ఆర్య వైశ్యులను ఒక వేదికపైకి తీసుకువచ్చేందుకే అబుదాబిలో గ్లోబల్ కన్వెన్షన్ - కౌటికె విఠల్ మీడియా కమిటీ చైర్మన్


 ఆర్య వైశ్యులను ఒక వేదికపైకి తీసుకువచ్చేందుకే అబుదాబిలో గ్లోబల్ కన్వెన్షన్ - కౌటికె విఠల్ మీడియా కమిటీ చైర్మన్

హైద్రాబాద్ (గూఢచారి) 19-8-2024

ప్రపంచ ఆర్య వైశ్య మహా సభ తరఫున ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఆర్య వైశ్యులను ఒక వేదికపైకి తీసుకువచ్చి, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ రాజధాని అయిన అబుదాబిలో తేదీ 15 సెప్టెంబరు 2024 రోజు భారీ ఎత్తున గ్లోబల్ కన్వెన్షన్ నిర్వహిస్తున్నట్లు మీడియా కమిటీ చైర్మన్ కౌటికె విఠల్ ఒక ప్రకటనలో తెలిపారు. ఉదయం నుండి సాయంత్రం వరకు నిర్వహించే ఈ కార్యక్రమం ఎంతో ఆహ్లాదకరంగా ఉండాలని కార్యకర్తలు ఏర్పాట్లు చేస్తున్నారని తెలిపారు ప్రపంచ ఆర్య వైశ్య మహా సభకు 20 రాష్ట్రాలలో విభాగాలు ఉన్నాయి. కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు విస్తరించాయని, అలాగే ప్రపంచవ్యాప్తంగా 55 దేశాలలో కూడా విభాగాలు ఉన్నాయని పేర్కొన్నారు. ఈ సమావేశం అబుదాబి నేషనల్ Theater లో జరుగనుందని, ఈ కార్యక్రమానికి మినిస్టర్లు, సినీ కళాకారులు, మరియు ప్రముఖ రాజకీయ నాయకులు హాజరుకానున్నారని, వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు, నాటకాలు, పాటలు కూడా వినోదాన్ని కలిగించేలా ఏర్పాటు చేయబడ్డాయని తెలిపారు.

సెప్టెంబర్ 12, 13, 14 తేదీలలో టూర్స్ ప్రారంభమవుతాయని, 5-6 రోజుల టూర్స్ ప్రోగ్రామ్స్, సైట్ సీయింగ్ ఉంటాయని, WAM మెంబర్షిప్ కలిగిన వారు రావచ్చుని, లేకపోతే అక్కడ సభ్యత్వం తీసుకోవచ్చని, మహిళలందరికీ డ్రెస్ కోడ్ ఒకే విధంగా ఉండే సారీలు అందుబాటులో ఉన్నాయని తెలిపారు 

ఈ కార్యక్రమం క్రమంగా అభివృద్ధి చెందుతూ, వాణిజ్య సమితి సమావేశం నిర్వహించేందుకు ప్రణాళిక ఉందని, అర్హులైన బిజినెస్ వ్యక్తులు మాత్రమే ఇందులో పాల్గొంటారని అన్నారు. ఇంగ్లీష్, తెలుగు, హిందీ భాషల్లో యాంకర్లు ఉంటారని, Sightseeing రెండు రోజులు అబుదాబిలో, రెండు రోజులు దుబాయ్లో, మరియు ఒకరోజు షాపింగ్ ఉంటుందని తెలిపారు.

ఇప్పటికే 5000 రూపాయలు కట్టి రిజిస్ట్రేషన్ చేసుకున్న వారు, డైరెక్ట్ గా రాదలిచినవారు కూడాను వెంటనే టికెట్లు తీసుకోగలరునీ కోరారు. రిజిస్ట్రేషన్ చేసుకున్న వారందరికీ చేతి మణికట్టుపై ఒక బెల్టు TAG వేయబడుతుంది. ఆ బెల్టు TAG ఉన్నవారు మాత్రమే సమావేశపు హాలు లోపలికి రావడానికి అర్హత కలిగి ఉంటారని. వారికి మాత్రమే భోజన వసతి కల్పించబడుతుందని. వీసా పొందడం కొరకు సమయం అవసరముంటుంది కాబట్టి రావాల్సిన వారు వెంటనే అప్లై చేసుకోగలరని కోరారు. ఇతర వివరముల కొరకు ప్రపంచ ఆర్యవైశ్య మహాసభ నాయకులను గాని, అధికృత ట్రావెల్ ఏజెంట్లను గాని సంప్రదించవచ్చని తెలిపారు.


Comments

Popular posts from this blog

250 కోట్ల స్కాం లో రైస్ మిల్లు ఓనర్ ఇమ్మడి సోమనర్సయ్య అరెస్ట్: డి ఎస్పీ. గతంలో గూఢచారి ఈ కుంభకోణం పై వార్త కథనం

తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ ఎన్నికలకు అంగీకరించిన అమరవాది - మిడిదొడ్డి శ్యామ్ సుందర్

తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ అధ్యక్ష పదవి కొత్తవారికి అవకాశం కల్పించాలి - మిడిదొడ్డి శ్యామ్