా వ్యవహరిస్తున్నారు.ఒకప్పుడు ఏమి జరుగుతుందో తెలియని పరిస్థితి కానీ నేడు మొబైల్ వల్ల క్షణాల్లో అన్ని విషయాలు తెలుస్తున్నాయి,మాకు ఐటీ ఉద్యోగుల, ప్రభుత్వ ఉద్యోగులు,యువత మా ఎన్నిక కోసం ప్రయత్నం కీలకంగా పని చేసారు.మన పట్టభద్రుల అందరూ కూడా గుజ్జుల ప్రేమేంధర్ రెడ్డి ని గెలిపించాలి అని కోరారు.ప్రజా స్వామ్యం పరిణవిల్లాలి అంటే ప్రభుత్వం స్ట్రాంగ్ గా ఉండాలి.ప్రేమేంధర్ కి ప్రజల సమస్య ల మీద పూర్తి అవగాహన ఉన్న వ్యక్తి.అతి తక్కువ కాలం లో ప్రజల చేత నుండి చీ కోట్టించుకున్న పార్టీ కాంగ్రెస్ పార్టీ,కాంగ్రెస్ పార్టీ చరిత్ర మన అందరికి తెలుసు కేసీఆర్ ని ఓడగొట్టడానికి కాంగ్రెస్ కి ఓటు వేశారు,మళ్ళీ కాలి పోయిన మోటార్లు,దందాలు,ఎండిపోయిన కాలువలు దర్శనం ఇస్తున్నాయి.ప్రతి నియోజకవర్గంలో పట్టభద్రుల తో మాట్లాడుతాం.. మేధో సంపన్న ఘర్షణ జరగాల్సిందే అలాగే అందరికి మేము ఏమి చేస్తాం అనేది చెప్పి ఓటు అడుగుతం అన్నారు.12 సీట్లు గెలుస్తుంది.ప్రజలు ఒక్క పార్టీ కి ఉండరు,75%ప్రజలు డైనమిక్ గా అవసరాలను బట్టి మారుతారు ఇది ఎవరి జాగిరు కాదు ఇది ప్రజల జాగీరు అన్నారు, భారతీయ జనతా పార్టీ రెండు సీట్ల ఉన్న పార్టీ 370 సీట్లకు వస్తుంది అంటే ప్రజలు ఏ పార్టీకి అనుకూలంగా ఉంటుంది అన్నారు. మల్లికార్జున ఖర్గే చేసిన వాక్యాల విషయం లో 370 ఆర్టికల్ రద్దు అయ్యింది, ట్రిపుల్ తాలక్ రద్దు చేశారు. అందరూ సమానమే అని మోడీ అంటున్న వీళ్లకు ఏమి లేదు కాంగ్రెస్ పార్టీ అబద్ధాల పునాదుల మీద ఉంది, ఉత్తర ప్రదేశ్ మొత్తం మోదీ జపం చేస్తుంది, స్కామ్ లు లేని ప్రభుత్వం ఉందా అని ప్రశ్నించారు. కాంగ్రెస్ వాళ్లు, ఇంత నిజాయతీ పాలన ను చూసి తట్టుకోలేరు అన్నారు. MLC ఎన్నికల ఇంచార్జి మాజీ ఎమ్మెల్సీ రాంచందర్ రావు మాట్లాడుతూ బిఆర్ ఎస్,కాంగ్రెస్ పార్టీలు కలిసి పోయాయి అన్నారు. పెద్దపల్లి ఎంపీ నేతకాని వెంకటేష్ నేత మాట్లాడుతూ ఈ మూడు జిల్లాల్లో ఉన్న పట్టభద్రులు బీజేపీ అభ్యర్థికి మొదటి ప్రాధాన్యత ఓటు వేయాలన్నారు. 3.8 ట్రిలియన్ డాలర్లు గా జిడిపి ఉంది అంటే అది మోడీ వల్లనే అన్నారు. పట్టభద్రుల అందరూ ప్రేమేంధర్ రెడ్డి ని దివించాలని కోరారు. అభ్యర్థి గుజ్జుల ప్రేమేంధర్ రెడ్డి మాట్లాడుతూ నాకు ఒక్క అవకాశం ఇవ్వాలని పట్టభద్రులను కోరుకుంటున్న మీకు సేవ చేసే అవకాశం ఇవ్వండి. ఇది ఉప ఎన్నిక గెలిచిన ఓడిన కాంగ్రెస్ పార్టీ కి ఈ సీటు అవసరం లేదు, బీఆర్ఎస్ పార్టీలో ఉన్న వాళ్లే ఉండటం లేదు, నాకు సేవ చేసే అవకాశం ఇవ్వాలని తెలిపారు. నాకు మొదటి ప్రాధాన్యత ఇవ్వాలని కోరారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా అద్యక్షులు నాగం వర్షిత్ రెడ్డి, నల్లగొండ బీజేపీ అభ్యర్థి శానంపూడి సైదిరెడ్డి, మాదగోని శ్రీనివాస్, పిల్లి రామరాజు,విరెళ్లి చంద్ర శేఖర్, గోలి మధుసూదన్ రెడ్డి, నూకల వెంకటనారాయణ రెడ్డి, పొతేపాక సాంబయ్య,శ్రీదేవి రెడ్డి, నివేదిత రెడ్డి,తదితరులు పాల్గొన్నారు.
Comments
Post a Comment