Posts

Showing posts from June, 2024

TMC పాలిత పశ్చిమ బెంగాల్‌లో షరియా కోర్టుల ఉనికి

Image
  బ్రేకింగ్ న్యూస్ : తాజెముల్ (ఈ ప్రాంతంలో జెసిబిగా ప్రసిద్ధి చెందింది)గా గుర్తించబడిన ఒక వ్యక్తి, ఒక మహిళను నిర్దాక్షిణ్యంగా కొట్టినట్లు చూపించే షాకింగ్ వీడియో బయటపడింది.  తన 'ఇన్సాఫ్' సభ ద్వారా 'త్వరిత న్యాయానికి' పేరుగాంచిన తాజెముల్, చోప్రా ఎమ్మెల్యే హమీదుర్ రెహమాన్‌కు సన్నిహితుడు.  TMC పాలిత పశ్చిమ బెంగాల్‌లో షరియా కోర్టుల ఉనికి గురించి ఆందోళనలు లేవనెత్తుతున్నాయి, శాంతి భద్రతలు క్షీణిస్తున్నాయని చాలా మంది ఇలాంటి సంఘటనలను సూచిస్తున్నారు.

ప్రభుత్వ ఉపాధ్యాయుని నుండి పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్

Image
  ప్రభుత్వ ఉపాధ్యాయుని నుండి పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ తెలంగాణ పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ గా నియామకమైన E వెంకట నరసింహారెడ్డి. 1989 DSC ద్వారా జిల్లా ఫస్ట్ ర్యాంకుతో SA Maths గా ఉమ్మడి మెదక్ జిల్లా గజ్వేల్ మండలం అహ్మదీపూర్ జగదేవపూర్ మండలం మునిగడపలో స్కూల్ అసిస్టెంట్ మ్యాథ్స్ గా విధులు నిర్వహించి GROUP 1 అధికారిగా 1995లో నియామకము కాబడి ఎన్నో ప్రభుత్వాల వద్ద అంకిత భావం కలిగిన అధికారిగా గుర్తింపు పొంది 2017 లో IAS హోదా, నేడు పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ గా నియామకమైనారు. గ్రామీణ ప్రాంతం నుండి ఎదిగిన విద్యా కుసుమం E V నరసింహారెడ్డి తండ్రిగారు కూడా గెజిటెడ్ ప్రధానోపాధ్యాయులు. ఉపాధ్యాయుని కుమారునిగా ప్రభుత్వ ఉపాధ్యాయునిగా ప్రస్థానం ప్రారంభించి గ్రామీణ ప్రాంతం నుండి ప్రస్థానం ప్రారంభించి పట్టుదలతో తెలంగాణ పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ స్థాయికి ఎదిగిన EV నరసింహారెడ్డి .

వరంగల్ టెక్స్ టైల్ పార్కులో మొక్కలు నాటిన మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి

Image
  వరంగల్ టెక్స్ టైల్ పార్కులో మొక్కలు నాటిన మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి  🌳తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న వన మహోత్సవంలో ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి, అటవీశాఖ మంత్రి శ్రీమతి కొండా సురేఖతో కలిసి వరంగల్ టెక్స్ టైల్ పార్కులో మొక్కలు నాటిన *తెలంగాణ రాష్ట్ర రోడ్డు భవనములు మరియు సినిమాటోగ్రఫీ శాఖ మంత్రివర్యులు శ్రీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి గారు. అంతకుముందు వనమహోత్సవం లోగోను ఆవిష్కరించడం జరిగింది.

డి.శ్రీ‌నివాస్ కు (డీఎస్‌) అధికారిక లాంఛ‌నాల‌తో అంత్య‌క్రియ‌లు

Image
 డి.శ్రీ‌నివాస్ కు (డీఎస్‌) అధికారిక లాంఛ‌నాల‌తో అంత్య‌క్రియ‌లు పీసీసీ మాజీ అధ్య‌క్షుడు డి.శ్రీ‌నివాస్ కు (డీఎస్‌) అధికారిక లాంఛ‌నాల‌తో అంత్య‌క్రియ‌లు డీఎస్ కు అధికారిక లాంఛ‌నాల‌తో అంత్య‌క్రియ‌ల‌కు త‌గిన ఏర్పాట్లు చేయాల‌ని సీఎస్‌ను ఆదేశించిన ముఖ్య‌మంత్రి రేవంత్‌రెడ్డి

ధర్మపురి శ్రీనివాస్‌ కన్నుమూత

Image
 *కాంగ్రెస్‌ సీనియర్‌ నేత ధర్మపురి శ్రీనివాస్‌ కన్నుమూత* హైదరాబాద్‌: కాంగ్రెస్‌ సీనియర్‌ నేత, రాజ్యసభ మాజీ సభ్యుడు ధర్మపురి శ్రీనివాస్‌ కన్నుమూశారు. హైదరాబాద్‌లోని తన నివాసంలో తెల్లవారుజామున 3 గంటలకు ఆయన తుది శ్వాస విడిచారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన.. గుండెపోటుతో చనిపోయినట్లు కుటుంబసభ్యులు తెలిపారు. నిజామాబాద్‌ జిల్లాకు చెందిన డీఎస్‌ కాంగ్రెస్‌ పార్టీలో అంచెలంచెలుగా ఎదిగారు. ఉమ్మడి ఏపీలో పార్టీ అధికారంలో ఉన్నప్పుడు డీఎస్‌ మంత్రిగా సేవలందించారు. పీసీసీ అధ్యక్షుడిగానూ ఆయన పనిచేశారు. రాష్ట్ర విభజన తర్వాత 2015లో భారాసలో చేరిన డీఎస్‌ రాజ్యసభ సభ్యుడిగా ఎన్నికయ్యారు. అనంతరం మళ్లీ కాంగ్రెస్‌ కండువా కప్పుకొన్నారు. డీఎస్‌కు ఇద్దరు కుమారులు ఉన్నారు. వారిలో చిన్న కుమారుడు ధర్మపురి అర్వింద్‌ ప్రస్తుతం బీజేపీ తరఫున నిజామాబాద్‌ ఎంపీగా ఉన్నారు. పెద్ద కుమారుడు సంజయ్‌ గతంలో నిజామాబాద్‌ మేయర్‌గా పనిచేశారు. 1948 సెప్టెంబర్ 27న జన్మించిన డీఎస్‌ నిజాం కళాశాల నుంచి డిగ్రీ పూర్తిచేశారు. 1989లో కాంగ్రెస్‌ పార్టీ తరపున బరిలోకి దిగిన ఆయన నిజామాబాద్‌ అర్బన్‌ నుంచి తొలి సారి అసెంబ్లీకి ఎన్నికయ్యా

