టీపీసీసీ ప్రచార కమిటీ కో కన్వీనర్గా ‘ఉప్పల శ్రీనివాస్ గుప్త
టీపీసీసీ ప్రచార కమిటీ కో కన్వీనర్గా ‘ఉప్పల శ్రీనివాస్ గుప్త
హైద్రాబాద్:
టీపీసీసీ ప్రచారకమిటీ రాష్ట్ర కో-కన్వీనర్ టూరిజం డెవలప్మెంట్ కార్పొ రేషన్ మాజీ చైర్మన్ ఉప్పల శ్రీనివాస్గుప్తా నియమితు లయ్యారు. ఈ మేరకు కన్వీనర్ మధుయాష్కీగౌడ్ గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. ఈ సందర్భం గా మధుయాష్కీగౌడ్ మాట్లాడుతూ.. గత పది సంవ త్సరాలుగా ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్ రాష్ట్ర అధ్య క్షుడిగా కొనసాగుతూనే గత ప్రభుత్వంలో టూరిజం కార్పొరేషన్ చైర్మన్ గా సేవలు అందించారన్నారు. ప్రజలతో ఆయనకు ఉన్న సత్సంబంధాలను గుర్తించి పదవిని అప్పగించడం జరిగిందన్నారు. ఉప్పల శ్రీని వాస్ గుప్తా మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీకి తన సేవ లు ఎలా వినియోగించుకోవాలో తెలుసన్నారు. సేవా నిరతి, పార్టీ పట్ల అంకితభావం, క్రమశిక్షణ కలిగిన నాయకుడిగా తనకు అప్పగించిన బాధ్యతలను సమర్థ వంతంగా నిర్వహించి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల వి జయానికి తన వంతు కృషి చేస్తానన్నారు. తన నియ మాకానికి సహకరించిన సీఎం రేవంత్రెడ్డి, మధు యాష్కీలకు కృతజ్ఞతలు తెలిపారు. ఉప్పల శ్రీనివాస్ గుప్తా నియామకం పట్ల తెలంగాణ వ్యాప్తంగా పలు ఆర్యవైశ్య సంఘాలు, పలువురు ఆర్యవైశ్యులు, రాజ కీయ ప్రముఖులు, ప్రముఖ పారిశ్రామిక వ్యాపారవే త్తలు హర్షం వ్యక్తం చేశారు
Comments
Post a Comment