ఫ్రీ లాంఛ్, రియల్ ఎస్టేట్ పేరుతో కుచ్చు టోపీలు పెట్టిన పలువురు - ఆర్యవైశ్యులారా! సూటు బూటు లతో మీ ముందుకు వచ్చే వారి పట్ల జర జాగ్రత్త !
ఫ్రీ లాంఛ్, రియల్ ఎస్టేట్ పేరుతో కుచ్చు టోపీలు పెట్టిన పలువురు - ఆర్యవైశ్యులారా! సూటు బూటు లతో మీ ముందుకు వచ్చే వారి పట్ల జర జాగ్రత్త ఉండండి
రియల్ ఎస్టేట్ లో లాభాలు ఇప్పిస్తామని, ప్రీలాంఛ్ పేరుతో పలువురు వైశ్యులు కుచ్చు టోపీ పెట్టిన సంఘటనలు ఈ మధ్య చాలా నే జరిగాయి.
ఇటీవల పలు పత్రికల్లో వచ్చిన వార్తలు చూడండి
రియల్ ఎస్టేట్ పేరుతో వైశ్య కమ్యూనిటీ కొలిచే అమ్మవారి పేరు మీద వెంచర్లు మొదలు పెట్టి అమాయకులైన ఆర్యవైశ్యలను మభ్యపెట్టి విలువ లేని భూములు అంటగడుతూ పబ్బం గడుపుతున్న కొందరు, వైశ్య కమ్యూనిటీ పేరుతో వ్యాపార గ్రూప్ లు లతో రోజుకో కొత్త కార్యక్రమం పెట్టి సినీ, టివి కళాకారులతో కార్యక్రమాలు చేస్తూ సూట్ బూట్ లతో మన మధ్యనే తిరుగుతున్న వ్యక్తుల పట్ల జాగ్రత్త గా ఉండి పెట్టుబడి పెట్టే ముందు లీగల్ గా ఉన్నాయా? భవిష్యత్తులో లో విలువ పెరుగుతుందా లేదా పరిశీలించుకొని ముందుకు సాగాలని కోరుతున్న గూఢచారి.
సూట్ బూట్ల తో, తలక్కున మెరిసే జిమ్మిక్కులతో, గొప్ప సేవా భా వమున్న వైశ్య దాతల డబ్బుల తో తామే సేవలు చేస్తున్నట్లు మీ ముందుకు వచ్చి లాభాలు ఇప్పిస్తాం అంటూ వెంచర్లు, ఇతర వ్యాపార స్కీమ్ ల తీసుకొస్తున్న వారి పట్ల జాగ్రత్త అవసరం అని గుర్తు చేస్తున్నా గూఢచారి.
Comments
Post a Comment