సెప్టెంబర్ 1న కాశి అన్నపూర్ణ వాసవి ఆర్యవైశ్య వృద్ధాశ్రమం మరియు నిత్యాన్న సత్రం ఎన్నికలు
సెప్టెంబర్ 1న కాశి అన్నపూర్ణ వాసవి ఆర్యవైశ్య వృద్ధాశ్రమం మరియు నిత్యాన్న సత్రం ఎన్నికలు
హైద్రాబాద్ : (గూఢచారి ప్రతినిధి)
శ్రీ కాశి అన్నపూర్ణ వాసవి ఆర్యవైశ్య వృద్ధాశ్రమం మరియు నిత్యాన్న సత్రం ఎన్నికలు సెప్టెంబర్ 1న హైద్రాబాద్ లకడికపూల్ వాసవి సేవా కేంద్రంలో నిర్వహిస్తున్నట్లు ఎన్నికల అధికారి శ్రీమతి మంజులత వర్మ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేశారు.
ఈ ఎన్నికల్లో అధ్యక్షులు, జనరల్ సెక్రెటరీ, ట్రెజరర్, అడిషనల్ జనరల్ సెక్రెటరీ, ఆర్గనైజింగ్ సెక్రటరీ, వైస్ ప్రెసిడెంట్ లు ఏడుగురు, ఆంధ్ర ప్రదేశ్ తెలంగాణ నుండి ముగ్గురు కర్ణాటక నుండి ఇద్దరు తమిళనాడు నుండి ఒకరు మహారాష్ట్ర నుండి ఒకరు) సెక్రటరీలు ఏడుగురు, (ఆంధ్రప్రదేశ్ తెలంగాణ నుండి ముగ్గురు కర్ణాటక నుండి ఇద్దరు తమిళనాడు నుండి ఒకరు మహారాష్ట్ర నుండి ఒకరు), అడ్వైజర్లు 19 మంది కి (ఆంధ్రప్రదేశ్ తెలంగాణ నుండి 13 మంది కర్ణాటక నుండి నాలుగు తమిళనాడు నుండి ఒకరు మహారాష్ట్ర నుండి ఒక్కరు) ఎన్నికలు నిర్వహించబడతాయి.
ఆగస్టు 10 న నామినేషన్ పత్రాలు ఇస్తారు, ఆగస్టు 16, 17 తేదీల్లో ఉదయం 10 నుండి సాయంత్రం ఐదు గంటల వరకు నామినేషన్లు స్వీకరిస్తారు. ఆగస్టు 18వ తేదీ స్క్రూట్ని నిర్వహిస్తారు. ఆగస్టు 19 న ఉపసంహరణకు అవకాశం ఉన్నట్లు ఆ నోటిఫికేషన్ లో పేర్కొన్నారు.
Comments
Post a Comment