పీపుల్స్ ఫ్రెండ్లీ జిల్లా కలెక్టర్ గా నల్గొండ జిల్లా కలెక్టర్ సి. నారాయణ రెడ్డి
పీపుల్స్ ఫ్రెండ్లీ జిల్లా కలెక్టర్ గా నల్గొండ జిల్లా కలెక్టర్ సి. నారాయణ రెడ్డి
నల్గొండ:
నల్గొండ జిల్లా కలెక్టర్ సి. నారాయణ రెడ్డి పీపుల్స్ ఫ్రెండ్లీ జిల్లా కలెక్టర్ గా ప్రజలకు ప్రభుత్వం అందించే సేవలు సక్రమంగా అందేలా పలు చర్యలు తీసుకుంటున్నారు. గతం లో నల్గొండ జిల్లా జాయింట్ కలెక్టర్ భాద్యతలు నిర్వహించడం తో జిల్లాపై పూర్తి అవగాహన ఉంది. అయన జిల్లా కలెక్టర్ గా భాద్యతలు సేకరించిన నాటి నుండి ప్రజల సమస్యల పై స్పందించడం, ప్రజలకు సేవలందించే పలు విభాగాలను ఆకస్మిక తనిఖీ లు చేస్తూ అధికారులను , ఉద్యోగులను ప్రజలకు సేవలు అందించే విధంగా చర్యలు చేపడుతున్నారు.
గత కొన్ని రోజుల క్రింద నల్లగొండ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రిని ఆకస్మికంగా తనిఖీ చేసి పలు చర్యలు తీసుకోవడం మే కాకుండా మొత్తం ఆసుపత్రి సేవలు ప్రజలకు సక్రమంగా అనేందుకు జిల్లా యంత్రాంగాన్ని పర్యవేక్షించే విధంగా డ్యూటీలు వేశారు.
జిల్లా కలెక్టర్ జిల్లా కేంద్రంతో పాటు మండలాల్లోని వివిధ కార్యాలయాలను ప్రతిరోజు ఆకస్మిక తనిఖీలు చేపడుతున్నారు. ముందస్తు సమాచారం లేకుండా విధులకు గైరాజరవుతున్న అధికారులను వెంటనే సస్పెండ్ చేస్తున్నారు.
శుక్రవారం హాలియాలోని పిహెచ్ సీ లో సీనియర్ అసిస్టెంట్ ను సస్పెండ్ చేయగా శనివారం జిల్లా కేంద్రంలోని వ్యవసాయ శాఖ కార్యాలయంలోని పరిపాలన అధికారిని సస్పెండ్ చేశారు .
శనివారం అయన నల్గొండ జిల్లా కేంద్రంలో ఉన్న బాలసదన్, శిశు గృహ, సఖి, స్వధార్ కేంద్రాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ముందుగా జిల్లా కలెక్టర్ బాలసదనం సందర్శించి అక్కడ ఉన్న చిన్నారుల వివరాలను అడిగి తెలుసుకున్నారు .చండూరు మండలం పురంపల్లికి చెందిన నాలుగో తరగతి చదివే పూజితను తల్లిదండ్రులు బలవంతంగా చదువు మాన్పించగా చదువుకోసం శిశు గృహకు వచ్చినట్లు జిల్లా కలెక్టర్ తెలుపగా, తక్షణమే కలెక్టర్ స్పందించి మంచి పాఠశాలలో చేర్పిస్తామని, మంచి చదువు చెప్పిస్తామని, భోజనం, బట్టలు ఇప్పిస్తామని భరోసా ఇచ్చారు. పక్కనే ఉన్న శిశు గృహ ను జిల్లా కలెక్టర్ తనిఖీ చేశారు. ప్రస్తుతం ఎంతమంది చిన్నారులు శిశు గృహాలు ఉన్నారని? ప్రతిరోజు డాక్టర్ పరీక్షిస్తున్నారా? వారికి పాలు ,ఇతర సంరక్షణ ఎలా చేస్తున్నారని నిర్వాహకులను అడిగి తెలుసుకున్నారు .జూలై నెలలో ఎంతమంది పిల్లలు వచ్చారని, ఎంతమందిని ఇప్పటివరకు దత్తత ఇచ్చారని పూర్తి వివరాలను ఆయన అడిగారు.