విద్యారంగా అభివృద్ధిలో విజయలక్ష్మి సేవలు ప్రశంసనీయం
విద్యారంగా అభివృద్ధిలో విజయలక్ష్మి సేవలు ప్రశంసనీయం
ఉపాధ్యాయ వృత్తి ని అంకిత భావంతో నిర్వహించి విద్యాభివృద్ధికి కృషి చేసిన రామరాజు విజయలక్ష్మీ అభినందనీయు రాలని రిటైర్డ్ ఉద్యోగుల సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు ఆర్ సీతారామయ్య,జిల్లా ప్రధాన కార్యదర్శి బొల్లు రాంబాబు లు అన్నారు.అనంతగిరి మండలం శాంతినగర్ హైస్కూల్ లో ఆంగ్ల ఉపాధ్యాయు రాలిగా పని చేసి ఉద్యోగ విరమణ పొందిన విజయ లక్ష్మీ అభినందన సభ లో వారు మాట్లాడారు.ఈ కార్యక్రమంలో హెచ్ ఎమ్ పురుషోత్తం, మాజీ సర్పంచ్ బద్దం కృష్ణారెడ్డి, సురేష్ ,స్థానిక నాయకులు భద్రారెడ్డి, రాఘవరెడ్డి, పుల్లారెడ్డి వెంకట్ రెడ్డి ,గోపాల్ రెడ్డి, మాజీ ఎంఈఓ గోపయ్య, అప్పయ్య , పాఠశాల ఉపాధ్యాయులు మంగమ్మ,వి సత్య నారాయణ, జయ, స్టాలిన్ శ్రీధర్, శ్రీనివాసరావు, షేక్ బాలేమియా,ఏ వెంకటేశ్వర్లు, నరేష్, మాజీహెచ్ఎం సుజాత, పలు ఉపాధ్యాయ సంఘాల నాయకులు విద్యార్థులు విద్యా కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు
Comments
Post a Comment