ఘనంగా జడ కొప్పు కోలాట ప్రదర్శన ముగింపు కార్యక్రమం


 *ఘనంగా జడ కొప్పు కోలాట ప్రదర్శన ముగింపు కార్యక్రమం*

నల్లగొండ పట్టణం వీటి కాలనీ కాకతీయ కాలేజ్ గ్రౌండ్ ఘనంగా జడ కొప్పు కోలాటం ప్రదర్శన*నిర్వహించడం జరిగింది. గత 40 రోజుల నుండి 50 మంది మహిళలు మాస్టర్ తోగొటీ రమేష్ చారి ఆధ్వర్యంలో ఉచిత శిక్షణ పూర్తి అయిన తర్వాత, ఆదివారం సాయంత్రం ఘనంగా జడ కొప్పు కోలాట ప్రదర్శన ముగింపు కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. స్థానిక మున్సిపల్ చైర్మన్ బుర్రి శ్రీనివాస్ రెడ్డి సహకారంతో మహిళలకు చీరలు అందజేయడం జరిగింది, ఈ కార్యక్రమంలో 33 వ వార్డు కౌన్సిలర్ బుర్రి చైతన్య మాట్లాడుతూ మహిళలు కోలాటం నేర్చుకోవడం వలన శారీరకంగా మానసికంగా మరియు ఆధ్యాత్మికంగా ఎంతో ఉపయోగపడుతుందని వారు తెలియజేశారు, ఈ శిక్షణ పూర్తిగా ఉచితంగా నేర్పించిన రమేష్ మాస్టర్ కి కృతజ్ఞతలు తెలియజేశారు, ఇటువంటి శిక్షణా తరగతులు మరిన్ని నిర్వహించాలని వారు కోరారు. స్థానిక నాయకులు రేగట్టే లింగస్వామి సహకారంతో కోలాటం బృందం సభ్యుల సహకారంతో కార్యక్రమం విజయవంతం చేసుకోకలిగామని తోగోటి రమేష్ చారి అన్నారు. ఈనెల 15వ తేదీ నుండి కాకతీయ కాలేజ్ మైదానంలో మరొక ఉచిత శిక్షణ శిబిరాన్ని ఏర్పాటు చేసినట్టు తెలియజేశారు ఈ అవకాశాన్ని పట్టణంలోని మహిళలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. కార్యక్రమంలో ముఖ్య వక్తగా ఆధ్యాత్మికవేత్త వేదాంతం రామకృష్ణ మాట్లాడుతూ ఆనాడు ద్వారకలో శ్రీకృష్ణుని సమక్షంలో గోపికలు ఆడినటువంటి కోలాటం నృత్యాన్ని ఈనాడు మీరు నేర్చుకోవడం చాలా గొప్ప విషయం అని ఈ శిక్షణను ఆధ్యాత్మికమైనటువంటి కార్యక్రమాలలో ఉపయోగించాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో ఊట్కూరి యాదగిరిరెడ్డి, అనిల్ రెడ్డి, బండారు ప్రసాద్, మాధగోని శ్రీనివాస్ గౌడ్, రావిరాల వెంకట్ రేవతి కార్యక్రమాన్ని వీక్షించేందుకు కాలనీవాసులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

Comments

Popular posts from this blog

250 కోట్ల స్కాం లో రైస్ మిల్లు ఓనర్ ఇమ్మడి సోమనర్సయ్య అరెస్ట్: డి ఎస్పీ. గతంలో గూఢచారి ఈ కుంభకోణం పై వార్త కథనం

తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ ఎన్నికలకు అంగీకరించిన అమరవాది - మిడిదొడ్డి శ్యామ్ సుందర్

తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ అధ్యక్ష పదవి కొత్తవారికి అవకాశం కల్పించాలి - మిడిదొడ్డి శ్యామ్