కౌటికే విఠల్ కు సన్మానం

Image
 LIAFI-1964 యొక్క 75వ ఆల్ ఇండియా ఎగ్జిక్యూటివ్ కమిటీ సమావేశంలో కౌటికే విఠల్ కు సన్మానం *దేశం యొక్క ప్రముఖ జీవిత బీమా సలహాదారు మరియు CLIA డెవలప్‌మెంట్ కమిటీ ఆఫ్ ఇండియా ఛైర్మన్ కౌటికే విఠల్ భువనేశ్వర్‌లో జరిగిన LIAFI-1964 యొక్క 75వ ఆల్ ఇండియా ఎగ్జిక్యూటివ్ కమిటీ సమావేశంలో సన్మానించబడ్డా రు. అక్కడ అయన ప్రసంగిచారు. ఈ ముఖ్యమైన సంఘటన భారతదేశం అంతటా LIAFI-1964 నుండి 262 మంది నాయకులను ఒకచోట చేర్చింది.*

శ్రీ ఉజ్జనీ మహంకాళి ఆలయములో "స్వర్ణ పుష్పార్చన" యొక్క నకిలీ టిక్కెట్లను విక్రయించి అక్రమాలకు పాల్పడిన వారి పై చర్యలు తీసుకోండి

Image
 శ్రీ ఉజ్జనీ మహంకాళి ఆలయములో  "స్వర్ణ పుష్పార్చన" యొక్క నకిలీ టిక్కెట్లను విక్రయించి అక్రమాలకు పాల్పడిన వారి పై చర్యలు తీసుకోండి శ్రీ ఉజ్జనీ మహంకాళి ఆలయములో  "స్వర్ణ పుష్పార్చన" యొక్క నకిలీ టిక్కెట్లను విక్రయించి అక్రమాలకు పాల్పడిన ఉద్యోగులు   రెడ్ హ్యాండిల్గా పట్టుబడ్డారని వారి పై  ప్రొసీడింగ్స్ జారీ చేసారని, గత ప్రభుత్వ నాయకుల ప్రభావం తో వారి పై చర్యలు తీసుకోలేదని, అంతేకాకుండా వారికి   ప్రమోషన్లు ఇచ్చారని ఆరోపిస్తూ వారిపై చర్యలు తీసుకోవాలని, బదిలీ చేయాలని శ్రీ ఉజ్జయిని మహాకాళి  మాణిక్యాలమ్మ సేవా సమితి 16 మంది సభ్యులు కమిషనర్ కు ఫిర్యాదు చేశ్చారు.  దేవాలయాలలో నిధులు మరియు ఆభరణాలను దుర్వినియోగం చేశారనే ఆరోపణలు ఎదుర్కొన్న  మరియు  భక్తులచే ఇవ్వబడిన  కానుకలు  దుర్తినియోగ పరిచారని అభియోగములు ఎదుర్కొన్న ఉద్యోగులుపై చట్టపరమైన  చర్యలు కూడా జారీ అయ్యాయని కానీ గత ప్రభుత్వ నాయకుల ప్రభావం తో చర్యలు జరుగలేదని,  ఎండోమెంట్ విభాగం నిబంధనల ప్రకారం వారిని  ఇతర ఆలయాలకు బదిలీ చేసినప్పటికీ, వారు సికింద్రాబాద్లోని శ్రీ ఉజ్జనీ మహంకాళి ఆలయంలో సిబ్బంది ఇప్పటికీ పనిచేస్తున్నారని వార్తా పత్ర

పెళ్లి నెపంతో మైనర్ బాలికను లైంగికంగా వేధించిన కానిస్టేబుల్ అరెస్టు, రిమాండ్‌

Image
  పెళ్లి నెపంతో మైనర్ బాలికను లైంగికంగా వేధించినందుకు గాను RGIA పోలీస్ స్టేషన్‌కు చెందిన కానిస్టేబుల్ G.ప్రదీప్‌ను రాజేందర్‌నగర్ పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు....బాధిత మైనర్ బాలిక ఫిర్యాదుపై లైంగిక వేధింపులు & బెదిరింపు కేసు నమోదు  

హర్యాన గవర్నర్ దత్తన్న మనవరాళ్లతో ప్రధానమంత్రి మోడీ...

Image
 

నిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న చెంచు ఈశ్వరమ్మ ను పరామర్శించిన మంత్రి సీతక్క...

Image
 నిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న చెంచు ఈశ్వరమ్మ ను పరామర్శించిన మంత్రి సీతక్క... ఈ సందర్బంగా ఆమె కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పిన మంత్రి, ఆమెకు జరుగుతున్న చికిత్స వివరాలను అడిగి తెలుసుకున్నారు... ఇటీవల కొల్లాపూర్ పరిధిలోని మూల చింతలపల్లి లో పొలం పనులకు రాలేదన్న కారణంతో కొంతమంది ఈశ్వరమ్మపై దాడి చేసి తీవ్రంగా గాయపరిచిన విషయం తెలిసిందే...

కాశీ సత్రం గౌరవ చైర్మన్ T G వెంకటేష్ ఆదేశానుసారం ఖైరతాబాద్ లో అడహాక్ కమిటీ మీటింగ్

Image
 కాశీ సత్రం గౌరవ చైర్మన్ T G వెంకటేష్ ఆదేశానుసారం ఖైరతాబాద్ లో అడహాక్ కమిటీ మీటింగ్ హైద్రాబాద్:  కాశీ సత్రం గౌరవ చైర్మన్ T G వెంకటేష్ ఆదేశానుసారం అందరు సభ్యులు అంటే adahoc committee, స్పెషల్ invitees, బిల్డింగ్ society సభ్యుల తో ఒక మీటింగ్ తేదీ 1/7/2024 నాడు హైదరాబాద్ లో T G గారి ఖైరతాబాద్ ఆఫీస్ లో సాయంత్రం 4 గంటలకు జరుగుతుందని వచ్చేవారందరికి వసతి కల్పించబడునని, ఇందుకు వచ్చే వివరాలు హెడ్ ఆఫీస్ లో తెలుపగలరని ఆడ హాక్ కమిటీ మెంబర్ బచ్చు విలాస్ సోషల్ మీడియా ద్వారా సభ్యులకు తెలుపినట్లు సమాచారం.

