దేవాదాయశాఖలో కారణ్య నియామాకాలలో గోల్ మాల్




 ****ఇంత కారుణ్యమేల* 


దేవాదాయశాఖలో కారణ్య నియామాకాలలో గోల్ మాల్ - #సర్వీస్ రూల్స్కు విరుద్దంగా పోస్టింగులు

#ఆలయ ఉద్యోగ వారసులకు అన్యాయం

-కార్యాలయం సిబ్బంది కుటుంబసభ్యులు పెద్దపీట :

#ప్రొబేషనరీ పీరియడ్ కాలంలో అర్హత పరీక్షలు ఉతీర్ణత కాకున్నకొనసాగింపు 

#విచారణ చేపట్టాలని ఆలయ ఉద్యోగుల డిమాండ్* 

*

తెలంగాణ దేవాదాయ శాఖలో కారుణ్య నియామాకాలు చర్చనీయాంశంగా మారింది. ఇంటి పెద్ద దిక్కుగా ఉండే ఉద్యోగి చనిపోతే వారిపై ఆధారపడిన అర్హులకు కొలువు ఇవ్వడం పద్దతే. దేవాదాయ శాఖ నిబంధనల్లో ఇదోక భాగమే దీన్ని మానవీయ కోణంలో ఎవ్వరూ వ్యతిరేకించడం లేదు, అయితే ఇందులో వ్యవహరిస్తున్న తీరే అయోమయంగా మారింది. కారుణ్య నియామాకాలలో అనుకూలరుకు ఒక విధంగా... ఇతరులకు మరో విధంగా పోస్టింగ్లు ఇవ్వడం వివాదస్పదంగా మారింది, దేవాలయ ఉద్యోగులు మృతి చెందింతే ఒక తీరుగా, కార్యాలయ సిబ్బంది ఉద్యోగుల వారసులకు మరో విధంగా కారుణ్య నియామాకాలలో పక్షపాత దోరణి అవలంభిస్తున్నారు. ఈ విధంగా చేయడం వల్ల ఆలయ ఉద్యోగుల వారసులు ఈఓ గ్రేడ్-3 రావాలంటే సుమారు 20 ఏళ్లుగా పేగా వేచి ఉండాల్సి ఉండగా కార్యాలయ ఉద్యోగులకు మాత్రం నేరుగా కట్టబేడుతున్నారు. దీంతో ఆలయ ఉద్యోగులకు తీవ్ర అన్యాయం జరుగుతున్నది. గతంలో ఈఓలతో పాటు కార్యాలయ సిబ్బంది, అధికారులు మృతి చెందితే ఎరి వారసులకు జూనియర్ అసిస్టెంట్లుగా నియమించి మఫిసీల్ కోటాలో పదోన్నతులు వచ్చేవి. కానీ గత ఐదేళ్లుగా నేరుగా కేవలం ఈఓ గ్రేడ్-3 ఇచ్చి ఆలయ ఉద్యోగులపై ఆజాయిషీ చేలాయిస్తున్నారు.


