రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన ఆరు గారెంటీలు వెంటనే అమలు చేయాలి పాలడుగు ప్రభావతి, ఐద్వా రాష్ట్ర ఉపాధ్యక్షురాలు.
రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన ఆరు గారెంటీలు వెంటనే అమలు చేయాలి పాలడుగు ప్రభావతి, ఐద్వా రాష్ట్ర ఉపాధ్యక్షురాలు.
ఎన్నికలలో ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలైనా 6 గ్యారంటీలు వెంటనే అమలు చేయాలని ఐద్వా రాష్ట్ర ఉపాధ్యక్షురాలు పాలడుగు ప్రభావతి అన్నారు ఈరోజు అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం అయిదువ నల్లగొండ జిల్లా కమిటీ సమావేశం జిల్లా అధ్యక్షురాలు పోలేబోయిన వరలక్ష్మి అధ్యక్షతన దొడ్డి కొమరయ్య భవనంలో జరిగింది. ఈ సందర్భంగా ప్రభావతి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం విద్యుత్తు బస్సు గ్యాస్ వరకే పరిమితిని కాకుండా ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలను వెంటనే అమలు చేసి తమ చిత్తశుద్ధి నిరూపించుకోవాలని కోరారు. ప్రజలకు అవసరమైన విద్యా వైద్యం ఉచితంగా అందించుటకు నిధులు కేటాయించాలని డిమాండ్ చేశారు. సంఘం ఆధ్వర్యంలో ప్రైమరీ హెల్త్ సెంటర్లు జిల్లా కేంద్ర ప్రభుత్వ ఆసుపత్రిలో సమగ్రంగా సర్వేలు నిర్వహించి ప్రజలు ఎదుర్కొంటున్న వైద్య సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకుపోవడానికి కార్యక్రమం రూపొందించినట్లు తెలియజేశారు. సమ భావన సంఘాల మహిళలకు అందాల్సిన పావలా వడ్డీ నేటికీ ఇవ్వకపోవడం ఏమిటని ప్రశ్నించారు సమభావన సంఘాల మహిళలకు ప్రతి ఒక్కరికి ప్రభుత్వమే ఇన్సూరెన్స్ సౌకర్యం కల్పించాలని డిమాండ్ చేశారు. దేశంలో మహిళలపై అనేక అగైత్యాలు జరుగుతున్నాయని వృద్ధుల నుండి పసి పిల్లల వరకు అత్యాచారాలు పెరిగిపోయాయని ఆవేదన వ్యక్తం. చేశారు ప్రభుత్వాలు కఠినంగా వ్యవహరించి దోషులను శిక్షించాలని తెలియజేశారు. ఐద్వా రాష్ట్ర కమిటీ సభ్యురాలు కొండ అనురాధ, జిల్లా ఉపాధ్యక్షురాలు తుమ్మల పద్మ సహాయ కార్యదర్శి భూతం అరుణకుమారి జనబోయిన నాగమణి పాతూరి గోవర్ధన కారంపూడి ధనలక్ష్మి జిల్లా కమిటీ సభ్యురాలు గోలి వెంకటమ్మ తదితరులు పాల్గొన్నారు.
Comments
Post a Comment