పేద కుటుంబానికి మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి అపన్న హస్తం

Image
*పేద కుటుంబానికి మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి అపన్న హస్తం* *ప్రమాదంలో మృతి చెందిన షేక్ నజీర్ కుటుంబానికి లక్ష రూపాయల ఆర్థిక సహాయం* *కనగల్ మండల కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ద్వారా కుటుంబానికి అందజేత* ************************************************** NLG: రాష్ట్ర రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖామంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి గారు మరోసారి మానవత్వం చాటుకున్నారు.ప్రమాదంలో పెద్దదిక్కు కోల్పోయిన కుటుంబానికి అండగా నిలిచి ఆర్థిక సహాయం అందించారు. కనగల్ మండలం ఇస్లాం నగర్ గ్రామానికి చెందిన షేక్ నజీర్ రాయి పనికి వెళ్లి ప్రమాదవశాత్తు రాయి మీద పడి ఈ నెల 24న మృతి చెందాడు.మృతునికి మూగ భార్య, కొడుకు, కూతురు ఉన్నారు. ఈ విషయం కాంగ్రెస్ పార్టీ శ్రేణులు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి దృష్టికి తీసుకెళ్లగా వెంటనే స్పందించి మంత్రి లక్ష రూపాయలను ఆ కుటుంబానికి అందజేయాలని ఆదేశించారు. దీంతో కనగల్ మాజీ జెడ్పిటిసి నర్సింగ్ శ్రీనివాస్ గౌడ్,మండల యూత్ అధ్యక్షుడు కూసుకుంట్ల రాజిరెడ్డి, చర్లగౌరారం మాజీ సర్పంచ్ వెంకన్న తదితరులు బుధవారం మృతుడు షేక్ నజీర్ ఇంటికి వెళ్లి కుటుంబ సభ్యులను పరామర్శించారు. అనంతరం మంత్రి కోమ

రాష్ట్రంలో నేడు ఏబీవిపీ బంద్ కు పిలుపు

Image
 రాష్ట్రంలో నేడు ఏబీవిపీ బంద్ కు పిలుపునిచ్చింది.  రాష్ట్ర ప్రభుత్వం కొలువుతీరి ఆరు నెలలు గడుస్తున్నప్పటికీ విద్యాశాఖ మంత్రిని నియమించలేదని, ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు నాణ్యమైన ఆహారం విద్య అందడం లేదని వాళ్లు డిమాండ్లు రాష్ట్ర ప్రభుత్వం ముందు పెట్టి బంద్ కు పిలుపునిచ్చింది. ఈ నేపథ్యంలో యూసఫ్ గూడా లో ఓ పాఠశాల ముందు నిరసన వ్యక్తం చేస్తున్న ఏబీపీ కార్యకర్తలను నాయకులను మధురానగర్ పోలీస్ లు అరెస్టు చేసి పోలీస్ స్టేషన్కు తరలించారు. అరెస్టు చేసిన వారిలో ఏబివిపి రాష్ట్ర ఎగ్జిక్యూటివ్ నెంబర్ నందు తో పాటు పలువురు కార్యకర్తలను అరెస్టు చేశారు.

రేపు నల్గొండ కి రానున్న కొంపెల్లి మాధవి లత...

Image
  రేపు  నల్గొండ కి రానున్న కొంపెల్లి మాధవి లత... Nalgonda 24th June (Gudachari) నల్గొండ పట్టణం మర్రిగూడెం బైపాస్ రోడ్డు ప్రక్కన ఒక పొలంలో వేలసినటువంటి శ్రీశ్రీశ్రీ కళ్యాణ కనకదుర్గమ్మ దేవాలయం మొదటి వార్షికోత్సవ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా ప్రముఖ ఆధ్యాత్మికవేత బిజెపి సీనియర్ నాయకులు హైదరాబాద్ పార్లమెంట్ ఇంచార్జ్ కొంపల్లి మాధవి లత మంగళవారం ఉదయం 11 గంటలకు పాల్గొని ప్రత్యేకమైన పూజలు నిర్వహించనున్నారు.. అనంతరం పాతబస్తీ హనుమాన్ నగర్ లో నిర్మాణం అవుతున్న శ్రీశ్రీశ్రీ అభయాంజనేయ స్వామి దేవాలయం లో స్వామివారి దర్శనం చేసుకొని తిరిగి హైదరాబాద్ బయలుదేరుతారు..

IAS ట్రాన్స్ఫర్స్

Image
  IAS ట్రాన్స్ఫర్స్  

ఫ్రీ లాంఛ్, రియల్ ఎస్టేట్ పేరుతో కుచ్చు టోపీలు పెట్టిన పలువురు - ఆర్యవైశ్యులారా! సూటు బూటు లతో మీ ముందుకు వచ్చే వారి పట్ల జర జాగ్రత్త !

Image
   ఫ్రీ లాంఛ్, రియల్ ఎస్టేట్ పేరుతో కుచ్చు టోపీలు పెట్టిన పలువురు - ఆర్యవైశ్యులారా! సూటు బూటు లతో మీ ముందుకు వచ్చే వారి పట్ల జర జాగ్రత్త ఉండండి రియల్ ఎస్టేట్ లో లాభాలు ఇప్పిస్తామని, ప్రీలాంఛ్ పేరుతో పలువురు వైశ్యులు కుచ్చు టోపీ పెట్టిన సంఘటనలు ఈ మధ్య చాలా నే జరిగాయి.  ఇటీవల పలు పత్రికల్లో వచ్చిన వార్తలు చూడండి రియల్ ఎస్టేట్ పేరుతో వైశ్య కమ్యూనిటీ కొలిచే అమ్మవారి పేరు మీద వెంచర్లు మొదలు పెట్టి అమాయకులైన ఆర్యవైశ్యలను మభ్యపెట్టి విలువ లేని భూములు అంటగడుతూ పబ్బం గడుపుతున్న కొందరు, వైశ్య కమ్యూనిటీ పేరుతో వ్యాపార గ్రూప్ లు లతో రోజుకో కొత్త కార్యక్రమం పెట్టి సినీ, టివి కళాకారులతో కార్యక్రమాలు చేస్తూ సూట్ బూట్ లతో మన మధ్యనే తిరుగుతున్న వ్యక్తుల పట్ల జాగ్రత్త గా ఉండి పెట్టుబడి పెట్టే ముందు లీగల్ గా ఉన్నాయా? భవిష్యత్తులో లో విలువ పెరుగుతుందా లేదా పరిశీలించుకొని ముందుకు సాగాలని కోరుతున్న గూఢచారి.  సూట్ బూట్ల తో, తలక్కున మెరిసే జిమ్మిక్కులతో, గొప్ప సేవా భా వమున్న వైశ్య దాతల డబ్బుల తో తామే సేవలు చేస్తున్నట్లు మీ ముందుకు వచ్చి లాభాలు ఇప్పిస్తాం అంటూ వెంచర్లు, ఇతర వ్యాపార స్కీమ్ ల తీసుకొస్తున్న వారి