తల్లిదండ్రులు వదిలేసిన పిల్లలు, పెళ్లికాకముందే పుట్టిన చిన్నారులను బయట వదిలివేయకుండా శిశు గృహాకు తీసుకువచ్చి అప్పగించే విధంగా శిశుగృహపై విస్తృతంగా అవగాహన కల్పించాలని ,శిశు గృహ పై మంచి నమ్మకం కలిగించాలని జిల్లా కలెక్టర్ తెలిపారు. శిశు గృహాకు వచ్చిన పిల్లలను అవసరమైన వారికి దత్తత ఇవ్వడం ద్వారా శిశు గృహ పై నమ్మకం కలుగుతుందని చెప్పారు. పిల్లల విషయంలో ఎలాంటి తప్పు జరగకుండా చూసుకోవాలని అన్నారు. బాలసదన్, శిశు గృహనిర్వహణ పట్ల ఆయన సంతృప్తివ్యక్తం చేశారు. అనంతరం జిల్లా కలెక్టర్ ప్రకాశం బజార్ లో ఉన్న సఖి కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ జూలై నెలలో నమోదైన కేసుల వివరాలను అడగగా ,28 కేసులు ఇప్పటివరకు నమోదయ్యాయని నిర్వాహకులు తెలిపారు .భార్యా భర్తల తగాదాలు ,ఫోక్సో కేసుల వంటివి ఇక్కడకి వస్తున్నాయని తెలుసుకొని సఖి కేంద్రం పనితీరుపై ఆయన స్వయంగా 181 కాల్ సెంటర్ కు సాధారణ వ్యక్తిలా ఫోన్ చేసి మాట్లాడారు. తనకు సమస్య ఉందని తన సమస్యను నమోదు చేయించేందుకు నల్గొండ జిల్లా సఖి కేంద్రం నంబర్ కు కాల్ కలపాలని సఖి కేంద్రం హెల్ప్ లైన్ నెంబర్ నిర్వాహకులతో కోరగా, వారు జిల్లా కలెక్టర్ కు నల్గొండ జిల్లా సఖి కేంద్రం ఫోన్ నెంబర్ 8682234088 కు ఫోన్ చేసి కనెక్ట్ చేశారు. ఈ విషయంపై ఆయన స్వయంగా మాట్లాడి నిర్ధారించుకున్న అనంతరం సఖి కేంద్రం నల్గొండ నిర్వాహకులతో మాట్లాడుతూ సఖి కేంద్రంలో నమోదైన కేసుల వివరాలను పరిశీలించారు. అంతేకాక కేసు నమోదు చేసిన కొందరితో ఫోన్లో మాట్లాడి వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఎవరికి ఎలాంటి సమస్య ఉన్న సఖి కేంద్రం ఉందనే భరోసాను కలిగించాలని, ఎలాంటి వారు వచ్చిన మేమున్నామనే నమ్మకం కలిగించాలని తెలిపారు. ఇద్దరు హోంగార్డులు కావాలని సఖి కేంద్రం నిర్వాహకులు జిల్లా కలెక్టర్ కు విజ్ఞప్తి చేయగా తక్షణమే ఏర్పాటు చేస్తామని కలెక్టర్ చెప్పారు. అనంతరం జిల్లా కలెక్టర్ స్వధార్ గృహ కేంద్రాన్ని తనిఖీ చేశారు. అక్కడున్న మహిళలతో ప్రత్యక్షంగా మాట్లాడుతూ ఎక్కడినుండి వచ్చారని? ఏం చేస్తున్నారని? అడిగారు.ఆయా వృత్తులలో శిక్షణ ఇచ్చిన తర్వాత ఏదైనా పని చూపిస్తే చేసుకోవాని సూచించారు.ఈ కేంద్రం లో డిగ్రీ, ఇంటర్, ఏఎన్ఎం తదితర కోర్సులు చేస్తు మధ్యలో వదిలేసిన వారు ఉండగా, వారి చదువులు పూర్తి చేసేందుకు చర్యలు తీసుకోవాలని,వారు చదువుకునేందుకు ఫీజులు చెల్లించాలని, ఏఎన్ఎం కోర్సు పూర్తి చేసిన 3 మహిళలకు ఏ ఎన్ ఎం లు గా ఎక్కడైనా అవకాశం కల్పిస్తామని, అదేవిధంగా పని చేసుకునే వారికి పని కల్పిస్తామని ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ తెలిపారు .మహిళలు ఆర్థికంగా వారి కాళ్ళపై వారు నిలబడాలని, అప్పుడే సమాజంలో గుర్తింపు ,గౌరవం వస్తాయని అన్నారు. ఈ సందర్భంగా కొందరు టైలరింగ్ బ్యూటిషన్ చేస్తున్నామని తెలుపగా పాఠశాల విద్యార్థుల యూనిఫార్మ్స్ ను కుట్టే బాధ్యతను అప్పగిస్తామని,అలాంటి పనులు చేసుకోవాలని ఆయన సూచించారు.
Comments
Post a Comment