సోషలో మీడియాలో నిరసనల హోరు - తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ ఎన్నికలు జరపాలని ఊపందుకున్న ఉద్యమం
సోషలో మీడియాలో నిరసనల హోరు - తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ ఎన్నికలు జరపాలని ఊపందుకున్న ఉద్యమం
హైద్రాబాద్:
దాదాపు 9 సంవత్సరముల నుండి ఎన్నిక కాకుండా, ఓ 10 మంది తో సొసైటీ ఏర్పాటు చేసుకొని, ఆంధ్రప్రదేశ్ ఆర్యవైశ్య మహాసభ నాయకులతో నాదే తెలంగాణ ఆర్యవైశ్య మహాసభ అంటూ అధ్యక్షుడిగా చెలామణి అవుతున్న, అక్రమంగా మహాసభ బిల్డింగ్ లో తిష్టవేసిన వారిని సాగనంపడానికి ఉద్యమం ఊపందుకుంది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న వైశ్య నాయకులు గళం వినిపిస్తున్నారు. తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ కు ఎన్నికలు ప్రజాస్వామ్య బద్ధంగా నిర్వహించాలంటూ కార్యక్రమం రూపొందించుకున్నారు. అప్రజాస్వామికంగా ఉన్న వారు కర్మంగట్ లో నిర్వహించ దలుచుకున్న సమావేశం దగ్గరకు భారీగా సంఖ్యలో వైశ్యులు తరలివచ్చి ఎన్నికలు నిర్వహించే విధంగా డిమాండ్ చేయాలని, జిల్లా అధ్యక్షుల చప్పట్లతో మరోసారి అధ్యక్ష పదివి కాలాన్ని పొడిగించుకోకుండ ఉద్యమం చేయాలని నిర్ణయించి భారీగా హాజరు కావాలని పిలుపు నిచ్చారు. ప్రజాస్వామ్య బద్ధంగా రాష్ట్ర మహాసభ ఎన్నికల తో పాటు ప్రభుత్వం ఉప్పల్ భాగాయత్ లో కేటాయించిన 5 ఎకరాల స్థలం ట్రస్టు పేరుతో కొంత మంది చేతుల్లోకి పోకుండా ఉండాలని సోషల్ మీడియా లో గ్రూప్ క్రియేట్ చేయడం తో అన్ని జిల్లా లా నుండి స్వచ్ఛందంగా జాయిన్ అవుతూ అప్రజాస్వామ్య పద్ధతులు పై నిరసనల గలములు ఉవ్వెత్తుతున్నాయి. వీరి ఆప్రజాస్వామ్య పోకడలకు మహాసభ భవన్ లో ఉన్న మహాత్మ గాంధీ, పొట్టి శ్రీ రాములు విగ్రహాలు కూడా చిన్న పోతున్నాయి.
ఈ క్రింద సోషల్ మీడియా వాట్సాప్ లింక్
Comments
Post a Comment