అక్రెడిటషన్ కార్డ్ పై స్టిక్కర్ వేయించుకొండి

Image
  అక్రెడిటషన్ కార్డ్ పై స్టిక్కర్ వేయించుకొండి    రాష్ట్ర ప్రభుత్వం జర్నలిస్టుల అక్రెడిటషన్  కార్డుల కాల పరిమితిని మరో 3 నెలల పాటు( 30.9.2024) పొడగించినందున ,అక్రెడిటషన్ కార్డ్ పై స్టిక్కర్ వేయడం జరుగుతున్నదనీ.   డి పి ఆర్ ఓ కార్యాలయంలో  అక్రెడిటషన్ కార్డ్ పై స్టిక్కర్ వేయించుకోవాలని నల్గొండ జిల్లా పౌర సంబంధాల అధికారి AD వెంకటేశ్వర్లు  కొరారు. బ్యూరోలు,స్టాఫ్ రిపోర్టర్లకు ఈ విషయం తమ తమ నియోజకవర్గ,మండల స్థాయి జర్నలిస్టులకు తెలియజేయాలని అయన విజ్ఞప్తి చేశారు.

తెలంగాణకు 'డెంగీ' ముప్పు

Image
 *ఒకేసారి 4 వేరియంట్ల దాడి* *తెలంగాణకు 'డెంగీ' ముప్పు* *ప్రపంచ ఆరోగ్యసంస్థ హెచ్చరిక*  *పట్టణీకరణ, వాతావరణ మార్పులతో దోమల విజృంభణ*  *ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని సూచన*  ఈసీజన్‌లో తెలంగాణకు 'డెంగీ' ముప్పు పొంచి ఉందని ప్రపంచ ఆరోగ్యసంస్థ హెచ్చరించింది. కేసుల తీవ్రత ఈసారి ఎక్కువగా ఉంటుందని తెలిపింది. దేశంలో డెంగీ ఎక్కువగా ఉన్న రాష్ట్రాల జాబితాలో తెలంగాణ ఉన్నట్టు పేర్కొంది. ఈ మేరకు డెంగీ తీవ్రతపై ప్రపంచ ఆరోగ్యసంస్థ ఒక నివేదిక విడుదల చేసింది. డెంగీలోని నాలుగు ప్రధాన వేరియంట్లు తెలంగాణలోనే కనిపిస్తున్నాయని వెల్లడించింది. డీఈఎన్‌వీ1, డీఈఎన్‌వీ2, డీఈఎన్‌వీ3, డీఈఎన్‌వీ4 ప్రభావం ఎక్కువగా ఉంటున్నట్టు డబ్ల్యూహెచ్‌ఓ పేర్కొంది. కొన్నిసార్లు రెండుమూడు వేరియంట్లు కూడా ఒకేసారి దాడి చేసే ప్రమాదం పొంచి ఉందని హెచ్చరించింది. ఫలితంగా డెంగీ బాధితులు తీవ్రమైన ఇబ్బందులు పడతారని తెలిపింది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం ముందస్తు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని, ఆస్పత్రుల్లో అవసరమైన కిట్లు, మౌలిక సదుపాయాలు కల్పించాలని సూచించింది. ఈ ఏడాది ఇప్పటివరకు 500కు పైగా డెంగీ కేసులు వెలుగు చూడడం గమనార్హం. - సాక్షి, హైద

లాభాలు ఆశ చూపి, గోల్డ్ ట్రేడింగ్ పేరుతో మోసం..

Image
 లాభాలు ఆశ చూపి, గోల్డ్ ట్రేడింగ్ పేరుతో లో మోసం.. హైదరాబాద్ హబ్సిగూడా లో ఆఫీస్ ఓపెన్ చేసి కోట్ల రూపాయల  వసూలు చేసి పరారైన రాజేష్.. ఇన్వెస్ట్మెంట్ అమౌంట్ ను ఐదు నెలల్లో రెట్టింపు చెల్లిస్తామని నమ్మించి, రెండు నెలల పాటు లాభాలను చెల్లించి, నమ్మకం కలగడంతో పెద్ద మొత్తం లో ఇన్వెస్ట్మెంట్ చేసిన బాధితులు.. ఇన్వెస్ట్మెంట్ డబ్బులతో ఉడాయించిన రాజేష్  గత రెండు నెలలుగా తప్పించుకొని తిరుగుతున్న రాజేష్ ను ఆదివారం అరెస్ట్ చేసిన సీసీఎస్ పోలీసులు Gold Trading Cheating...

