ఆర్టీఐ దరఖాస్తు తిరస్కరించిన Pio పై ఫిర్యాదు చేస్తాం - ప్రముఖ హైకోర్టు అడ్వకేట్ సాయికుమార్.
ఆర్టీఐ దరఖాస్తు తిరస్కరించిన Pio పై ఫిర్యాదు చేస్తాం - ప్రముఖ హైకోర్టు అడ్వకేట్ సాయికుమార్.
హైద్రాబాద్: అడ్వకేట్ ముచువల్లి ఎయిడెడ్ కో ఆపరేటివ్ సొసైటీ లిమిటెడ్ హైద్రాబాద్ కు సంభందించిన సమాచారం కొరకు ఆ సొసైటీ మెంబర్ అయిన ప్రముఖ హైకోర్టు అడ్వకేట్ సాయికుమార్ సమాచార హక్కు చట్టం క్రింద హైద్రాబాద్ జిల్లా కో ఆరేటివ్ అధికారి ఆఫీసు పౌర సమాచార అధికారికి ఆర్టీఐ దరఖాస్తు చేసినట్లు తెలిపారు. అట్టి దరఖాస్తును ఆ కార్యాలయ PIO తిరస్కరించారని దానిపై ఫిర్యాదు చేస్తామని, లీగల్ గా ప్రొసీడ్ అవుతామని తెలిపారు.
దరఖాస్తు లో ఐదు అంశములకు కోరామని, ముఖ్యంగా సొసైటీ నిధుల నుండి దాదాపు 2 కోట్ల తో ప్రస్తుత మరియు పాత డైరెక్టర్లు కు సూట్ లు మరియు గోల్డ్ కాయిన్స్ ఇస్తున్నారని, ఇది సొసైటీ ఫండ్స్ ను దుర్వినియోగ పర్చినట్లు అవుతుందని, ఈ కార్యక్రమం విరమించుకోవాలని కోరుతూ దాదాపు 40 మంది సభ్యుల సంతకాలతో సొసైటీ సెక్రటరి కి లేఖ ఇచ్చామని ఆ లేఖ పై ఎలాంటి చర్యలు తీసుకున్నరో సమాచారం ఇప్పించవలసిందిగా PIO ను కోరారు. దానికి ఆ కార్యాలయ pio దరఖాస్తు ను సేక్షన్ 8 (జె) క్రింద తిరస్కరించారని ఇది ఆర్టీఐ చట్టానికి వ్యతిరేకం అని, దీనిపై సెక్షన్ 18(1) క్రింద ఫిర్యాదు చేస్తామని, ఇంకా చట్టపరంగా చర్యలకు ప్రొసీడ్ అవుతామని తెలిపారు.
దరఖాస్తు మరియు తిరస్కరణ డాక్యుమెంట్స్ ఈ క్రింది లింక్ ను ఓపెన్ చేసి చూడొచ్చు
https://drive.google.com/file/d/1yMlEAde0o-IwYC1hOmZxGeu_PG0-fDXn/view?usp=drivesdk
Comments
Post a Comment