 *సుదీర్ఘ అనుభవంతో అప్రయోజనం ఏదీ* 


వడ్డించే వారు మనవాడైతే.. ఏ బంతిలో కూర్చుంటే ఏముంది మాదిరిగా దేవాదాయ శాఖ ఉన్నతాధికారులు వ్యవహరిస్తున్నరు. దీంతో దేవాలయాలలో పనిచేస్తూ మృతి చెందిన వారసులకు తీవ్ర అన్యాయం జరుగుతుంది. దేవాదాయశాఖ కార్యాయాలలో, పనిచేస్తున్న ఉద్యోగులు, ఆలయ ఈఓలకు గతంలో ప్రభుత్వం వేతనాలు ఇచ్చేది. ఆలయ ఉద్యోగులకు మాత్రం ఆలయ ఆదాయం బట్టి జీతభత్యాలు ఉండేవి. కానీ 2017లో 577 జీఓ ఆలయాల్లోని అర్చక, ఉద్యోగులకు మిగతా ఉద్యోగులాగే గ్రాంట్ ఇన్ ఎయిడ్ కింద పే స్కేల్ అమలు చేస్తున్నారు. ట్రస్టు నుంచి వేతనాలు చెల్లిస్తున్నారు. సాదారణంగా ఇలా నియమించే వారిని అర్హతలను బట్టి జూనియర్ అసిస్టెంట్ లేదా తక్కువ స్థాయి ఉద్యోగానికి ఎంపిక చేయాల్సి ఉంటుంది. కానీ కొందరు దేవాదాయశాఖ ఉన్నతాధికారులు రూల్స్ విరుద్దంగా ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్-3లో నియామకాలు చేపట్టారు. కారుణ్య నియామాకాలతో డైరక్టుగా ఈఓ గ్రేడ్-3 గానియమితులవుతున్నారు. కానీ ఆలయ ఉద్యోగులు 30 ఏళ్లుగా పదోన్నతికి నోచుకోక జూనియర్ అసిస్టెంట్లుగా రిటైర్డ్ అవుతున్నారు. కొందరు మఫీసీల్ కోటాలో దొడ్డిదారిన పదోన్నతులు పొంది ఉన్నత పదవులు వెలగబెడతున్నారు. కానీ ఆలయ ఉద్యోగులు జూనియర్ అసిస్టెంట్లుగానే కాలం వెలబుస్తున్నారు. కారుణ్యనియామాకాలలో దేవాదాయ శాఖ చట్టం, నిబంధనలు ప్రకారం జరగాల్సి ఉండగా అధికారులు తమకు తోచిన విధంగా వ్యవహరిస్తున్నారు. జీఓ 38 రెవెన్యూ(ఎండోమెంట్-1) డిపార్ట్మెంట్ 29.01.2018, విరుద్ధంగా వ్యవహరిస్తూ అడ్మినిస్ట్రేటివ్ సిబ్బంది వారసులకు నిబంధనలకు విరుద్ధంగా పెద్దపీట వేస్తున్నారు.


 *విచారణ చేపడితే వెలుగులోకి వాస్తవాలు* 


కారుణ్య నియామకాలన్నీ డైరక్ట్ రిక్రూట్మెంట్ కోటాలో సిక్స్ పాయింట్ పార్ములాకు లోబడి ఇవ్వాలి. కానీ ముందుగా టీజీపీఎస్సీ  లేదా డీఎస్సిఅనుమతి తీసుకోవాలి. కానీ ఎక్కడా పాటించినా దాఖలాలు లేవు. అంతేగాకుండా దేవాలయ ఉద్యోగులకు, కార్యాలయ ఉద్యోగాలకు వేర్వేరుగా వ్యవహరిస్తున్నారు. - డైరక్ట్ రిక్రూట్మెంట్ కోటాలో గ్రేడ్ ఈఓ-3 నియమతులైన ఉద్యోగులు

ప్రొబేషనరీ పీరియడ్లో తప్పనిసరిగా డిపార్ట్మెంట్ టేస్టులు పాస్ కావాల్సి ఉంటుంది, లేనియేడల తిరిగి వారిని జూనియర్ అసిస్టెంట్లుగా వాపసు చేయాల్సిందిగాటుంది, లేనియేడల తిరిగి వారిని జూనియర్ అసిస్టెంట్లుగా వాపసు చేయాల్సిందిగా సర్వీస్ రూల్స్ నిబంధనలు ఉన్నాయి. వాటిని అధికారులు పట్టించుకోవడం లేదు.

విచారణ చేపడితే  అధికారుల పక్షపాత ధోరణితో పాటు దొడ్డి దారిన నియామకం. అర్హత లేని వారికి

రివర్షన్ ఇచ్చే ఆవకాశం లేకపోలేదని దేవాదాయ శాఖ రిటైర్డ్ ఉన్నతాధికారి ఒకరు స్పష్టం చేశారు.

Comments

Popular posts from this blog

250 కోట్ల స్కాం లో రైస్ మిల్లు ఓనర్ ఇమ్మడి సోమనర్సయ్య అరెస్ట్: డి ఎస్పీ. గతంలో గూఢచారి ఈ కుంభకోణం పై వార్త కథనం

తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ ఎన్నికలకు అంగీకరించిన అమరవాది - మిడిదొడ్డి శ్యామ్ సుందర్

తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ అధ్యక్ష పదవి కొత్తవారికి అవకాశం కల్పించాలి - మిడిదొడ్డి శ్యామ్