*ఐఏఎస్ అధికారి స్మిత సబర్వాల్ వాఖ్యలను తీవ్రంగా ఖండించిన బాలలత*
*ఐఏఎస్ అధికారి స్మిత సబర్వాల్ వాఖ్యలను తీవ్రంగా ఖండించిన బాలలత*
హైద్రాబాద్:
( గూఢచారి ప్రతినిధి):
*బాలలత, మాజీ బ్యూరోక్రాట్*
*స్మిత సబర్వాల్ కి మాజీ బ్యూరోక్రాట్ సవాల్*
తనతో సివిల్స్ పరీక్షకు రాయడానికి స్మిత సిద్ధమా అంటూ సవాల్ విసిరిన బాలలత
ఆమె మాటల్లో...
తనతో పాటు సివిల్స్ పరీక్షలు రాసి ఎక్కువ మార్కులు తెచ్చుకోవాలని స్మితకి సవాల్ విసిరిన బాలలత
స్మిత సబర్వాల్ గుర్తింపు కోసమే మాట్లాడుతోంది
స్మిత సబర్వాల్ మాటలు దురదృష్టకరం
అసలు దివ్యంగులం బ్రతకాలా వద్దా? మమ్మల్ని రాష్ట్రంలో ఉండమంటారా? వద్దా?
పని ఉన్నోళ్ళు పని చేస్తారు. ట్వీట్ లు పెడుతూ ఉండరు
స్మిత సబర్వాల్ ఫిజికల్ గా ఫిట్ గా ఉన్నారేమో కానీ మెంటల్ గా ఫిట్ గా లేదు.
అసలు స్మిత సబర్వాల్ అర్హత ఎంటి?
స్మిత మాట్లాడిన మాటలు ఆమె వ్యక్తిగతమా? తెలంగాణ ప్రభుత్వ విధానమా?
స్మిత తన సర్వీసులో ఎన్ని రోజులు ఫీల్డ్ వర్క్ లో పరుగెత్తుతూ పని చేసిందో చెప్పాలి
స్మిత ట్వీట్ తాను దివ్యంగుల పట్ల వివక్షతను చూపుతోంది
ఐటీ యాక్ట్ కింద స్మిత సబర్వాల్ పై చర్యలు తీసుకోవాలి
కాంగ్రెస్ నేత జైపాల్ రెడ్డికి రెండు కాళ్ళు పనిచేయవు. కానీ బెస్ట్ పార్లమెంటేరియన్ అవార్డు వచ్చింది
జైపాల్ రెడ్డికి కాళ్ళు లేకపోయినా ఐఏఎస్ అధికారులే అయన్ని నడిపించారు
ఐఏఎస్, ఐపీఎస్ మాత్రమే ప్రీమియర్ పోస్టులు అని స్మిత కి ఎవరు చెప్పారు?
సీఎం, సీఎస్ ఆలోచించి
స్మిత సబర్వాల్ పై చర్యలు తీసుకోవాలి
స్మిత లాంటి ఆఫీసర్ కి కీలక పోస్టు ఇస్తే ఏమవుతుందో అర్థం అవుతుంది
స్మిత చేసిన వ్యాఖ్యలను కేటీఆర్ ఖండించాలి
*స్మితపై 24 గంటల్లో చర్యలు తీసుకోవాలి*
నిరసన ప్రజాస్వామ్యంలో హక్కు అని సీఎం అన్నారు
కేంద్ర మాజీమంత్రి జైపాల్ రెడ్డి ఘాట్ వద్ద శాంతియుతంగా నిరసన వ్యక్తం చేస్తాం*
స్మిత చేసిన వ్యాఖ్యలపై సాటి ఐఏఎస్ లు స్పందించాలి
స్మిత సబర్వాల్ కి ఏదైనా జరగరానిది జరిగి దివ్యంగురాలు అయితే ఐఏఎస్ కి రాజీనామా చేస్తారా?
స్మిత జస్ట్ ఒక ఐఏఎస్ అధికారి మాత్రమే
స్మిత పర్సనల్ లైఫ్, స్మిత రీల్స్ గురించి నేను మాట్లాడను. ఆమె మా కమ్యూనిటిపై మాట్లాడినందుకు రీయాక్ట్ అయ్యాను
స్మిత రాజ్యాంగానికి వ్యతిరేకంగా మాట్లాడుతోంది.
Comments
Post a Comment