ఉమ్మడి నల్గొండ జిల్లాను అన్ని రంగాలలో అభివృద్ధి చేస్తాం - మంత్రి కోమటిరెడ్డి

Image
  ఉమ్మడి నల్గొండ జిల్లాను అన్ని రంగాలలో అభివృద్ధి చేస్తామని రాష్ట్ర రోడ్లు, భవనాలు ,సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు.       ఆదివారం ఆయన నల్గొండ జిల్లా నకిరేకల్ నియోజకవర్గ పరిధిలోని చిట్యాలలో హైదరాబాద్-విజయవాడ జాతీయ రహదారిపై ఫ్లైఓవర్ నిర్మాణానికి భూమి పూజ చేశారు       ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ హైదరాబాద్ -విజయవాడ జాతీయ రహదారిపై 17 బ్లాక్ స్పాట్లను గుర్తించామని,325 కోట్లతో పనులు చేపట్టనున్నట్లు ,డిసెంబర్ లోపు పనుల పూర్తి కి చర్యలు తీసుకుంటున్నట్లు ఆయన వెల్లడించారు ప్రజలంటే తనకు ప్రాణమని, ప్రజల కోసం ప్రాణమిస్తానాని, తన జీవితం ప్రజలకే అంకితం అని అన్నారు. నల్గొండ జిల్లాకు 500 కోట్లతో ఆర్ అండ్ బి రహదారులు తెచ్చానని, రానున్న నాలుగున్నర సంవత్సరాలలో ఉమ్మడి నల్గొండ జిల్లాలో పేదల కు ఇండ్ల తో పాటు, ఇచ్చిన హామీలన్నీ నెరవేరుస్తామన్నారు.అందరికీ అవసరమైన పనులు చేసి పెడతామని, నల్గొండ, నకిరేకల్ 2 తనకు రెండు కళ్ళలాంటివని,ఆగస్టు 15లోగా రైతులకు 2 లక్షల రూపాయల రుణమాఫీని పూర్తి చేస్తామన్నారు.. వారం రోజుల్లో పేదలకు ఇందిరమ్మ ఇండ్లు నిర్మించే కార్యక్రమం చేపడతామని, స్వంత స్థలం ఉంటే

ఉమ్మడి నల్గొండ జిల్లాను అన్ని రంగాలలో అభివృద్ధి చేస్తాం - మంత్రి కోమటి రెడ్డి

Image
      ఉమ్మడి నల్గొండ జిల్లాను అన్ని రంగాలలో అభివృద్ధి చేస్తామని రాష్ట్ర రోడ్లు, భవనాలు ,సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు.       ఆదివారం ఆయన నల్గొండ జిల్లా నకిరేకల్ నియోజకవర్గ పరిధిలోని చిట్యాలలో  హైదరాబాద్-విజయవాడ జాతీయ రహదారిపై ఫ్లైఓవర్ నిర్మాణానికి భూమి పూజ చేశారు       ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ  హైదరాబాద్ -విజయవాడ జాతీయ రహదారిపై 17 బ్లాక్ స్పాట్లను గుర్తించామని,325 కోట్లతో పనులు చేపట్టనున్నట్లు ,డిసెంబర్ లోపు పనుల పూర్తి కి చర్యలు తీసుకుంటున్నట్లు ఆయన వెల్లడించారు  ప్రజలంటే  తనకు ప్రాణమని, ప్రజల కోసం ప్రాణమిస్తానాని, తన జీవితం ప్రజలకే అంకితం అని అన్నారు. నల్గొండ జిల్లాకు 500 కోట్లతో ఆర్ అండ్ బి రహదారులు తెచ్చానని, రానున్న నాలుగున్నర సంవత్సరాలలో ఉమ్మడి నల్గొండ జిల్లాలో పేదల కు ఇండ్ల  తో పాటు, ఇచ్చిన హామీలన్నీ నెరవేరుస్తామన్నారు.అందరికీ అవసరమైన పనులు చేసి పెడతామని, నల్గొండ, నకిరేకల్ 2 తనకు రెండు కళ్ళలాంటివని,ఆగస్టు 15లోగా రైతులకు 2 లక్షల రూపాయల రుణమాఫీని పూర్తి చేస్తామన్నారు.. వారం రోజుల్లో పేదలకు ఇందిరమ్మ ఇండ్లు నిర్మించే కార్యక్రమం చేపడతామని, స్వంత స్థలం

పాల సంఘం డైరెక్టర్లు కాంగ్రెస్స్ లోకి

Image
 నల్లగొండ మండలం పెద్ద సూరారం గ్రామానికి చెందిన పాల సంఘం డైరెక్టర్లు కోట్ల కరుణాకర్ రెడ్డి, కోట్ల లక్ష్మారెడ్డి ఎర్రమద నర్సిరెడ్డిలు ఈరోజు నల్లగొండలో రాష్ట్ర రోడ్లు, భవనాలు,సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి  సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు.  నూతనంగా పార్టీలో చేరిన వారికి మంత్రి కోమటిరెడ్డి పార్టీ కండువాలు కప్పి కాంగ్రెస్ లోకి ఆహ్వానించారు.  ఈ కార్యక్రమంలో నల్గొండ పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు గుమ్ముల మోహన్ రెడ్డి, మున్సిపల్ చైర్మన్ బుర్రి శ్రీనివాస్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ నాయకులు ఏడుదొడ్ల వెంకటరామిరెడ్డి, గ్రామ శాఖ అధ్యక్షుడు పిల్లి గిరి, ఎంపీటీసీ పెండెం పాండు, ఎర్ర మాధవ రత్నారెడ్డి, వల్లపు కరుణాకర్ రెడ్డి, రామలింగం, ఎర్ర మాద మోహన్ రెడ్డి పాల్గొన్నారు.

ఘనంగా డాక్టర్ శ్యామా ప్రసాద్ ముఖర్జీ వర్ధంతి

Image
  *బిజెపి జిల్లా కార్యాలయంలో జన సంఘ్ వ్యవస్థాపకులు డాక్టర్ శ్యామా ప్రసాద్ ముఖర్జీ వర్ధంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూల మాల వేసి నివాళులర్పించిన బిజెపి నాయకులు* నల్గొండ:  బిజెపి జిల్లా కార్యాలయంలో భారతీయ జన సంఘ్ వ్యవస్థాపకులు డా" శ్యామ ప్రసాద్ ముఖర్జీ గారి వర్ధంతి సందర్భంగా వారి చిత్ర పటానికి పూలమాల వేసి ఘన నివాళులు అర్పించారు.   ఈ సందర్భంగా బీజేపీ జిల్లా అధ్యక్షులు నాగం వర్షిత్ రెడ్డీ  మాట్లాడుతూ ఏక్ దేశమే దో విధాన్ దొ ప్రధాన్ దొ నిషాన్ నహి చలేగా నహి చలేగ అనే నినాదం తో దేశం మొత్తం ఏకీకృత్తం చేసిన మహనీయులు వారు అని కొనియాడారు విభజించు.. పాలించు.. అనే కాంగ్రెస్ కుహానా రాజకీయాలను వ్యతిరేకించిన జనసంఘ్ వ్యవస్థాపకులు డాక్టర్ శ్యామ ప్రసాద్ ముఖర్జీ  ప్రాణత్యాగ ఫలితమే ఇవాళ జమ్ముకశ్మీర్ కు స్వేచ్ఛ లభించడం దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారి పాలనలో ఆర్టికల్ 370 రద్దుతో ఆయన కల సాకరమైందనీ అన్నారు. జమ్ముకశ్మీర్ కు స్వేచ్ఛా, స్వాతంత్ర్యం కోసం సాగిన ఉద్యమంలో 1953 మే 11న అరెస్ట్ అయిన ముఖర్జీ  జూన్ 23, 1953లో పోలీసులు కస్టడీలోనే ప్రాణత్యాగం చేశారు స్వాతంత్ర్యం వచ్చిన తొలిదశలో భరతమాత ముద్దుబిడ్డను కో

