చెంచు మహిళ పై సామూహిక అత్యాచారం చేసి మాసంలో డీజిల్ పోసి కాల్చిన బండి వెంకటేష్ యాదవ్ ,శివ దుర్మార్గుల ను కఠినంగా శిక్షించాలి.పాలడుగు నాగార్జున


 *చెంచు మహిళ పై సామూహిక అత్యాచారం చేసి మాసంలో డీజిల్ పోసి కాల్చిన బండి వెంకటేష్ యాదవ్ ,శివ దుర్మార్గుల ను కఠినంగా శిక్షించాలి.పాలడుగు నాగార్జున*

నల్గొండ: (గూఢచరి ప్రతినిధి)

       చెంచు మహిళా కాట్రాజు ఈశ్వరమ్మను అక్రమంగా నిర్బంధించి 10 రోజులపాటు 

అత్యాచారానికి పాల్పడ్డ ఇద్దరు దుర్మార్గులను కఠినంగా శిక్షించాలని కుల వివక్ష వ్యతిరేక పోరాట సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు పాలడుగు నాగార్జున డిమాండ్ చేశారు.  శనివారం రోజున నల్లగొండ దొడ్డి కొమరయ్య భవనంలో పత్రిక విలేకరులతో మాట్లాడటం జరిగింది. ఈ సందర్భంగా పాలడుగు నాగార్జున మాట్లాడుతూ బండి వెంకటేష్ యాదవ్ శివ లూ

చెంచు మహిళా ఈశ్వరమ్మ కు పచ్చి మిరపకాయలు నూరి ఒళ్ళంతా పూసి రాత్రంతా చిత్రహింసలు పెట్టారు. పైశాచికంగా దుర్మార్గంగా వ్యవహరిస్తూ  డీజిల్ లో ముంచిన బట్టను మానంలో గుచ్చి మంట పెట్టిన కామాంధులు కఠినంగా శిక్షించాలని అన్నారు.

చెంచుల భూములను కౌలుకు తీసుకుని వాళ్ళ భూమిలో వాళ్ళనే వెట్టి బానిసలను చేసిన దుర్మార్గం. దినసరి కూలీ పెంచమన్నందుకు ఇంతటి ఘాతుకానికి పాల్పడ్డ దుర్మార్గులు కాంగ్రెస్ మంత్రి జూపల్లి కృష్ణారావు అండతో అక్రమ ఇసుక దందా నడిపే వెంకటేష్ అరాచకాలకు అంతే లేదని తెలిపారు.

 వివస్త్రను చేసి కంట్లో, మర్మాంగంలో పచ్చికారం పోసి అంతకన్నా ముందు అత్యాచారం చేసి పది రోజులుగా తీవ్ర చిత్ర హింసలు పెట్టారని తెలియ జేశారు. సభ్యసమాజం తలదించుకునే ఈ ఘటన 

నాగర్ కర్నూలు జిల్లా కొల్లాపూర్ మండలం మొలచింతలపల్లి గ్రామంలో జరిగిందీ. బాధాకరమైన సంఘటన. నాగరిక సమాజానికి కూత వేటు దూరంలోనే ఉందాగ్రామం. దాదాపు మూడు వందల జనాభా కలిగిన అమాయక ఆదివాసీ చెంచులు నివసిస్తున్నారు. మిగతా అన్ని కులాలు కలిపి నాలుగైదు వేల దాకా ఉన్నారు. అందులో కాట్రాజు ఈశ్వరమ్మ వయసు28, కాట్రాజు ఈదయ్య30,దంపతులు.వీరికి ముగ్గురు ఆడపిల్లలు, చిన్న చిన్న పిల్లలు 8,7,6 సంవత్సరాల వయస్సు లోపు వారే. వ్యవసాయ భూమి నాలుగు ఎకరాల దాకా ఉంటుంది. ఆర్థిక వనరులు అనుకూలించక అదే గ్రామానికి చెందిన బండి వెంకటేష్ యాదవ్ కు కౌలుకు ఇచ్చారు. ఈ బండి వెంకటేష్ మశమ్మకు ఇడిసిన దున్న పోతు కు ఎంత బలుపు ఉంటుందో అంతకు పదింతలు ఎక్కువే ఉంటుంది వీడికి బలుపుఅన్నారు నాలుగు ట్రాక్టర్లు,ఒక జేసీబి కలిగి ఉండి జూపల్లి కృష్ణారావు మంత్రి అండ దండలతో ఇసుక మాఫియా డాన్ గా మారి ఎలాంటి ఎదురు,బెదురు లేకుండా తిరుగుతున్నాడనీ తెలిపారు. నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో కెవిపిఎస్ జిల్లా సహాయ కార్యదర్శి బొల్లు రవీందర్ జిల్లా కమిటీ సభ్యులు దండు రవి  నాయకులు రుద్రాక్ష యాదగిరి గండి జమదగ్ని తదితరులు పాల్గొన్నారు. 



Comments

Popular posts from this blog

250 కోట్ల స్కాం లో రైస్ మిల్లు ఓనర్ ఇమ్మడి సోమనర్సయ్య అరెస్ట్: డి ఎస్పీ. గతంలో గూఢచారి ఈ కుంభకోణం పై వార్త కథనం

తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ ఎన్నికలకు అంగీకరించిన అమరవాది - మిడిదొడ్డి శ్యామ్ సుందర్

తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ అధ్యక్ష పదవి కొత్తవారికి అవకాశం కల్పించాలి - మిడిదొడ్డి శ్యామ్