నేటి నుంచి విశ్వహిందూ పరిషత్ షష్టిపూర్తి వేడుకలు


 నేటి నుంచి విశ్వహిందూ పరిషత్ షష్టిపూర్తి వేడుకలు


విశ్వహిందూ పరిషత్ స్థాపించి 60 సంవత్సరాలు పూర్తయ్యాయని.. ఈ సందర్భంగా షష్టిపూర్తి ఉత్సవాలు నిర్వహిస్తున్నట్లు ఆ సంస్థ రాష్ట్ర అధ్యక్షులు శ్రీ నరసింహమూర్తి, కార్యదర్శి శ్రీ లక్ష్మీనారాయణ తెలియజేశారు. 1964 సంవత్సరం శ్రీకృష్ణ జన్మాష్టమి రోజున ముంబాయి సమీపంలోని సాందీపని ఆశ్రమంలో విశ్వహిందూ పరిషత్ ను స్థాపించారని పేర్కొన్నారు. RSS సెకండ్ చీఫ్ శ్రీ గురూజీ స్థాపించిన తమ సంఘం ప్రపంచవ్యాప్తంగా విస్తరించిందని, చరిత్రలో నిలిచిపోయే అయోధ్య వంటి భారీ ఉద్యమాలు చేపట్టి, విజయం సాధించిందని ఆనందం వ్యక్తం చేశారు. 1964 నుంచి 2024 వరకు ఆరు దశాబ్దాల కాలంలో తమ సంస్థ హిందూ సమాజ హితం కోసం పనిచేస్తూ వస్తోందని వివరించారు. ఈ మేరకు విశ్వహిందూ పరిషత్ నేతలు నరసింహ మూర్తి, లక్ష్మీనారాయణ ప్రకటన విడుదల చేశారు. 2024 శ్రీకృష్ణ పురస్కరించుకొని ఈనెల 24 నుంచి సెప్టెంబర్ 1వ తారీకు వరకు వారం రోజులపాటు విశ్వహిందూ పరిషత్ షష్టిపూర్తి ఉత్సవాలు నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. 


ప్రపంచవ్యాప్తంగా నిర్వహిస్తున్న ఈ వేడుకలలో భాగంగా.. తెలంగాణ రాష్ట్రంలోని ప్రతి మండల, ఆపై స్థాయి కేంద్రాలలో ఆత్మీయ సమ్మేళనాలు నిర్వహిస్తున్నట్లు తెలియజేశారు. శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా ఆయా కేంద్రాలలో భారీ కార్యక్రమాలు రూపకల్పన చేసి, వారం పాటు హిందూ బంధువులందరినీ సంఘటితం చేసేందుకు సమ్మేళనాలు నిర్వహిస్తామన్నారు. ఈ సందర్భంగా హిందూ బంధువులందరూ రాజకీయాలకు అతీతంగా విశ్వహిందూ పరిషత్ షష్టిపూర్తి ఆత్మీయ సమ్మేళనాల్లో పాల్గొనాలని వారు విజ్ఞప్తి చేశారు.



Comments

Popular posts from this blog

250 కోట్ల స్కాం లో రైస్ మిల్లు ఓనర్ ఇమ్మడి సోమనర్సయ్య అరెస్ట్: డి ఎస్పీ. గతంలో గూఢచారి ఈ కుంభకోణం పై వార్త కథనం

తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ ఎన్నికలకు అంగీకరించిన అమరవాది - మిడిదొడ్డి శ్యామ్ సుందర్

తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ అధ్యక్ష పదవి కొత్తవారికి అవకాశం కల్పించాలి - మిడిదొడ్డి శ్యామ్