జేపీ నడ్డా సభను విజయవంతం చేయండి



6.05.2024 సోమవారం రోజున జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా సభను విజయవంతం చేయాలని పిలుపునిచ్చిన జిల్లా అద్యక్షుడు డా" నాగం వర్షిత్ రెడ్డి 

నల్గొండ: 

బిజెపి జిల్లా కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా మిత్రుల సమావేశంలో  జిల్లా అధ్యక్షులు డాక్టర్ నాగం వర్షిత్ రెడ్డి  భారతీయ జనతా పార్టీ ముచ్చటగా మూడోసారి గెలుపొంది మోడీ  హ్యాట్రిక్ ప్రధానమంత్రి కావాలని చెప్పి యావత్ నల్గొండ ప్రజలకు కోరుకున్న తరుణంలో కేంద్ర పార్టీ రాష్ట్ర పార్టీ కూడా నల్గొండ పార్లమెంటు సెగ్మెంట్ మీద ప్రత్యేక దృష్టి పెట్టింది నీ అన్నారు.  అందులో భాగంగానే  జాతీయ అధ్యక్షులు జేపీ నడ్డా  6.5.2024 సోమవారం మ" 3:30 కి ఔట్ డోర్ స్టేడియం లో జరిగే భారీ బహిరంగ సభలో పాల్గొననున్నారు తర్వాత ఇంకొక మీటింగ్ ఉంటదిని,  పార్లమెంట్ సెగ్మెంట్లో మూడు బహిరంగ సభలు ఉండబోతాయి వాటికి సంబంధించి కూడా కేంద్ర స్టార్ కంపైనర్స్ పాల్గొనున్నారు అందులో భాగంగా యోగి ఆదిత్యనాథ్  కూడా వచ్చే అవకాశం ఉన్నది ఉమ్మడి జిల్లాకు సంబంధించి మోది  పర్యటనలో కూడా ఉండొచ్చు భారతీయ జనతా పార్టీ నల్గొండ పార్లమెంటు సెగ్మెంట్ గెలిపించుకోవాలని ప్రజలు సిద్ధంగా ఉన్నారు నల్గొండ పార్లమెంటు గెలుపును ఎవరు కూడా ఆపలేరని  తెలిపారు