విలేకరిపై తప్పుడు కేసు పెట్టిన సిఐ సస్పెండ్

Image
 విలేకరిపై తప్పుడు కేసు పెట్టిన సిఐ సస్పెండ్ ఖమ్మం పట్టణంలో స్థానిక విలేకరి ఇంటిలో తుపాకీ తూటాలు దొరికినట్లుగా తప్పుడు కేసులు పెట్టడం. అధికారాన్ని దుర్వినియగం చేసి పోలీసు గౌరవాన్ని దెబ్బతీసే విధంగా వ్య వరించిన సీఐ శ్రీధర్ ను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసిన ఐజీ రంగనాథ్.

శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి ఆర్యవైశ్య నిత్య అన్నదాన సత్ర ట్రస్ట్ అండ్ వృద్ధాశ్రమంలో లైన్స్ క్లబ్ ఆధ్వర్యంలో వృద్ధులకు హెల్త్ చెకప్

Image
  శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి ఆర్యవైశ్య నిత్య అన్నదాన సత్ర ట్రస్ట్ అండ్ వృద్ధాశ్రమంలో లైన్స్ క్లబ్ ఆధ్వర్యంలో వృద్ధులకు హెల్త్ చెకప్ చేర్వుగట్టు:  శ్రీ శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి ఆర్యవైశ్య నిత్య అన్నదాన సత్ర ట్రస్ట్ అండ్ వృద్ధాశ్రమం చెరువుగట్టు లో   లైన్స్ క్లబ్ ఆధ్వర్యంలో వృద్ధులకు హెల్త్ చెకప్  నిర్వహించడం జరిగింది. లైన్స్ క్లబ్ అధ్యక్షులు ఎల్వీ కుమార్ ,  డాక్టర్ పుల్లారావు  మరియు ఇతర  డాక్టర్ల ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది మరియు  ఆశ్రమ అధ్యక్షులు రంగా శేఖర్, గౌరవ అధ్యక్షులు మీలా సోమయ్య,  నూనె రంగయ్య, చందా కృష్ణమూర్తి,  పసునూరి శ్రీనివాస్, యాద శ్రీనివాస్, నల్గొండ శ్రీనివాస్,   రంగా కృష్ణయ్య, ఓరుగంటి పరమేష్, తడకమల్ల చంద్రయ్య ఆకుల మల్లిఖర్జున్, దాచపల్లి రంగయ్య  మరియు   కమిటీ సభ్యులు కూడా పాల్గొన్నారు

చెంచు మహిళ పై సామూహిక అత్యాచారం చేసి మాసంలో డీజిల్ పోసి కాల్చిన బండి వెంకటేష్ యాదవ్ ,శివ దుర్మార్గుల ను కఠినంగా శిక్షించాలి.పాలడుగు నాగార్జున

Image
 *చెంచు మహిళ పై సామూహిక అత్యాచారం చేసి మాసంలో డీజిల్ పోసి కాల్చిన బండి వెంకటేష్ యాదవ్ ,శివ దుర్మార్గుల ను కఠినంగా శిక్షించాలి.పాలడుగు నాగార్జున* నల్గొండ: (గూఢచరి ప్రతినిధి)        చెంచు మహిళా కాట్రాజు ఈశ్వరమ్మను అక్రమంగా నిర్బంధించి 10 రోజులపాటు  అత్యాచారానికి పాల్పడ్డ ఇద్దరు దుర్మార్గులను కఠినంగా శిక్షించాలని కుల వివక్ష వ్యతిరేక పోరాట సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు పాలడుగు నాగార్జున డిమాండ్ చేశారు.  శనివారం రోజున నల్లగొండ దొడ్డి కొమరయ్య భవనంలో పత్రిక విలేకరులతో మాట్లాడటం జరిగింది. ఈ సందర్భంగా పాలడుగు నాగార్జున మాట్లాడుతూ బండి వెంకటేష్ యాదవ్ శివ లూ చెంచు మహిళా ఈశ్వరమ్మ కు పచ్చి మిరపకాయలు నూరి ఒళ్ళంతా పూసి రాత్రంతా చిత్రహింసలు పెట్టారు. పైశాచికంగా దుర్మార్గంగా వ్యవహరిస్తూ  డీజిల్ లో ముంచిన బట్టను మానంలో గుచ్చి మంట పెట్టిన కామాంధులు కఠినంగా శిక్షించాలని అన్నారు. చెంచుల భూములను కౌలుకు తీసుకుని వాళ్ళ భూమిలో వాళ్ళనే వెట్టి బానిసలను చేసిన దుర్మార్గం. దినసరి కూలీ పెంచమన్నందుకు ఇంతటి ఘాతుకానికి పాల్పడ్డ దుర్మార్గులు కాంగ్రెస్ మంత్రి జూపల్లి కృష్ణారావు అండతో అక్రమ ఇసుక దందా నడిపే వెంకటేష్ అరాచకాలకు

