బైపాస్ రోడ్డు ఆప్షన్ మూడు ని వెనక్కి తీసుకోవాలి - బిజెపి



 


బైపాస్ రోడ్డు ఆప్షన్ మూడు ని వెనక్కి తీసుకోవాలని బాధితులకు అండగా క్లాక్ టవర్ సెంటర్లో బీజేపీ మహా ధర్నా


నల్లగొండ లోని నకేరేకల్ నుండి నాగార్జునసాగర్ హైవే 565 కి నల్లగొండ పట్టణం బయట నుండి బైపాస్ రోడ్డు అలైన్మెంట్ ఆప్షన్ ఒకటి అలాగే ఆప్షన్ రెండుని కాదు అని మూడు ని ఎంచుకోవడంతో సుమారు మూడు వేల మంది మధ్యతరగతి వారు వారి ఇండ్ల స్థలాలను అలాగే ఇండ్లను కొల్పేయే అవకాశం ఉందని బీజేపీ ఆధ్వర్యంలో నల్లగొండ క్లాక్ టవర్ సెంటర్ లో పెద్ద ఎత్తున ధర్నా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షులు డా,నాగం వర్షిత్ రెడ్డి మాట్లాడుతూ నల్లగొండ బైపాస్ నేషనల్ హైవే 565 లో అలైన్మెంట్ లో ఆప్షన్ ఒకటి రెండు ని కాదు అని ఆప్షన్ మూడు ని ఎంచుకోవడం జరిగిందని, దీనివల్ల ప్రజలకు అత్యధిక నష్టం వాటిలుతుందని, బాధితులు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కలవడానికి పోయిన వారిని పట్టించుకోకుండా పక్కకు తప్పించి కారును ముందుకు తిసుకుపోయినారనీ విమర్శించారు. మీకు ఓట్లు వేసి గెలిపించి నలగొండ ప్రజలని ఈ విధంగా అవమానిస్తు సోయి లేకుండా ఉన్నారని, పట్టణను ను రెండు ముక్కలు గా చేసే ఈ రోడ్డు వేయవద్దు నిఅన్నారు. రాత్రికో మాట పొద్దున ఒక మాట మాట్లాడుతున్న మంత్రి ప్రజలు అయన పాలన మీద ప్రజలు విసుగిపోయారుని, అయన పతనం మొదలు అయినదని అన్నారు. ధర్నాలతో ఊరుకోం అని మంత్రి ఇంటిని ముట్టడిస్తాం అని అన్నారు. మంత్రి ఆలోచన చేయాలని, మంత్రి కి లబ్ది చేకూరే విదంగా చేస్తున్నారని అన్నారు. మూడు వేల కుటుంబాలకు భారతీయ జనతా పార్టీ అండగా ఉంటుందని అన్నారు. సమస్య పరిష్కారం అయ్యే వరకు మేము నిద్రపోమని, మంత్రి నిద్రపోనియ్యం మని అన్నారు. ఈ విషయం మీద కలెక్టర్ కూడా స్పందించి చర్యలు తీసుకోవాలని కోరారు. వారికి అండగా ఉండి వారికి న్యాయం చేకూరే వరకు పోరాటం చేస్తామని, బిజెపి జాతీయ నాయకులతో మాట్లాడి వారికి అండగా ఉంటామని తెలిపారు. రాష్ట్ర కార్యదర్శి మాదగోని శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ అభివృద్ధి అనేది ప్రజలకు ఉపయోగపడే విధంగా ఉండాలి తప్ప వారి లాభం కోసం ఉండకూడదు అన్నారు. గత కొన్ని ఏండ్లుగా రూపాయి రూపాయి పొదుపు చేసిన మధ్యతరగతి, పేదల ఇండ్లు స్థలాలు కోల్పోతున్నారని, అభివృద్ధి పేరుతో అరాచకాలు చేస్తున్నారని, ఇకనైనా వారు అమలు చేయాలనుకుంటున్న ఆప్షన్-3 ను వెనక్కి తీసుకోవాలని కోరారు ఈ కార్యక్రమంలో కిసాన్ మోర్చ జాతీయ నాయకులు గోలి మధుసూదన్ రెడ్డి,పార్లమెంట్ కన్వీనర్ బండారు ప్రసాద్, పార్లమెంట్ కోకన్వీనర్ పిల్లి రామరాజు,జిల్లా ప్రధాన కార్యదర్శి చెనమోని రాములు,పోతేపాక లింగస్వామి,కోశాధికారి ఫకీరు మోహన్ రెడ్డి,అధికార ప్రతినిధి పెరిక ముని కుమార్,జిల్లా ఉపాధ్యక్షుడు మిర్యాల వెంకటేశం, అసెంబ్లీ కన్వీనర్ దాయం భూపాల్ రెడ్డి,పట్టణ అధ్యక్షులు కంకణాల నాగిరెడ్డి,నల్లగొండ మండల అధ్యక్షుడు బొగరి అనిల్ కుమార్,తిప్పర్తి మండల అధ్యక్షుడు,పల్లె ప్రకాష్,కౌన్సిలర్లు బొజ్జ నాగరాజు,గుర్రం ధనలక్ష్మి వెంకటేశ్వర్లు,ఓబీసీ మోర్చా జిల్లా అధ్యక్షుడు పిట్టల శ్రీనివాస్,యువ మోర్చా జిల్లా అధ్యక్షుడు వంగూరి రాఖి, ప్రధాన కార్యదర్శి రేవల్లి కిరణ్,వట్టి కోటి దుర్గ,కానుగు గోపి,పట్టణ ప్రధాన కార్యదర్శి గాలి శ్రీను,పగిడి మహేష్,తిప్పర్తి మండల ప్రధాన కార్యదర్శి మధు,నేవర్స్ నీరజ,మునగాల సుధారాణి మరియు భూ నిర్వాసిత బాధ్యులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు

Comments

Popular posts from this blog

250 కోట్ల స్కాం లో రైస్ మిల్లు ఓనర్ ఇమ్మడి సోమనర్సయ్య అరెస్ట్: డి ఎస్పీ. గతంలో గూఢచారి ఈ కుంభకోణం పై వార్త కథనం

తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ ఎన్నికలకు అంగీకరించిన అమరవాది - మిడిదొడ్డి శ్యామ్ సుందర్

తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ అధ్యక్ష పదవి కొత్తవారికి అవకాశం కల్పించాలి - మిడిదొడ్డి శ్యామ్