శ్రీ సరస్వతి శిశు మందిర్ కు ప్రింటర్ బహుకరణ
నల్గొండ పట్టణం రవీంద్ర నగర్ చిన్న వెంకటరెడ్డి ఫంక్షన్ హాల్ దగ్గర ఉన్నటువంటి శ్రీ సరస్వతి శిశు మందిర్ స్కూల్ కి ఈరోజు సంజీవిని మెడికేర్ సొసైటీ సహకారంతో 23,500 రూపాయలు విలువ గల ప్రింటర్ పాఠశాలకు అందజేయడం జరిగింది. పాఠశాల యాజమాన్యం వీరికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధాన ఆచార్యులు అనిత రెడ్డి, సమితి జనరల్ సెక్రటరీ పరమాత్మ, అకాడమిక్ సెక్రటరీ లక్ష్మీనారాయణ, జాయింట్ సెక్రెటరీ సుధాకర్, సంజీవిని మెడికేర్ ప్రెసిడెంట్ వెంకటేశ్వర్లు, పవన్ కుమార్, శ్రీనివాస్ అసోసియేషన్ సభ్యులు పాల్గొన్నారు.
Comments
Post a Comment