శ్రీ కాశి అన్నపూర్ణ వాసవి ఆర్యవైశ్య సత్రం రికార్డుల బీరువాను దౌర్జన్యంగా లాకెళ్ళిన ఆర్యవైశ్య ఓ పెద్ద నాయకుడి అనుచరులు?


 శ్రీ కాశి అన్నపూర్ణ వాసవి ఆర్యవైశ్య సత్రం రికార్డుల బీరువాను దౌర్జన్యంగా లాకెళ్ళిన ఆర్యవైశ్య ఓ పెద్ద నాయకుడి అనుచరులు?


*అడహాక్ కమిటీ కో ఆర్డినేటర్ గబ్బ చంద్రశేఖర్ ఛాంబర్ కు తాళం?*

హైద్రాబాద్ (గూఢచారి ప్రతినిధి)

హైద్రాబాద్ లోని హిమయత్నగర్ లో ఉన్న శ్రీ కాశి అన్నపూర్ణ వాసవి ఆర్యవైశ్య వృద్ధాశ్రమం మరియు నిత్యాన్న సత్రం ఆఫీసు నుండి రికార్డుల బీరువాను ఈ నెల 17 న ఓ ఆర్య వైశ్య పెద్ద నాయకుడి అనుచారులు దౌర్జన్యంగా లాకెళ్ళినట్లు సమాచారం. అంతే గాకుండా ఈ రోజు అడహాక్ కమిటీ కో ఆర్డినేటర్ ఛాంబర్ కు కూడా సదరు అనుచరులు తాళం వేసినట్లు తెలిసింది. ఈ కాశీ అన్నపూర్ణ వాసవి ఆర్యవైశ్య సత్రం కాశీ లో రిజిస్ట్రేషన్ అయ్యి పలు ప్రాంతాల్లో వసతి అన్నదాన సత్రాలు నిర్వహిస్తున్నది. కాశిలో, తిరుపతి లో , షిరిడీ, హరిద్వార్లో ఇలా పలు ప్రాంతాల్లో ఆర్యవైశ్య భక్తులకు వసతి అన్న దానాలు కల్పిస్తుంది. ఈ శత్రానికి 11వేల 156 నుండి 50156 రూపాయల వరకు చందాలు చెల్లించిన దాతలు దాదాపు 28 వేల మంది సభ్యులు ఉన్నారు. ఈ సత్రానికి పలుకారణలతో 2012 తరువాత ఎన్నికలు జరుగలేదు. ఎన్నికలు నిర్వహించడానికి సమాయత్తం అయ్యే సమయానికి పలు అంతరాలు వస్తూనే వున్నాయి. గత 2012 లో ఎన్నికల్లో జక్కా నాగభూషణం ను అధ్యక్షుడిగా ఎన్నుకున్నారు. తదనంతరం నిధుల దుర్వినియోగం అయినట్లు ఆరోపణలు రావడంతో ఆయన రాజీనామా చేసారు. దీంతో యెక్కల బాలకృష్ణ ను నియమించారు. ఆ తరువాత 5 సంవత్సరాలకు 2017 లో ఎన్నికలు నిర్వహణకు పూనుకోగా కోర్టు తగదాలతో ఎన్నికలు ఆగిపోయాయి. సత్రాల నిర్వహణ కొరకు అడహాక్ కమిటీ ఏర్పాటు చేసి అడహాక్ కమిటీ కోఆర్డినేటర్ గా గుబ్బ చంద్రశేఖర్ ను నియమించుకున్నారు. ఎన్నికలు జరిగి 12 సంవత్సరాల తరువాత ఎన్నికలు వచ్చే జూలై లో  నిర్వహించాలనీ, ఈ నెల 22 న అడహాక్ కమిటీ మీటింగ్ పెట్టి ఎన్నికల విధి విధానాలు వెల్లడించాలని నిర్ణయించినట్లు సమాచారం. ఇంతలో పెద్ద నాయకుల మధ్య ఆధిపత్య పోరు తో సమస్య మళ్లీ ముందుకొచ్చింది. పోటీ చేయాలని అనుకున్న వారికి సభ్యుల లిస్టు కొరకు అడహాక్ కమిటీ ని కొందరు పెద్దలు సంప్రదించారని, దీనికి సభ్యుల లిస్టు రికార్డులు ఇవ్వడానికి అడహాక్ కమిటీ సభ్యులు నిరాకరించడం తో ఘర్షణ వాతావరణం నెలకొని రికార్డులున్న బీరువా ను బలవంతంగా తీసుకెళ్లినట్లు సమాచారం. ఈ విషయం పై అడహాక్ కమిటీ కో ఆర్డినేటర్ గబ్భ చంద్రశేఖర్ ను మా ప్రతినిధి వివరాలు కోరగా రికార్డులు ఉన్న బీరువాను తీసుకెళ్లిన విషయం వాస్తవమేనని, నేను హైద్రాబాద్ కు వస్తున్నాను వచ్చాక వివరాలు తెలుపుతానని అయన చెప్పారు



Comments

Popular posts from this blog

250 కోట్ల స్కాం లో రైస్ మిల్లు ఓనర్ ఇమ్మడి సోమనర్సయ్య అరెస్ట్: డి ఎస్పీ. గతంలో గూఢచారి ఈ కుంభకోణం పై వార్త కథనం

తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ ఎన్నికలకు అంగీకరించిన అమరవాది - మిడిదొడ్డి శ్యామ్ సుందర్

తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ అధ్యక్ష పదవి కొత్తవారికి అవకాశం కల్పించాలి - మిడిదొడ్డి శ్యామ్