MLC ఉప ఎన్నిక స్థానానికి 5 గురు అభ్యర్థులు (7) సెట్ల నామినేషన్లు దాఖలు
MLC ఉప ఎన్నిక స్థానానికి 5 గురు అభ్యర్థులు (7) సెట్ల నామినేషన్లు దాఖలు
వరంగల్- ఖమ్మం- నల్గొండ పట్టభద్రుల నియోజకవర్గ శాసనమండలి ఉప ఎన్నిక స్థానానికి రెండవ రోజైన (3-5-2024) శుక్రవారం 5 గురు అభ్యర్థులు (7) సెట్ల నామినేషన్లు దాఖలు చేశారు.
కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా తీన్మార్ మల్లన్న (2) సెట్లు నామినేషన్ దాఖలు చేయగా, స్వతంత్ర అభ్యర్థులుగా మాధవ పెద్ది వెంకట్ రెడ్డి (1) సెట్, చాలిక చంద్రశేఖర్ (2) సెట్లు నామినేషన్ దాఖలు చేశారు. అలియన్స్ డెమొక్రటిక్ రీఫార్మ్స్ పార్టీ అభ్యర్థిగా ఈడ.శేషగిరిరావు(1) సెట్, తెలంగాణ సకలజనుల పార్టీ అభ్యర్థిగా నందిపాటి జానయ్య (1)సెట్ ( ఈనెల 2 న ఒక సెట్,ఈరోజు మరో సెట్ దాఖలు చేశారు) నామినేషన్ దాఖలు చేశారు.
నామినేషన్ పత్రాలను నల్గొండ కలెక్టరేట్ లోని రిటర్నింగ్ అధికారి కార్యాలయంలో ములుగు జిల్లా రెవిన్యూ అదనపు కలెక్టర్ , పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారి, సిహెచ్. మహేందర్ జీ కి సమర్పించారు.
____________________________________
జారీ చేసిన వారు సహయ సంచాలకులు, సమాచార శాఖ, నల్గొండ*
Comments
Post a Comment