విధుల్లో నిర్లక్ష్యం వహించిన పోలీస్ అధికారులపై వేటు వేసిన మల్టీ జోన్ -11 ఐజిపి శ్రీ వి .సత్యనారాయణ

 


తేది: 21-08-2024.

విధుల్లో నిర్లక్ష్యం వహించిన పోలీస్ అధికారులపై వేటు వేసిన మల్టీ జోన్ -11 ఐజిపి వి .సత్యనారాయణ


ఇటీవల జోగులాంబ గద్వాల జిల్లా మరియు ఆలంపూర్ సమీపంలోని ఉండవల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో, కర్నూలు జిల్లాకు చెందిన కొంత మంది పేకాట రాయుళ్లు భారీ స్థాయిలో పేకాట ఆడుతుండగా, జిల్లా పోలీస్ బృందం దాడి చేసి వారిని పట్టుకుంది. ఆ పేకాట దాడిలో వచ్చిన ఆరోపణల మేరకు, ఎస్పీ జోగులాంబ గద్వాల్  శ్రీనివాస్ రావు మరియు ఇతర అధికారులతో ఎంక్వయిరీ చేయించిన తర్వాత, ముగ్గురు పోలీస్ అధికారులపై చర్యలకు ఇన్స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ మల్టీజోన్ -11 శ్రీ వి. సత్యనారాయణ ఉపక్రమించారు. వీరిలో జోగులాంబ గద్వాల్ జిల్లా స్పెషల్ బ్రాంచ్ సిఐ జములప్ప, మహబూబ్‌నగర్ జిల్లా నవాబుపేట ఎస్సై విక్రం పేకాట రాయుళ్లతో పరోక్ష సంబంధాలు ఉన్నట్లు, అలాగే ఉండవల్లి ఎస్సై శ్రీనివాసులు తన పోలీస్ స్టేషన్ పరిధిలో అంత పెద్ద ఎత్తున పేకాట జరుగుతున్నప్పటికీ, దానిపై జిల్లా పోలీస్ పార్టీ దాడి చేసేవరకు పూర్తిగా నిర్లక్ష్యంగా వ్యవహరించారని తేలింది. అందువల్ల, ఈ ముగ్గురు అధికారులను తక్షణమే విధుల నుండి తొలగించి వి ఆర్ లో పెట్టడం జరిగింది, వారిపై కఠినమైన శాఖాపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. అదేవిధంగా, ఇటీవల టూరిజం శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు గద్వాల మరియు గట్టు ప్రాంతాల సందర్శన సమయంలో, ఇరువర్గాల మధ్య జరిగిన ఘర్షణను సమర్థవంతంగా నిలువరించనందుకు గద్వాల్ సిఐ భీమ్ కుమార్ ను మల్టీజోన్- 11 వి ఆర్ కు అటాచ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రాధాన్యాలైన శాంతి భద్రతల విషయంలో ఏ పోలీస్ అధికారైనా ఉదాసీనత లేదా నిర్లక్ష్యం ప్రదర్శిస్తే, వేటు తప్పదని ఇన్స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్  వి.సత్యనారాయణ స్పష్టం చేశారు. అదేవిధంగా, పేకాట, పిడిఎస్ రైస్ అక్రమ రవాణా, మాదకద్రవ్యాల రవాణా విషయంలో ఏ పోలీస్ అధికారి యొక్క

ప్రత్యక్ష లేదా పరోక్ష ప్రమేయం ఉన్నటు తేలిన వారిపై వేటు తప్పదని ఐ జి పి హెచ్చరించారు.

Comments

Popular posts from this blog

250 కోట్ల స్కాం లో రైస్ మిల్లు ఓనర్ ఇమ్మడి సోమనర్సయ్య అరెస్ట్: డి ఎస్పీ. గతంలో గూఢచారి ఈ కుంభకోణం పై వార్త కథనం

తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ ఎన్నికలకు అంగీకరించిన అమరవాది - మిడిదొడ్డి శ్యామ్ సుందర్

తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ అధ్యక్ష పదవి కొత్తవారికి అవకాశం కల్పించాలి - మిడిదొడ్డి శ్యామ్