Bhupathi Times 23rd- June-2024

Image

విద్యారంగా అభివృద్ధిలో విజయలక్ష్మి సేవలు ప్రశంసనీయం

Image
 విద్యారంగా అభివృద్ధిలో విజయలక్ష్మి సేవలు ప్రశంసనీయం ఉపాధ్యాయ వృత్తి ని అంకిత భావంతో నిర్వహించి విద్యాభివృద్ధికి కృషి చేసిన రామరాజు విజయలక్ష్మీ అభినందనీయు రాలని రిటైర్డ్ ఉద్యోగుల సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు ఆర్ సీతారామయ్య,జిల్లా ప్రధాన కార్యదర్శి బొల్లు రాంబాబు లు అన్నారు.అనంతగిరి మండలం శాంతినగర్ హైస్కూల్ లో ఆంగ్ల ఉపాధ్యాయు రాలిగా పని చేసి ఉద్యోగ విరమణ పొందిన విజయ లక్ష్మీ అభినందన సభ లో వారు మాట్లాడారు.ఈ కార్యక్రమంలో హెచ్ ఎమ్ పురుషోత్తం, మాజీ సర్పంచ్ బద్దం కృష్ణారెడ్డి, సురేష్ ,స్థానిక నాయకులు భద్రారెడ్డి, రాఘవరెడ్డి, పుల్లారెడ్డి వెంకట్ రెడ్డి ,గోపాల్ రెడ్డి, మాజీ ఎంఈఓ గోపయ్య, అప్పయ్య , పాఠశాల ఉపాధ్యాయులు మంగమ్మ,వి సత్య నారాయణ, జయ, స్టాలిన్ శ్రీధర్, శ్రీనివాసరావు, షేక్ బాలేమియా,ఏ వెంకటేశ్వర్లు, నరేష్, మాజీహెచ్ఎం సుజాత, పలు ఉపాధ్యాయ సంఘాల నాయకులు విద్యార్థులు విద్యా కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు

బిజెపిలోకి కేసీఆర్ ను ఆహ్వానించిన మెదక్ ఎంపీ రఘునందన్ రావు

Image
 బిజెపిలోకి కేసీఆర్ ను ఆహ్వానించిన మెదక్ ఎంపీ రఘునందన్ రావు  కెసిఆర్ వస్తానంటే వద్దంటాన  కెసిఆర్ కేటీఆర్ హరీష్ రావు బిజెపిలోకి రండి   అవినీతికి కేరాఫ్ అడ్రస్ కాంగ్రెస్  లీకేజీల ప్రయోగాశాల కాంగ్రెస్  వెంకట్రాంరెడ్డి భూములు దళితులకు వచ్చేవరకు కొట్లాడుతా  మల్లన్న సాగర్ భూ నిర్వాసితుల  సమస్యలు పరిష్కారం కోసం   హరీష్ రావు బిజెపిలోకి వస్తుండా అని ఓ విలేకరి అడిగిన ప్రశ్నకు సమాధానంగా కెసిఆర్ ఫ్యామిలీని  హరీష్ రావు కేటీఆర్ కవితలను బిజెపి పార్టీలోకి సౌ వినయంగా మీడియా ద్వారా ఆహ్వానిస్తున్నట్టు తెలిపారు. బిజెపి పార్టీ విధానం నచ్చి పార్టీ కోసం పని చేస్తామని వచ్చే కమ్యూనిస్టునైనా నక్సలైటు నైనా  పార్టీ వదులుకోదని మెదక్ ఎంపీ రఘునందన్ రావు అన్నారు.తెలంగాణ జర్నలిస్ట్ యూనియన్ నిర్వహించిన మీట్ ది ప్రెస్ కార్యక్రమంలో మెదక్ ఎంపీ రఘునందన్ రావు ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. ఈ కార్యక్రమానికి అధ్యక్షత కప్పర ప్రసాద రావు వహించారు. సిద్దిపేట జిల్లా కలెక్టర్  ఉన్న వెంకట్రాంరెడ్డి అనేక అక్రమాలు చేశారంటూ తెలివిగా ఫామ్ ల్యాండ్ పేరిట క్షీరా సాగర్ దళితుల భూములు కన్నేసిన వెంకట్రాంరెడ్డి ప్రొహిబిటేల్లో పెట్టి రైతుల

బైపాస్ రోడ్డు ఆప్షన్ మూడు ని వెనక్కి తీసుకోవాలి - బిజెపి

Image
  బైపాస్ రోడ్డు ఆప్షన్ మూడు ని వెనక్కి తీసుకోవాలని బాధితులకు అండగా క్లాక్ టవర్ సెంటర్లో బీజేపీ మహా ధర్నా నల్లగొండ లోని నకేరేకల్ నుండి నాగార్జునసాగర్ హైవే 565 కి నల్లగొండ పట్టణం బయట నుండి బైపాస్ రోడ్డు అలైన్మెంట్ ఆప్షన్ ఒకటి అలాగే ఆప్షన్ రెండుని కాదు అని మూడు ని ఎంచుకోవడంతో సుమారు మూడు వేల మంది మధ్యతరగతి వారు వారి ఇండ్ల స్థలాలను అలాగే ఇండ్లను కొల్పేయే అవకాశం ఉందని బీజేపీ ఆధ్వర్యంలో నల్లగొండ క్లాక్ టవర్ సెంటర్ లో పెద్ద ఎత్తున ధర్నా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షులు డా,నాగం వర్షిత్ రెడ్డి మాట్లాడుతూ నల్లగొండ బైపాస్ నేషనల్ హైవే 565 లో అలైన్మెంట్ లో ఆప్షన్ ఒకటి రెండు ని కాదు అని ఆప్షన్ మూడు ని ఎంచుకోవడం జరిగిందని, దీనివల్ల ప్రజలకు అత్యధిక నష్టం వాటిలుతుందని, బాధితులు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కలవడానికి పోయిన వారిని పట్టించుకోకుండా పక్కకు తప్పించి కారును ముందుకు తిసుకుపోయినారనీ విమర్శించారు. మీకు ఓట్లు వేసి గెలిపించి నలగొండ ప్రజలని ఈ విధంగా అవమానిస్తు సోయి లేకుండా ఉన్నారని, పట్టణను ను రెండు ముక్కలు గా చేసే ఈ రోడ్డు వేయవద్దు నిఅన్నారు. రాత్రికో మాట పొద్దున ఒక మాట

