ఎన్నికల ప్రక్రియ ప్రారంభం - కాశి సత్రం ఎన్నికల అధికారి
ఎన్నికల ప్రక్రియ ప్రారంభం - కాశి సత్రం ఎన్నికల అధికారి
హైద్రాబాద్: గూఢచారి, 16-8-2024,
కాశి అన్నపూర్ణ వాసవి ఆర్య వైశ్య వృద్దాశ్రమం మరియు నిత్యన్న సత్రం ఎన్నికల ప్రక్రియ ప్రారంభం అయ్యిందని ఎన్నికల అధికారి తెలిపారు. ఈ రోజు నామినేషన్లు తీసుకోవడం ప్రారంభమైందని రేపు సాయంత్రం 5 వరకు నామినేషన్లు స్వీకరిస్తామని ఆమె తెలిపారు. ఆగస్టు 18వ తేదీ స్క్రూట్ని నిర్వహిస్తామని, ఆగస్టు 19 న ఉపసంహరణకు అవకాశం ఉందిని తెలిపారు. అయితే ఎన్నికల నోటిఫికేషన్ లో నామినేషన్ పత్రాలు 10 తేది రోజున 10.30 నుండి ఇస్తామని తెలిపారు. కాని 10 తేది రోజున 10. 30 నుండి నామినేషన్ పత్రాలు ఇవ్వడం ప్రారంభం అని పేర్కొనలేదు. ఈ నామినేషన్ పత్రాల ఇవ్వడం తేదీల్లో నోటిఫికేషన్ లో కొంత గందరగోళం ఉందని పలువురు అనుకుంటున్నారు. ఈ విషయం పై ఎన్నికల అధికారి మాట్లాడుతూ 17వ తేది సాయంత్రం 5వరకు నామినేషన్ పత్రాలు జారీ చేస్తామని తెలిపారు.
నామినేషన్ పత్రాలు ఇవ్వడం 10 తేది నుండి ప్రారంభం అయిన 10 తేది నుండి ఈ రోజు వరకు ఎన్నికల అధికారి హైద్రాబాద్ ఆఫీసు లో ప్రతి రోజు నామినేషన్ పత్రాలు జారీ చేయాలి. మరి ఆఫీసు కు వచ్చి జారీ చేశారా? అనేది ప్రశ్న గా మిగిలింది. ఈ విషయం పై మా ప్రతినిధి ఎన్నికల అధికారిని ఈ రోజు సాయంత్రం వాట్సాప్ మెసేజ్ ద్వారా సంప్రదించగా ఎన్నికల అధికారి నుండి రెస్పాన్స్ రాలేదు.
Comments
Post a Comment