పార్లమెంటు ఎన్నికల ఓట్ల లెక్కింపు కేంద్రంలో ఏర్పాట్లను తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ దాసరి హరిచందన
@ అని శెట్టి దుప్పలపల్లి గోదాంలో పార్లమెంటు ఎన్నికల ఓట్ల లెక్కింపు కేంద్రంలో ఏర్పాట్లను తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ దాసరి హరిచందన
నల్గొండ పట్టణ సమీపంలోని
అని శెట్టి దుప్పలపల్లి వద్ద ఉన్న గోదాములో పార్లమెంటు ఎన్నికల ఓట్ల లెక్కింపుకై ఏర్పాటు చేసిన కౌంటింగ్ కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ దాసరి చందన ఆదివారం తనిఖీ చేశారు.
ఓట్ల లెక్కింపు కు ఏర్పాటు చేసే టేబుళ్లు ,బ్యారీకేడింగ్, ఏజెంట్లు బ్యారేడింగ్ ,భద్రత, తదితరాలను పరిశీలించారు .అంతేకాక ఓట్ల లెక్కింపుకు రెండు రోజుల ముందు నుండి కేంద్ర ఏన్నికల సంఘం పరి శీలకులు, రిటర్నింగ్ అధికారితో పాటు, సహాయ రిటర్నింగ్ అధికారులు అందరూ అక్కడే బస చేసేందుకు వసతి చూడాలని ఆదేశించారు.
జిల్లా కలెక్టర్ వెంట జిల్లా రెవెన్యూ అధికారి డి. రాజ్యలక్ష్మి ,డిఆర్ డి ఏ నాగిరెడ్డి ,నల్గొండ ఆర్డీవో రవికుమార్,పంచాయతీ రాజ్ ఈ ఈ భూమన్న, తదితరులు ఉన్నారు
____________________________________
జారీ చేసిన వారు సహాయ సంచాలకులు, సమాచార శాఖ, నల్గొండ*
Comments
Post a Comment