జిల్లా బిజెపి మహిళా మోర్చ అధ్యక్షురాలిగా ఒక సామాన్య బీజేపీ మహిళా కార్యకర్త శ్రీమతి రావెల్ల కాశమ్మ


 జిల్లా బిజెపి మహిళా మోర్చ  అధ్యక్షురాలిగా ఒక సామాన్య బీజేపీ మహిళా కార్యకర్త శ్రీమతి రావెల్ల కాశమ్మ

నల్గొండ: 

ఒక సామాన్య బీజేపీ మహిళా కార్యకర్త శ్రీమతి రావెల్ల కాశమ్మ మొక్కవోని దైర్యంతో ఎన్నో పోలీస్ కేసులు ఎదుర్కొని, పలుమార్లు జైలు పాలైన ,పార్టీలో ఎంతో మంది మహిళా నాయకురాలు సూటి పోటీ మాటలతో విమర్శించిన ,తను నమ్మిన సిద్ధాంతం కోసం ,తను నమ్ముకున్న పార్టీ కోసం గత 30 సంవత్సరాలు గా పార్టీ లో భాధ్యత వున్న లేకున్నా,పని చేస్తూ పార్టీ అభివృధి కోసం ఎన్నో కార్యక్రమాలు చేస్తూ, ఈసారి జిల్లా మహిళా మోర్చ అధ్యక్షురాలిగా బాధ్యతలు స్వీకరించడం అభినందనీయమని కార్యకర్తలు అభిప్రాయ పడుతున్నారు.


కాశమ్మ కు చదువు రాదని, ఆస్తి లేదని పార్టీ లో భాద్యతలు ఇవ్వవద్దని కొంత మంది లీడర్స్ ప్రయత్నం చేసిన ఒక సామాన్య కార్యకర్తను జిల్లా అధ్యక్షురాలిగా చేసిన జిల్లా బీజేపీ నాయకత్వం అభినందనీయమని కార్యకర్తలు అంటున్నారు.


శ్రీమతి కాశక్కగా పిలువ బడుతున్న పాత బస్తీ ముద్దుబిడ్డ,ఎంతో మంది మహిళలకు ఆదర్శనీయం కషక్క జీవితం.ఎన్నో విమర్శలు వచ్చిన ఎవరు ఎన్ని మాటలు అన్న పట్టించుకోకుండా తను నమ్మిన సిద్ధాంతం కోసం పని చేస్తూ పార్టీని జిల్లాలో ఇప్పటికే బలోపేతం చేస్తున్న కాశక్కకు మరోసారి అభినందనలు తెలిపారు కార్యకర్తలు.


కాశక్క పట్ల చదువు రాదని,అవగాహన లేదని,పార్టీ తప్పుడు నిర్ణయం తీసుకుందని చెప్పే వారికి కాశక్క తన అధ్యక్షురాలు పనితనంతో వారికి సమాధానం చెబుతుందని భావిస్తున్నారు

Comments

Popular posts from this blog

250 కోట్ల స్కాం లో రైస్ మిల్లు ఓనర్ ఇమ్మడి సోమనర్సయ్య అరెస్ట్: డి ఎస్పీ. గతంలో గూఢచారి ఈ కుంభకోణం పై వార్త కథనం

తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ ఎన్నికలకు అంగీకరించిన అమరవాది - మిడిదొడ్డి శ్యామ్ సుందర్

తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ అధ్యక్ష పదవి కొత్తవారికి అవకాశం కల్పించాలి - మిడిదొడ్డి శ్యామ్