సోమవారం నాటి జిల్లా స్థాయి ప్రజావాణి కార్యక్రమం రద్దు

Image
నల్లగొండ జూన్ 22: ( గూఢచారి ప్రతినిధి) @ సోమవారం నాటి జిల్లా స్థాయి ప్రజావాణి కార్యక్రమం రద్దు @  జిల్లా కలెక్టర్ తో సహా అదనపు కలెక్టర్లు, ఇతర జిల్లా స్థాయి అధికారులు అందరూ మండల స్థాయిలో నిర్వహించే ప్రజావాణి కార్యక్రమానికి హాజరవుతున్న దృష్ట్యా  జిల్లా స్థాయి ప్రజావాణి రద్దు- జిల్లా కలెక్టర్ సి.నారాయణరెడ్డి       ఈ సోమవారం జిల్లా స్థాయిలో నిర్వహించే ప్రజావాణి కార్యక్రమాన్ని రద్దు చేసినట్లు జిల్లా కలెక్టర్ సి.నారాయణరెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు.        ఈ సోమవారం నుండి మండల స్థాయిలోనే జిల్లా స్థాయిలో నిర్వహించినట్లుగానే ప్రజావాణి కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున నిర్వహిస్తున్నందున జిల్లా స్థాయి ప్రజావాణి కార్యక్రమాన్ని రద్దు చేయడం జరిగిందని, ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకుని ఫిర్యాదుదారులు జిల్లా కేంద్రంలో ఫిర్యాదులు సమర్పించేందుకు జిల్లా కలెక్టర్ కార్యాలయానికి రావద్దని ఆయన విజ్ఞప్తి చేశారు.       ఈ సోమవారం నుండి నల్గొండ జిల్లాలోని 33 మండలాలతో పాటు, నల్గొండ, దేవరకొండ, మిర్యాలగూడ మున్సిపాలిటీలలో సైతం ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుందని ఆయన , ఆయా మండలంలోని ప్రజలు వారికి సంబంధించిన ఫిర్

Bhupathi Times - 22nd June 2024

Image

సూరారం పోలీస్ స్టేషన్ సిఐ ఎసిబి ట్రాప్.

Image
 కుత్బుల్లాపూర్  సూరారం పోలీస్ స్టేషన్ సిఐ ఎసిబి ట్రాప్. ఓ కేసు విషయంలో లక్ష రూపాయలు తీసుకుంటూ పట్టుబడ్డ సిఐ వెంకటేశం. స్టేషన్ లో తనిఖీలు నిర్వహిస్తున్న ఎసిబి అధికారులు.

సింగరేణి అక్రమాలపై సీబీఐ విచారణ కోరే దమ్ముందా?

Image
  *సింగరేణి అక్రమాలపై సీబీఐ విచారణ కోరే దమ్ముందా?* *కాంగ్రెస్ కు కేంద్ర మంత్రి బండి సంజయ్ సవాల్* *సింగరేణిని ప్రైవేటీకరించి దివాళా తీయించింది కేసీఆరే* *సింగరేణిలో కేంద్రం వాటా 49, రాష్ట్రం వాటా 51 శాతం మాత్రమే* *రాష్ట్ర ఆమోదం లేకుండా కేంద్రం ప్రైవేటీకరించడం అసాధ్యం* *తప్పుడు ప్రచారంతో ప్రజల్లో అయోమయం స్రుష్టంచేందుకు కాంగ్రెస్, బీఆర్ఎస్ కుట్ర* *అవినీతి విషయంలో బీఆర్ఎస్ బాటలోనే కాంగ్రెస్ నడుస్తోంది* *ఫోన్ ట్యాపింగ్, కాళేశ్వరం విచారణ పేరుతో జాప్యం చేయడమే తప్ప చేసిందేమీ లేదు* *కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ వ్యాఖ్యలు* *ప్రధాని క్రుషి వల్లే యోగాను అంతర్జాతీయ దినోత్సవంగా జరుపుకుంటున్నామని వెల్లడి* సింగరేణిలో జరుగుతున్న అవినీతి, అక్రమాలపై సీబీఐ విచారణ కోరే దమ్ముందా? అంటూ కేంద్రహోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. సీబీఐ విచారణ జరిపితే గత ప్రభుత్వ నిర్వాకాలతోపాటు సింగరేణి దుస్థితికి కారకులెవరో తేలిపోతుందన్నారు. సింగరేణిని ప్రైవేటీకరించే ప్రసక్తే లేదని సాక్షాత్తు ప్రధానమంత్రి నరేంద్రమోదీ ప్రకటించిన తరువాత కూడా కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు మళ్లీ తప

ఇద్దరు వార్డు బాయ్స్ ను సస్పెండ్ చేసిన జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డి

Image
@ నల్గొండ జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిని ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ -సి.నారాయణ రెడ్డి @ వార్డులో రోగుల నుండి డబ్బులు వసూలు చేస్తున్నందుకు ఇద్దరు   వార్డు బాయ్స్ సస్పెన్షన్  @ ప్రభుత్వ ఆసుపత్రిలో విధులు నిర్వహిస్తూ విధులకు  గైర్హాజరైతే గట్టి చర్యలు తీసుకుంటామని డ్యూటీ డాక్టర్లకు హెచ్చరిక  @ నల్గొండ జిల్లా నూతన కలెక్టర్ గా విధులలో చేరిన మూడో రోజే  కొరడా ఝుళిపించిన జిల్లా కలెక్టర్           బుధవారం జిల్లా కలెక్టర్ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ప్రధానాస్పత్రిని ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఎమర్జెన్సీ, ఐసీయూ, పాలియేటివ్ కేర్, మేల్, ఫిమేల్ వార్డులు, సర్గికల్,పోస్ట్ ఆపరేటివ్ వార్డు, ఎం సి హెచ్ వార్డులన్నింటిని కలియతిరిగారు.        ఆయా వార్డులలో రోగుల బంధువులతో ముఖాముఖి మాట్లాడి వారి  పేషంట్ల వివరాలను అడిగి తెలుసుకున్నారు .ఆసుపత్రిలో వైద్య సేవలు ఎలా ఉన్నాయని?  5 రూపాయల భోజనం ఇస్తున్నారా ? లేదా? తాగునీరు ఎలా ఉంది ? టాయిలెట్లు బాగున్నాయా? ఎక్కడ పడుకుంటున్నారని  ? అన్ని వివరాలను కూలంకషంగా అడిగి తెలుసుకున్నారు.        మేల్ సర్జికల్ వార్డులో ప్రతి పనికి డబ్బులు అడుగుతున్నారని రోగుల సహాయకులు జిల్ల