స్మితా సబర్వాల్ పై ఆగ్రహం వ్యక్తం చేసిన మాజీ ఎమ్మెల్యే కంచర్ల
స్మితా సబర్వాల్ పై నల్లగొండ మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు*
*మీడియాతో ఆయన మాట్లాడుతూ.. రాజ్యాంగాన్ని కాపాడాల్సిన ఓ అధికారిగా ఉండి.. రాజ్యాంగ వ్యతిరేకంగా మాట్లాడడం సిగ్గుచేటని ఆయన మండిపడ్డారు*
*స్మితా సబర్వాల్ ఓ దివ్యాంగులకి జన్మనిచ్చి ఉంటే వారి కష్టాలు ఏంటో ఆమెకు తెలిసేవని ఆయన ఆవేదన వ్యక్తంచేశారు*
*దివ్యాంగులను అవహేళన చేసి.. వారి మనో ధైర్యాన్ని దెబ్బతినేలా కుట్ర చేస్తున్న స్మితా సబర్వాల్ .. మెంటల్ గా అన్ ఫిట్ అని.. IAS గా పనికి రాదని.. వెంటనే ఆమెపై శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ని ఆయన కోరారు*
*ఎన్నో ఆటుపోట్లను కష్టనష్టాలను ఎదుర్కొని బాలలత లాంటి ఓ దివ్యాంగ మహిళ IAS కాగలిగారని.. తనతో పాటే ఎంతోమందిని IASలుగా తయారు చేసేందుకు IAS అకాడమీ ద్వారా ఎంతోకృషి చేస్తున్నారని ఆయన కొనియాడారు.*
*బాలలత గారి లాంటి వారిని ఆదర్శంగా తీసుకోవాల్సింది పోయి దివ్యాంగులనే హేళన చేయడం సరి కాదన్నారు.*
*ప్రపంచమే గర్వించదగ్గ ఎంతోమంది దివ్యాంగులు ఉన్నారని, అటువంటి వారిని అవమానించడం సరికాదని ఆయన హితువు పలికారు.*
Comments
Post a Comment