*నల్లగొండ పార్లమెంట్ అభ్యర్థి శానంపూడి సైదిరెడ్డి  మాట్లాడుతూ*

ఈరోజు ఎక్కడికి పోయినా ఎవరితో మాట్లాడిన భారతీయ జనతా పార్టీ గెలపు తథ్యం భారతీయ జనతా పార్టీ గెలుస్తుంది అని సత్యాన్ని జీర్న్చుకోలేక భయపడి అందరు ఈ రోజు రకరకాలు మాట్లాడతాఉన్నారు ఉత్తమకుమార్ రెడ్డి  యంపి గా గెలిచినాక కనపడకుండా పోయి ఆయన ఇన్చార్జి గా ఉన్న ఇపుడు నల్లగొండ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి ని గెలిపించుకుంటాడట చూడండి మీరు ఒక్కసారి ఆలోచించండి ఐదు సంవత్సరాలు కాంగ్రెస్ ఎంపీగా ఉత్తంకుమార్ రెడ్డి ఏమన్నా చేసిండా నలగొండకు ఒక్క రూపాయి పని అయిన చెసిండా ఏమైన పెట్టుబడులు తీసుకొని వచ్చిండ నల్లగొండకి మీరు ఆలోచించండి మన నల్లగొండ గురించి గానీ నల్లగొండ సమస్యల గురించి గానీ పార్లమెంట్లో ఒక్కసారైనా మాట్లాడినడా అని ఆలోచించండి ఏ రోజు కూడా అభివృద్ధి కోసం మాట్లాడలేదు తండ్రి పేరు చెప్పుకొని తాతల పేరు చెప్పుకొని రాహుల్ గాంధీ దగ్గర నుంచి రఘువీర్ దాకా వారసత్వ రాజకీయాలు చేస్తున్నారు మీకు దమ్ము ధైర్యం ఉంటే విలేకరుల సమావేశం పెట్టండి ఈ నల్లగొండ జిల్లాకి నల్లగొండ పార్లమెంటుకి మీరేం చేశారో ఏం నిధులు తీసుకొచ్చారో చెప్పలి ఎవరు ఏమి చేయలేదు దాని గురించి మాట్లాడదాం అంతేగాని సమస్యల అవగాహన లేనీ వారు ఏమి తెలవని ఈరోజు సడన్గా ఎక్కడో వచ్చిన నాయకులకి ఓట్లు వేయటానికి సిద్ధంగా లేరు ఓట్లు అడగటానికి అసలు మీకు హక్కు లేదని చెప్పారు దాంతోపాటు ఈరోజు ఎక్కడికి పోయిన భారతీయ జనతా పార్టీ కచ్చితంగా 2 లక్షల మెజార్టీతో గెలిస్తే ఎందుకంటే ఈరోజు ఆ వాతావరణం ఉంది ప్రతి ఒక్కరూ దేశ హితాన్ని కాంక్షించడం దేశ అభివృద్ధిని కావాలనుకుంటుంది ఈ దేశంలో ఉగ్రవాదం ఉండకూడదు ఈ దేశం ప్రశాంతంగా బతకాలను దేశాన్ని నిజంగా ప్రేమించే ప్రతి ఒక్కళ్ళు ఈరోజు భారతీయ జనతా పార్టీకి ఓటేయటానికి సిద్ధంగా ఉన్నారు పిల్లల భవిష్యత్తు కోసం భావితరాల భవిష్యత్తు కోసం ఈసారి పార్టీలు చూడట్లే మతాలు చూడట్లే కులాలు చూడట్లే ఎంతసేపటికి ఒకటే ఒకటి మోడీ గారు మూడోసారి ప్రధానమంత్రి కావడమే లక్ష్యంగా భారతీయ జనతా పార్టీ కమలం గుర్తు ఓటు వేసి మూడో తారీకు నరేంద్ర మోడీ గారిని ప్రధానమంత్రి చేయడం లక్ష్యంగా ప్రజలు కోరుకుంటున్నారు నల్లగొండ పార్లమెంటు 2 లక్షల నుంచి 5 లక్షల మెజారిటీతో గెలిపించే గెలిపించేందుకు సిద్ధంగా ఉన్న నల్గొండ ప్రజలు మా కార్యకర్తలు 45 డిగ్రీల ఎండలు ఉన్న మొక్కవోని దీక్షతో ప్రతి బూతులు ప్రచారం చేస్తూ ఉన్నారు వారికి పేరుపేరునా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను 400 సీట్లలో నల్లగొండ కూడా ఒకటి గెలవబోతున్నది . 6.5.2024 రోజున భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షులు జేపీ నడ్డా  బారి బహిరంగ సభ ను భారతీయ జనతా పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొని సభను విజయవంతం చేయాలనీ పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యవర్గ సభ్యులు నూకల నరసింహారెడ్డి, కన్మంత రెడ్డి శ్రీదేవి రెడ్డి, పార్లమెంట్ కన్వీనర్ బండారు ప్రసాద్, పార్లమెంట్ కోకన్వీనర్ పిల్లి రామరాజు, జిల్లా ప్రధాన కార్యదర్శి పోతేపాక లింగస్వామి, జిల్లా కార్యదర్శి కంచర్ల విద్యాసాగర్ రెడ్డి, అసెంబ్లీ కన్వీనర్ దాయం భూపాల్ రెడ్డి, జిల్లా మీడియా కన్వీనర్ గడ్డం మహేష్ , యువ మోర్చా జిల్లా అధ్యక్షుడు వంగూరి రాఖీ, యువ మోర్చ ప్రధాన కార్యదర్శి రేబిల్లి కిరణ్ యువ మోర్చ జిల్లా కార్యదర్శి గుండ్లపల్లి శాంతి స్వరూప్ లు పాల్గొన్నారు.....

Comments

Popular posts from this blog

250 కోట్ల స్కాం లో రైస్ మిల్లు ఓనర్ ఇమ్మడి సోమనర్సయ్య అరెస్ట్: డి ఎస్పీ. గతంలో గూఢచారి ఈ కుంభకోణం పై వార్త కథనం

తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ ఎన్నికలకు అంగీకరించిన అమరవాది - మిడిదొడ్డి శ్యామ్ సుందర్

తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ అధ్యక్ష పదవి కొత్తవారికి అవకాశం కల్పించాలి - మిడిదొడ్డి శ్యామ్