సత్రం ఎన్నికలు ప్రజాస్వామ్యమా? షరా మామూలేనా?
సత్రం ఎన్నికలు ప్రజాస్వామ్యమా? షరా మామూలేనా?
హైద్రాబాద్:
సత్రం ఎన్నికల ప్రజాస్వామ్య బద్దంగా జరుగుతున్నాయని, దాదాపు 10 పత్రికలలో ఎన్నికల నోటిఫికేషన్ పబ్లిష్ అయింది. ప్రజాస్వామ్య బద్ధంగా జరుగుతాయని భావించి గూఢచారి లో కూడా అడ హాక్ కమిటీ కోఆర్డినేటర్ పంపిన ప్రెస్స్ నోట్ ను పబ్లిష్ చేశాం. కాని షరా మామూలే? గా ముగిస్తున్నట్లు తెలియ వచ్చింది. నామినేషన్ పత్రాలు ఇవ్వడం దగ్గర నుండి విత్ డ్రా వరకు అన్ని ట్లో షరా మామూలే? ఈ నెల 10వ తేదిన నామినేషన్ పత్రాలు ఇష్యూ చేస్తామని ఎన్నికల అధికారి ఎలెక్షన్ నోటిఫికేషన్ లో పేర్కొన్నారు. 10వ తేదిన నామినేషన్ పత్రాలు 41 మంది దాదాపు 135 నామినేషన్ పత్రాలు ఇష్యూ చేసినట్లు అడ హాక్ కమిటీ కోఆర్డినేటర్ ఇచ్చిన వివరాల ప్రకారం గూఢచారి లో న్యూస్ పబ్లిష్ చేసాము. ఆ తర్వాత నే అంత షరా మామూలే? గా జరిగినట్లు సమాచారం. 16వ తేదిన కూడా నామినేషన్ పాత్రలు ఇస్తున్నారని తెలిసి ఎన్నికల అధికారిని మరియు అడ హాక్ కమిటీ కోఆర్డినేటర్ ను ఫోన్ ద్వారా వివరణ కొరాము అందుకు 17వ తేది సాయంత్రం 5 వరకు ఇస్తామని వివరణ ఇచ్చారు. అదికూడా పబ్లిష్ చేసాము. అసలు ఏం జరుగుతుంది అనే విషయం తెలుసుకోడానికి స్వయంగా సత్రం ఆఫీసుకు మా ప్రతినిధి వెళ్ళాడు. ఎన్నికల అధికారి మాట మార్చి లేదు మేము 10తేదిన మాత్రమే నామినేషన్ పత్రాలు ఇష్యూ చేశామని, ఈ రోజు ఇవ్వడం లేదని మా ప్రతినిధికి వివరణ ఇచ్చారు. నామినేషన్ పత్రాలు ఎన్నికల అధికారి, ఎన్నికల సిబ్బంది మాత్రమే స్వయంగా ఇవ్వాలి. అలా జరగలేదు అక్కడ మా ప్రతినిధి సమక్షం లో నే అడ హాక్ కమిటీ సభ్యులు సత్రం ఆఫీసు నుండి వారికి నచ్చిన వారికి నామినేషన్ పత్రాలు ఇచ్చుకున్నారు. అంత గందరగోళంగా ఎన్నికల వ్యవహారం జరిగినట్లు అనిపించింది. గత కొన్నిరోజుల క్రితం సత్రం ఆఫీసు నుండి ఓ పెద్ద మనిషి మనిషి మనుషులు రికార్డుల బీరువాను బలవంతంగా తీసుకెళ్లినట్లు వార్తలు వచ్చాయి. అది కూడా మేము పబ్లిష్ చేశాం. ఆ పెద్ద మనిషి స్వయంగా రంగం లోకి దిగి నామినేషన్ వేసిన కొంత మంది అభ్యర్థులపై ఒత్తిడి తెచ్చి అయన ఆఫీసులో విత్ డ్రా లు తీసుకున్నట్లు