ఉమ్మడి నల్గొండ జిల్లాను అన్ని రంగాలలో అభివృద్ధి చేస్తాం - మంత్రి కోమటి రెడ్డి


      ఉమ్మడి నల్గొండ జిల్లాను అన్ని రంగాలలో అభివృద్ధి చేస్తామని రాష్ట్ర రోడ్లు, భవనాలు ,సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు.


      ఆదివారం ఆయన నల్గొండ జిల్లా నకిరేకల్ నియోజకవర్గ పరిధిలోని చిట్యాలలో  హైదరాబాద్-విజయవాడ జాతీయ రహదారిపై ఫ్లైఓవర్ నిర్మాణానికి భూమి పూజ చేశారు


      ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ

 హైదరాబాద్ -విజయవాడ జాతీయ రహదారిపై 17 బ్లాక్ స్పాట్లను గుర్తించామని,325 కోట్లతో పనులు చేపట్టనున్నట్లు ,డిసెంబర్ లోపు పనుల పూర్తి కి చర్యలు తీసుకుంటున్నట్లు ఆయన వెల్లడించారు  ప్రజలంటే  తనకు ప్రాణమని, ప్రజల కోసం ప్రాణమిస్తానాని, తన జీవితం ప్రజలకే అంకితం అని అన్నారు. నల్గొండ జిల్లాకు 500 కోట్లతో ఆర్ అండ్ బి రహదారులు తెచ్చానని, రానున్న నాలుగున్నర సంవత్సరాలలో ఉమ్మడి నల్గొండ జిల్లాలో పేదల కు ఇండ్ల  తో పాటు, ఇచ్చిన హామీలన్నీ నెరవేరుస్తామన్నారు.అందరికీ అవసరమైన పనులు చేసి పెడతామని, నల్గొండ, నకిరేకల్ 2 తనకు రెండు కళ్ళలాంటివని,ఆగస్టు 15లోగా రైతులకు 2 లక్షల రూపాయల రుణమాఫీని పూర్తి చేస్తామన్నారు.. వారం రోజుల్లో పేదలకు ఇందిరమ్మ ఇండ్లు నిర్మించే కార్యక్రమం చేపడతామని, స్వంత స్థలం ఉంటే తక్షణమే ఇల్లు ఇస్తామని,స్థలం లేనివారికి  ప్రభుత్వ స్థలం ఉన్నచోట ఇళ్లు కట్టించి ఇస్తామన్నారు.గత ప్రభుత్వం చేసిన 26 వేల కోట్ల రుణాలకు బకాయిలు కట్టామని,బ్రాహ్మణ వెళ్లేముల ప్రాజెక్టుకు 400 కోట్లతో 80000 ఎకరాలకు మూడు నెలల్లో నీళ్లు ఇస్తామని, నల్గొండ జిల్లాలో ఎస్ ఎల్ బి సి తో సహా ఇతర ప్రాజెక్టులకు రాష్ట్ర ముఖ్యమంత్రి 2200 కోట్లు మంజూరు చేశారని తెలిపారు. 30 వేల కోట్ల రూపాయలతో హైదరాబాద్ రీజనల్ రింగ్ రోడ్డు పనులు చేపట్టనున్నామని,  హైదరాబాద్- విజయవాడ జాతీయ రహదారితో పాటు, ఇతర ఆర్ అండ్ బి రోడ్లకు 16000 కోట్లు మంజూరు చేయాలని కేంద్రాన్ని కోరామని, నకిరేకల్ నియోజకవర్గంలోని అన్ని రోడ్లను ఆర్ అండ్ బి రోడ్లుగా మారుస్తామని తెలిపారు. చిట్యాల లో ప్రభుత్వ జూనియర్ కాలేజీ ఏర్పాటు చేస్తామని,  దాతల సహకారంతో చిట్యాల ప్రభుత్వ ఆసుపత్రిని 50 పడక లుగా మార్చడం జరిగిందని, నకిరేకల్ టోల్గేట్ వద్ద ఎన్నారైల సహకారంతో ట్రామ కేర్ సెంటర్ ను ఏర్పాటు చేస్తున్నామని మంత్రి వెల్లడించారు. 

         నకరికల్ శాసనసభ్యులు వేముల వీరేశం మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర సాధనకు మంత్రి పదవిని సైతం కోమటిరెడ్డి వెంకటరెడ్డి త్యాగం చేశారని అన్నారు. తన నియోజకవర్గంలో రహదారులకు 100 కోట్ల రూపాయలు ఇచ్చారని, బ్రాహ్మణ వెల్లేముల ప్రాజెక్టును పూర్తి చేస్తే 80 వేల ఎకరాలకు నీరు వస్తుందని అన్నారు. సిరిపురం , సుంకరిపురం రోడ్లను ఆర్ అండ్ బి రోడ్లుగా మార్చి బాగు చేయాలని ఆయన కోరారు.


      ఆలేరు శాసనసభ్యులు, ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య మాట్లాడుతూ ప్రజలు ఇబ్బంది పడకుండా హైదరాబాద్- విజయవాడ జాతీయ రహదారిపై ఫ్లై ఓవర్ ను చేపట్టడం జరిగిందని, గత ప్రభుత్వం లో చేయని పనులన్నీటిని ఇప్పుడు రాష్ట్ర ఆర్ అండ్ బి శాఖ మంత్రి చేస్తున్నారని తెలిపారు .


     రాష్ట్ర శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, చిట్యాల మున్సిపల్ చైర్మన్ చిన్న వెంకటరెడ్డి, రెవిన్యూ అదనపు కలెక్టర్ జే. శ్రీనివాస్, నల్గొండ ఆర్డీవో రవి ,జాతీయ రహదారుల సంస్థ ఇంజనీరింగ్ అధికారులు, స్థానిక అధికారులు, ప్రజా ప్రతినిధులు, కౌన్సిలర్లు, నకిరేకల్ మున్సిపల్ చైర్మన్ చిన్న వెంకటరెడ్డి,రెవెన్యూ అదనపు కలెక్టర్ జె. శ్రీనివాస్, తదితరులు పాల్గొన్నారు


Comments

Popular posts from this blog

250 కోట్ల స్కాం లో రైస్ మిల్లు ఓనర్ ఇమ్మడి సోమనర్సయ్య అరెస్ట్: డి ఎస్పీ. గతంలో గూఢచారి ఈ కుంభకోణం పై వార్త కథనం

తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ ఎన్నికలకు అంగీకరించిన అమరవాది - మిడిదొడ్డి శ్యామ్ సుందర్

తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ అధ్యక్ష పదవి కొత్తవారికి అవకాశం కల్పించాలి - మిడిదొడ్డి శ్యామ్