ఏసీబీకి చిక్కిన విద్యుత్ శాఖ డీఈ


 ఏసీబీకి చిక్కిన విద్యుత్ శాఖ డీఈ

హైదరాబాద్, (గూఢచారి): హైదరా బాద్ వనస్థలి పురంలోని సరూర్ నగర్ విద్యుత్ శాఖ డీఈ రామ్మోహన్ రూ.18 వేలు లంచం తీసుకుంటూ ఏసీబీ అధికా రులకు రెడ్ హ్యాండెడ్గా పట్టుబడ్డాడు. ఆటోనగర్లోని డీఈ కార్యాల యంలో గురు వారం విద్యుత్ శాఖ డీఈ (టెక్నికల్) రామ్మోహన్ లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కాడు. రంగారెడ్డి జిల్లా ఆగపల్లి గ్రామంలో ఓ వెంచర్లో విద్యుత్ స్తంభా లను షిఫ్టింగ్, 63 కేవీ ట్రాన్స్ఫార్మర్ ఏర్పాటు, కేవీ లైన్స్ నుంచి 11కేవీ లైన్స్ మార్చడానికి వెంచర్ యజమాని డీఈ రామ్మోహనన్ను సంప్ర దించాడు. ఇదివరకే సదరు వెంచర్ యజమాని ఆన్లైన్లో దరఖాస్తు చేసు కున్నాడు. అయితే అది అప్రూవల్ చేసి పని ప్రారంభించడానికి రూ.50 వేలు ఇవ్వాలని డీఈ రామ్మోహన్ డిమాండ్ చేశాడు. కాగా రూ. 50వేలు ఇవ్వలేనని, రూ. 18వేలు ఇస్తానని వెంచర్

యజమాని తేల్చిచెప్పడంతో అందుకు డీఈ అంగీ కరించాడు. లంచం మొత్తాలు ఇస్తే పని ప్రారంభిస్తానని చెప్పడంతో వెంచర్ యజమాని(బాధితుడు) నేరుగా ఏసీబీ అధికారులను సంప్రదించి ఫిర్యాదు చేశాడు. దీంతో సదరన్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ ఆఫ్ తెలంగాణ పరిధిలోని ఆపరేషన్స్ విభాగం కింద ఉన్న సూపరింటెండెంట్ ఇంజినీర్ కార్యాలయానికి గురువారం ఏసీబీ అధికారులు మాటు వేశారు.

ఈ నేపథ్యంలో వెంచర్ యజమాని నుంచి టెక్నికల్ డివిజన్ ఇంజినీర్ రామ్మోహన్ రూ. 18వేలు లంచం తీసుకుం టుండగా ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. అనంతరం నిందితుని చేతి వేళ్లకు కెమికల్ పరీక్షలు నిర్వహించి అరెస్ట్ చేశారు. నిందితుడు రామ్మోహనన్ను ఏసీబీ కోర్టులో హాజరుపర్చగా 14 రోజుల పాటు రిమాండ్ విధించారు.

Comments

Popular posts from this blog

250 కోట్ల స్కాం లో రైస్ మిల్లు ఓనర్ ఇమ్మడి సోమనర్సయ్య అరెస్ట్: డి ఎస్పీ. గతంలో గూఢచారి ఈ కుంభకోణం పై వార్త కథనం

తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ ఎన్నికలకు అంగీకరించిన అమరవాది - మిడిదొడ్డి శ్యామ్ సుందర్

తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ అధ్యక్ష పదవి కొత్తవారికి అవకాశం కల్పించాలి - మిడిదొడ్డి శ్యామ్