వరంగల్ జిల్లా కేంద్రంలో రోడ్డుపై తుపాకీ కలకలం
*వరంగల్ జిల్లా కేంద్రంలో రోడ్డుపై తుపాకీ కలకలం*
వరంగల్ జిల్లా కేంద్రంలోని ఎంజీఎం జంక్షన్ లో గన్ ను పారేసుకున్నాడు ఓ CRPF కానిస్టేబుల్. ఈ సంఘటన శుక్ర వారం ఉదయం వెలుగులోకి వచ్చింది.
వరంగల్ ఎంజీఎం జంక్షన్ యూనివర్సిటీ పరిధిలో ఉన్న బెటాలియన్ ను తరలించే క్రమంలో రోడ్డు పైన గన్ పడిపోయినట్టు తెలుస్తుంది..ఆ గన్ ను గుర్తించిన వరంగల్ మహానగరపాలక సంస్థ పారిశుద్ధ కార్మికుడు.. వెంటనే అధికారులకు సమాచారం అందించారు.
ఆ తుపాకీని వరంగల్ మహానగర పాలక సంస్థ కమిషనర్ కు అందించాడు వరంగల్ మహా నగరపాలక సంస్థ పారిశుద్ధ కార్మికుడు. ఇక తుపాకీ సమాచారాన్ని పోలీసులకు చేరవేశారు
వరంగల్ మహా నగర పాలక సంస్థ కమిషనర్ అశ్విని తానాజీ వాకడే. ఇక దీనిపై పోలీసులు విచారణ చేస్తున్నారు. ఈ సంఘటన పై ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది...
Comments
Post a Comment