వామ్ గ్లోబల్ కన్వెన్షన్ 2024 కు ముఖ్యఅతిథిగా ఆంధ్రప్రదేశ్ పారిశ్రామిక శాఖ మంత్రి టి. జి. భరత్


 

వామ్ గ్లోబల్ కన్వెన్షన్ 2024 కు ముఖ్యఅతిథిగా ఆంధ్రప్రదేశ్ పారిశ్రామిక శాఖ మంత్రి టి. జి. భరత్


 హైద్రాబాద్: (గూఢచారి ప్రతినిధి) : ప్రపంచ ఆర్యవైశ్య మహాసభ ఎంతో ప్రతిష్టాత్మకంగా ఆబుదాబిలో నిర్వహిస్తున్న గ్లోబల్ కన్వెన్షన్ 2024 సెప్టెంబర్ 15 కొరకు ఎన్నో ఏర్పాట్లు చేయబడుచున్నవని, వ్యామ్ దుబాయ్ నాయకులు, అబుదాబి నాయకులు రేయింబవళ్లు కష్టపడి ఎన్నో రకాలుగా విచ్చేసిన అతిథులకు ఇబ్బందులు కలగకుండా వసతి గాని భోజనాలు కానీ ఏర్పాట్ల విషయంలో రాజీ పడకుండా ప్రయత్నిస్తున్నారనిజాని, ఇట్టి సమావేశానికి ఆంధ్రప్రదేశ్ పారిశ్రామిక శాఖ మాత్యులు టి జి భరత్ ముఖ్యఅతిథిగా విచ్చేయడానికి అంగీకరించారని ప్రముఖ పారిశ్రామికవేత్త ప్రపంచ ఆర్యవైశ్య మహాసభ గ్లోబల్ ఛైర్మన్ శ్రీ టీజీ వెంకటేష్ కూడా విచ్చేయుచున్నారని మీడియా కమిటీ చైర్మన్ కౌటికె విఠల్ ఒక ప్రకటనలో తెలిపారు. ఎంతోమంది ప్రముఖ వైశ్యుల ప్రసంగాలు మరియు వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు ఎన్నో రకాల తీర్మానాల కొరకు ప్రతిరోజు కూడాను ప్రయత్నాలు జరుగుచున్నవని, కార్యక్రమ నిర్వహణ, సాంస్కృతిక కార్యక్రమాల నిర్వహణ ఎంతో పగడ్బందీగా నిర్వహించడానికి భారతదేశంలోనే ప్రముఖ ఈవెంట్ ప్లానర్ శ్రేయస్ మీడియాను కోరగా వారు అంగీకరించి నిర్వహించడానికి ముందుకు వచ్చి ఎన్నో రకాలుగా వారి క్రియేటివిటీని చూపిస్తున్నారని పేర్కొన్నారు.

 ఐదు వేలు రూపాయలు కట్టి రిజిస్ట్రేషన్ చేసుకున్న వారు ఎవరైనా సరే వెంటనే ప్రపంచార్యవైశ్య మహాసభ నాయకులను గాని అంగీకారం పొందిన ఆదికృత ట్రావెల్ ఏజెంట్లతో గానీ సంప్రదించి మీ ప్రయాణాన్ని సిద్ధం చేసుకోగవచ్చని, ప్రొద్దున 9 గంటలకు ప్రారంభమై సమావేశము రాత్రి 9 గంటల వరకు యదేచ్చగా నిర్వహింపబడుతున్న ఈ కార్యక్రమంలో ఎటువంటి పొరపాట్లు జరుగకుండా అందరూ కూడాను శాయ శక్తుల ప్రయత్నాలు చేస్తున్నారని, హాజరైన ప్రతి ఒక్కరు కూడా ఎంతో సంతోషపడాలని, ఎన్నో జ్ఞాపకాలను తీసుకుని వెళ్లాలని మా ప్రపంచ ఆర్యవైశ్య మహాసభ అధ్యక్షులు టంగుటూరి రామకృష్ణ ఎందరివో సలహాలు తీసుకుంటూ ముందుకు వెళ్తున్నారని తెలిపారు. ప్రపంచ ఆర్యవైశ్య మహాసభ గ్లోబల్ నాయకులు, జాతీయ నాయకులు, వివిధ రాష్ట్రాల నాయకులు, వివిధ జిల్లాల నాయకులు అందరూ కూడాను ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారని, ఏమాత్రం అవకాశం ఉన్న ప్రతి ఒక్కరూ పాల్గొనవలసిందిగా నేను మరొకసారి మీడియా కమిటీ చైర్మన్గా మీ అందరిని ప్రార్థిస్తున్నాని,. మన వైశ్యులందరినీ ఒకచోట కలుసుకునే అవకాశాన్ని ఉపయోగించుకొనగలరని విజ్ఞప్తి చేశారు.

Comments

Popular posts from this blog

250 కోట్ల స్కాం లో రైస్ మిల్లు ఓనర్ ఇమ్మడి సోమనర్సయ్య అరెస్ట్: డి ఎస్పీ. గతంలో గూఢచారి ఈ కుంభకోణం పై వార్త కథనం

తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ ఎన్నికలకు అంగీకరించిన అమరవాది - మిడిదొడ్డి శ్యామ్ సుందర్

తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ అధ్యక్ష పదవి కొత్తవారికి అవకాశం కల్పించాలి - మిడిదొడ్డి శ్యామ్