దొడ్డికొమురయ్య ఆశయాలను కొనసాగించడం కాంగ్రెస్ తోనే సాధ్యం : నర్సారెడ్డి సిద్దిపేట కాంగ్రెస్ అధ్యక్షులు


 దొడ్డికొమురయ్య ఆశయాలను కొనసాగించడం కాంగ్రెస్ తోనే సాధ్యం : నర్సారెడ్డి సిద్దిపేట కాంగ్రెస్ అధ్యక్షులు గజ్వేల్ మాజీ ఎమ్మెల్యే


తెలంగాణలో మొదటిసారి కురుమ ను అసెంబ్లీ పంపిన ఘనత కాంగ్రెస్ దే 


ఆలేరు ఎమ్మెల్యేగా గెలిచిన బీర్ల ఐలయ్య కురుమకు ప్రభుత్వ విప్ పదవి గౌరవించాము 


మోసం చేసే పార్టీ టిఆర్ఎస్ న్యాయం చేసే పార్టీ కాంగ్రెస్



కెసిఆర్ కురుమలను మోసం చేస్తే తెలంగాణలో మొదటిసారి కురుమలను గుర్తించి రెండు టికెట్లు కేటాయించిన ఘనత కాంగ్రెస్ పార్టీదని ఆలేరు ఎమ్మెల్యేగా గెలుపొందిన బీర్ల ఐలయ్యకు ప్రభుత్వ విప్ పదవి ఇచ్చి గౌరవించామని డీసీసీ సిద్దిపేట అధ్యక్షులు గజ్వేల్ మాజీ ఎమ్మెల్యే నర్సారెడ్డి అన్నారు 

  కొమరయ్య ఆశయాలను కాంగ్రెస్ కొనసాగిస్తుందని అన్ని కులాలను అభివృద్ధి చేసే దిశగా అనేక పథకాలు పెట్టి అభివృద్ధి చేసిన ఘనత కాంగ్రెస్ పార్టీకే దక్కింది అన్నారు. తెలంగాణ రైతాంగ పోరాట తొలి అమరుడు

దొడ్డి కొమరయ్య 78వ వర్ధంతి వేడుకలు గజ్వేల్ అంబేద్కర్ చౌరస్తా లో కురుమ సంఘం ఆధ్వర్యంలో ఘనంగా జరిగా దీనికి ముఖ్యఅతిథిగా నర్సారెడ్డి ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నీవాలి అర్పించారు. అంతకుముందు డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. రాష్ట్రంలో గొర్రెల పథకానికి డీడీలు కట్టిన కురుమలకు న్యాయం చేస్తామని అన్నారు. కురుమ రిజర్వేషన్ పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షుడు బింగి స్వామి కురుమ మాట్లాడుతూ దొడ్డి కొమరయ్య అమరత్వం చాకలి ఐలమ్మ ధీరత్వంతో తెలంగాణను సాధించుకుంటే దశాబ్ది తెలంగాణలో కురుమలకు ఎమ్మెల్యే టికెట్ ఇవ్వకుండా కేసీఆర్ కురుమల్ని మోసం చేశారని కాంగ్రెస్ పార్టీ రెండు టికెట్లు ఇచ్చి గౌరవించిందన్నారు. సీఎం రేవంత్ రెడ్డి కాంగ్రెస్ అదిష్టానానికి కృతజ్ఞతలు తెలిపారు.ఆలేరు ఎమ్మెల్యేగా గెలిచిన బిర్ల ఐలయ్య కురుమ కు మంత్రి పదవి ఇస్తే 40 లక్షలకు పైగా ఉన్న కురుమలకు గౌరవం ఇచ్చిన ఉంటుందన్నారు. సిద్దిపేట జిల్లాలో కురుమలు ఏక్కువగా ఉన్న గ్రామాల్లో సర్పంచ్ ఎంపీటీసీ, జెడ్పిటిసి టికెట్లు కేటాయిస్తే గెలిచే అవకాశం ఉందన్నారు. పుస్తెలు కుదువబెట్టి డీడీలు కట్టిన గొర్రె కాపర్లకు ప్రభుత్వం న్యాయం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో మాజీ మున్సిపల్ చైర్మన్ గాడి పల్లి భాస్కర్ కుకునూరుపల్లి మాజీ సర్పంచ్ ఐలం కురుమ, కొడకండ్ల మాజీ ఎంపీటీసీ అంజయ్య కురుమ రిమ్మనగూడ మాజీ సర్పంచ్ రాములు కురుమ భాగమొల్ల మల్లేశం కడారి నరేందర్ గొల్లపల్లి నరేందర్ రెడ్డి రమేష్ గౌడ్ కురుమ సంఘం నాయకులు మహంకాళి నరేష్ బొమ్మ కుమార్ కర్రోల యాదగిరి కొడకండ్ల ఉప సర్పంచ్ అనిల్ శ్రీహరి కాంగ్రెస్ సీనియర్ నాయకులు తదితరులు పాల్గొన్నారు

Comments

Popular posts from this blog

250 కోట్ల స్కాం లో రైస్ మిల్లు ఓనర్ ఇమ్మడి సోమనర్సయ్య అరెస్ట్: డి ఎస్పీ. గతంలో గూఢచారి ఈ కుంభకోణం పై వార్త కథనం

తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ ఎన్నికలకు అంగీకరించిన అమరవాది - మిడిదొడ్డి శ్యామ్ సుందర్

తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ అధ్యక్ష పదవి కొత్తవారికి అవకాశం కల్పించాలి - మిడిదొడ్డి శ్యామ్