మూడు నామినేషన్లను దాఖలు.
వరంగల్ -ఖమ్మం- నల్గొండ పట్టభద్రుల నియోజకవర్గం శాసనమండలి ఉప ఎన్నికలలో భాగంగా మొదటి రోజైన గురువారం ముగ్గురు అభ్యర్థులు నామినేషన్లను దాఖలు చేశారు.
స్వతంత్ర అభ్యర్థిగా బండారు నాగరాజు ఒక సెట్ నామినేషన్ ను దాఖలు చేయగా ,ప్రజావాణి పార్టీ తరఫున పాటి శ్రీకాంత్ రెడ్డి ఒక సెట్, తెలంగాణ సకల జనుల పార్టీ నుండి నందిపాటి జానయ్య ఒక్కో సెట్ నామినేషన్లను దాఖలు చేశారు .
ఎన్నికల సంఘం ఆదేశాల ప్రకారం వరంగల్- ఖమ్మం- నల్గొండ పట్టభద్రుల నియోజకవర్గం ఉప ఎన్నికు గురువారం ఉదయం జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి,పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల రిటర్నింగ్ అధికారి దాసరి హరిచందన ఉదయం నోటిఫికేషన్ జారీ చేశారు . అనంతరం నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమైంది . గ్రాడ్యుయేట్ ఎం ఎల్ సి ఎన్నికలలో మొదటి రోజు మొత్తం ముగ్గురు అభ్యర్థులు నామినేషన్లను దాఖలు చేసినట్లు రిటర్నింగ్ అధికారి దాసరి హరిచందన తెలిపారు.
____________________________________
జారీ చేసిన వారు సహాయ సంచాలకులు, సమాచార శాఖ, నల్గొండ*
Comments
Post a Comment