న్యూ ఢిల్లీ లో ఆర్యవైశ్య ప్రజాప్రతినిధులతో ఉప్పల శ్రీనివాస్ గుప్తా
ఆర్యవైశ్య ప్రజాప్రతినిధులతో ఉప్పల శ్రీనివాస్ గుప్తా
ఆర్యవైశ్య ప్రజా ప్రతినిధులకు సన్మానం
హాజరైన ఉప్పల శ్రీనివాస్ గుప్తా
రాజకీయంగా వెనుకబడిన ఆర్యవైశ్య జాతిని మేల్కొలిపి, వివిధ రాష్ట్రాల్లో నామినేటెడ్ పద వులు దక్కించుకొనేలా ఆర్యవైశ్య ప్రజా ప్రతినిధులు చొరవ చూపాలని అంతర్జాతీయ వైశ్య ఫెడరేషన్(ఐవీఎఫ్) తీర్మాణించింది. ఆలిండియా అధ్యక్షుడు అశోక్ అగర్వాల్ అధ్యక్షతన న్యూఢిల్లిలో నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంలో ఇటీవల జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో విజేతలుగా నిలిచిన పలువురు వైశ్యనాయకులను ఘనంగా సన్మానించారు. దాదాపు 37మంది లోక్‌సభ, రాజ్యసభ సభ్యులుగా వివిధ పార్టీల నుంచి ప్రాతినిథ్యం వహిస్తుండగా, స్వతంత్ర అభ్యర్థులుగా పోటీ చేసి గెలుపొందిన వారిని సైతం ఒకే వేదికపైకి తీసుకు వచ్చి ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా అంతర్జాతీయ ఆర్యవైశ్య ఫెడరేషన్(ఐవీఎఫ్) వర్కింగ్ ప్రెసిడెంట్ ఉప్పల శ్రీనివాస్ గుప్తా మాట్లాడుతూ రాజకీయాలకతీతంగా వైశ్యజాతి ప్రజా ప్రతినిధులు సామాజిక సేవా కార్యక్రమాల్లో పాలుపంచుకోవాలని, ఆర్థికంగా వెనుకబడిన వైశ్యజాతి బిడ్డల చదువులకు, వారి అభ్యున్నతికి సంపూర్ణ సహకారం అందించాలని కోరారు. అంతేకాకుండా ఆర్యవైశ్యులకు రాజకీయంగా ప్రాధాన్యత దక్కేలా ప్రజా ప్రతినిధులుగా ఎన్నికైన వారు కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో అంతర్జాతీయ వైశ్య ఫెడరేషన్ నాయకులు సురేందర్ గుప్తా, రాజీవ్ మిట్టల్, కక్కిరాల రమేష్, సదరన్ ట్రావెల్స్ ఎండీ కృష్ణ మోహన్, 28 రాష్ట్రాల ఐవీఎఫ్ అధ్యక్షులు, ఐవీఎఫ్ ఫౌండర్ మెంబర్స్, వివిధ రాష్ట్రాల నుంచి ప్రజాప్రతినిధులుగా ఎన్నికైన వారు పాల్గొన్నారు.
Comments
Post a Comment