గుసగుసలు వినపడుతున్నాయి. ఆ విత్ డ్రా ఫారాలు నిబంధనలకు విరుద్ధంగా ఆ పెద్ద మనిషి 17 రాత్రి దాదాపు 7 గంటల ప్రాంతంలో లో సత్రం ఆఫీసు లో ఎన్నిక అధికారికి ఇచ్చినట్లు తెలియవచ్చింది. ఇలా కొంత మంది పై ఒత్తిడి తెచ్చి విత్ డ్రా ఫారాలు తీసుకొని ఆఫీసు టైం అయిపోయాక ఎన్నికల అధికారికి ఫారాలు ఇవ్వడం ప్రజాస్వామ్యమా అనేది చిక్కు ప్రశ్న. అంతే కాకుండా వచ్చిన నామినేషన్లు వివరాలు ఇవ్వమని 17వ తేదిన ఎన్నికల అధికారిని మరియు కోఆర్డినేటర్ ను పలు సార్లు అడగ్గా మీకు వాట్సాప్ లో పంపిస్తామని తెలిపారు. ఎన్నికల అధికారి ఎలిజిబులిటీ లేని వారి నామినేషన్లు తీసుకున్నారని, వారే ఎన్నిక అయ్యారని పలువురు అభినందనలు సోషల్ మీడియాలో వెల్లువెత్తున్నాయి. లోపాయికారి ఒప్పందాలు జరిగాయని ఎన్నికలు షరా మామూలే? గా జరుగుతున్నాయని స్పష్టం అవుతుంది. గతం లో ఈ సత్రం అధ్యక్షుడు అవకతవకలకు పాల్పడ్డారన్న ఆరోపణలు రావడంతో ఆయన్ని తొలగించారు. ఇప్పుడు అయన మీద ఆరోపణలు చేసిన వారు అడ హాక్ కమిటీలో ఉన్నారు వారిపైన కూడా ఆరోపణలు వచ్చాయి. వారు ఒక వేళ అక్రమంగా పదవులు పొందిన కూడా వారు వైదొలగక తప్పదని పలువురు జోస్యం చెపుతున్నారు.
ఎన్నికల అధికారి కో ఆర్డినేటర్ తో ఒప్పందాలు చేసుకొని అర్హత లేని వారి నామినేషన్లు తీసుకున్నందుకు మరియు వివరాలు బహిరంగ ప్రకటించకుండా విధుల్లో విఫలం చెందినందిన ఈ రిజిస్టర్ ఆఫీసు వారణాశి ఉత్తర్ ప్రదేశ్ లో ఉన్నందున ఈ అక్రమాల పై ఆ రాష్ట్ర ముఖ్య మంత్రి యోగి అధిత్యనాథ్ కు ఈ ఎన్నికల పై విచారణ జరపాలని, ఎన్నికల అధికారి పై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు చేయనున్నట్లు కొందరు వైశ్యులు తెలిపారు
ఎన్ని నామినేషన్లు వచ్చాయి, ఎన్ని స్క్రూటినీ లో పోయాయి, చివరకు ఎంతమంది పోటీలో ఉన్నారో కూడా పలు మార్లు ఎన్నికల అధికారిని అడిగిన తెలుపలేదు. ఎన్నికలు ప్రకటించి నప్పటి నుండి అన్ని వార్తలు ప్రచురించాము కానీ నామినేషన్ వివరాలు అధికారులు ఇవ్వనందున ఈ క్రింద బ్లాంక్ పేజీని బ్లాక్ కలర్ లో పబ్లిష్ చేస్తున్నాము.
త్వరలో
అడ హాక్ కమిటీ పీరియడ్ లో జరిగిన అవకతవకలపై భాధ్యత ఎవరు తీసుకుంటారు? వివరాలు త్వరలో
Comments
Post a Comment