ఘనంగా డాక్టర్ శ్యామా ప్రసాద్ ముఖర్జీ వర్ధంతి
*బిజెపి జిల్లా కార్యాలయంలో జన సంఘ్ వ్యవస్థాపకులు డాక్టర్ శ్యామా ప్రసాద్ ముఖర్జీ వర్ధంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూల మాల వేసి నివాళులర్పించిన బిజెపి నాయకులు*
నల్గొండ:
బిజెపి జిల్లా కార్యాలయంలో భారతీయ జన సంఘ్ వ్యవస్థాపకులు డా" శ్యామ ప్రసాద్ ముఖర్జీ గారి వర్ధంతి సందర్భంగా వారి చిత్ర పటానికి పూలమాల వేసి ఘన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా బీజేపీ జిల్లా అధ్యక్షులు నాగం వర్షిత్ రెడ్డీ మాట్లాడుతూ ఏక్ దేశమే దో విధాన్ దొ ప్రధాన్ దొ నిషాన్ నహి చలేగా నహి చలేగ అనే నినాదం తో దేశం మొత్తం ఏకీకృత్తం చేసిన మహనీయులు వారు అని కొనియాడారు విభజించు.. పాలించు.. అనే కాంగ్రెస్ కుహానా రాజకీయాలను వ్యతిరేకించిన జనసంఘ్ వ్యవస్థాపకులు డాక్టర్ శ్యామ ప్రసాద్ ముఖర్జీ ప్రాణత్యాగ ఫలితమే ఇవాళ జమ్ముకశ్మీర్ కు స్వేచ్ఛ లభించడం దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారి పాలనలో ఆర్టికల్ 370 రద్దుతో ఆయన కల సాకరమైందనీ అన్నారు. జమ్ముకశ్మీర్ కు స్వేచ్ఛా, స్వాతంత్ర్యం కోసం సాగిన ఉద్యమంలో 1953 మే 11న అరెస్ట్ అయిన ముఖర్జీ జూన్ 23, 1953లో పోలీసులు కస్టడీలోనే ప్రాణత్యాగం చేశారు స్వాతంత్ర్యం వచ్చిన తొలిదశలో భరతమాత ముద్దుబిడ్డను కోల్పోవడం దేశ రాజకీయాలకు దేశ అభివృద్ధికి తీరని లోటు గా మిగిలింది అని తెలియచేసారు వారి యొక్క అడుగుజాడలో నడుస్తూ వారు కోరుకున్న హిందుత్వ అఖండ భారత్ నిర్మించడానికి నరేంద్ర మోడీ పాలనలో ముందుకు సాగుతామని ఈ సందర్భంగా వారు కొనియాడారు ఈ కార్యక్రమంలో కిసాన్ మోర్చ జాతీయ నాయకులు గోలి మధుసూదన్ రెడ్డి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు వీరెల్లి చంద్రశేఖర్,మహబూబాబాద్ ప్రబారి నూకల వెంకట నారాయణరెడ్డి,జిల్లా ప్రధాన కార్యదర్శి చెనమోని రాములు,పోతేపాక లింగస్వామి,జిల్లా ఉపాధ్యక్షులు మిర్యాల వెంకటేశం జిల్లా కార్యదర్శి కంచర్ల విద్యాసాగర్ రెడ్డి,గడ్డం మహేష్,యువమోర్చ జిల్లా అధ్యక్షులు వంగూరి రాఖి, ఓబీసీ మోర్చ జిల్లా ప్రధాన కార్యదర్శి తీరందాసు కనకయ్య, యువమోర్చ జిల్లా ప్రధాన కార్యదర్శి రెవెల్లి కిరణ్, పట్టణ ప్రధాన కార్యదర్శి పగిడి మహేష్,ఉపాధ్యక్షుడు మంగళపల్లి కిషన్, యువ మోర్చ పట్టణ అధ్యక్షుడు దుబ్బాక సాయి,పబ్బు నరేందర్,కొండల్,సందీప్,గోపి,మహిళా మోర్చ నాయకురాలు తార, తదితరులు పాల్గొన్నారు....
Comments
Post a Comment