అక్రిడిటేషన్ (గుర్తింపు కార్డు) గడువును సెప్టెంబర్ 30వ తేదీ వరకు పొడిగింపు



 హైదరాబాద్, జూన్ 19 :: రాష్ట్రంలో వర్కింగ్ జర్నలిస్టుల అక్రిడిటేషన్ (గుర్తింపు కార్డు) గడువును సెప్టెంబర్ 30వ తేదీ వరకు పొడిగిస్తూ రాష్ట్ర సమాచార పౌర సంబంధాల శాఖ స్పెషల్ కమీషనర్ హనుమంత రావు ఉత్తర్వలు జారీ చేశారు. ప్రభుత్వ ఉత్తర్వల మేరకు జిల్లా స్థాయి అక్రిడిటేషన్ కమిటీ చైర్మన్లు ఆయిన జిల్లా కలెక్టర్లు తగు చర్యలు తీసుకోవాల్సిందిగా ఆ ఉత్తర్వులలో పేర్కొన్నారు. వర్కింగ్ జర్నలిస్టుల కోసం ప్రతి రెండు సంవత్సరాలకోసారి అక్రిడిటేషన్ కార్డుల సదుపాయం రాష్ట్ర సమాచార శాఖ కల్పిస్తున్నది. ఆ గడువు ఈ నెల జూన్ 30 తో ముగిస్తుండగా, గడువు తేదీని సెప్టేంబర్ 30 వరకు పొడిగించినట్లు ఆ ఉత్తర్వులలో తెలిపారు.

----------------------------------------------------------------------

స్పెషల్ కమీషనర్, సమాచార పౌర సంబంధాల శాఖచే జారీ చేయనైనది.

Comments

Popular posts from this blog

250 కోట్ల స్కాం లో రైస్ మిల్లు ఓనర్ ఇమ్మడి సోమనర్సయ్య అరెస్ట్: డి ఎస్పీ. గతంలో గూఢచారి ఈ కుంభకోణం పై వార్త కథనం

తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ ఎన్నికలకు అంగీకరించిన అమరవాది - మిడిదొడ్డి శ్యామ్ సుందర్

తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ అధ్యక్ష పదవి కొత్తవారికి అవకాశం కల్పించాలి - మిడిదొడ్డి శ్యామ్