ఫోటో గ్రాఫర్ల సమస్యలు పరిష్కరించేందుకు హామీ ఇచ్చిన మంత్రి పొంగులేటి


 

ఫోటో గ్రాఫర్లు విధి నిర్వహాణలో అనేక ఇబ్బందులు పడుతున్నారని తప్పకుండా వారి సమస్యలను పరిష్కరించేందుకు మీ మంత్రిగా హామీ ఇస్తున్నానని, మీ సమస్యల విషయంలో ప్రభుత్వం సానుకూలతతో ముందుంటుందని సమాచార, పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి హామీ ఇచ్చారు.


ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవం సందర్భంగా సోమవారం మాధాపూర్ లోని ఆర్ట్ గ్యాలరీలో తెలంగాణ రాష్ట్ర సమాచార శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన ఫోటోగ్రఫి దినోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో మంత్రి పాల్గొన్నారు. ఎంపిక చేసిన ఉత్తమ ఫోటోగ్రాఫర్లను మంత్రి సన్మానించారు. ఈ సందర్భంగా మాట్లాడిన పొంగులేటి.. ఏదైనా ఫోటోలో జీవం ఉట్టిపడాలంటే ఫోటోగ్రాఫర్ ఎంతో డెడికేషన్ తో కళాత్మకతతో కూడిన ఆలోచన చేయాల్సి ఉంటుందని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఆహ్వానిస్తే 101 మంది ఫోటో జర్నలిస్టులు 900 ఫోటోలు పంపించారని ఈ ఫోటోలన్ని ఒకదాన్ని మించి మరొకటి ఉందని ప్రశంసించారు. మార్పు కావాలని అది ఇందిరమ్మ రాజ్యంతోనే సాధ్యం అని ప్రజలు భావించారు. 


ఇందిరమ్మ రాజ్యం ఏర్పడిన రెండో రోజు నుంచే ప్రభుత్వం అభయహస్తం హామీలను అమలు చేస్తుంటే వాటిపట్ల ప్రజా స్పందన ఫోటో గ్రాఫర్లు క్యాప్చర్ చేస్తున్నారన్నారన్నారు. గడిచిన ఎనిమిది నెలల పాటు సంక్షేమ కార్యక్రమాలతో పాటు అభివృద్ధి కార్యక్రమాలను ముందుకు తీసుకువెళ్లేందుకు సీఎం రేవంత్ రెడ్డితో పాటు మంత్రులుగా మేము పడుతున్న కష్టాన్ని 15 నిమిషాల్లో ఫోటో ఎగ్జిబిషన్ లో చూపించారన్నారు. కళను అభిమానించడంతో పాటు దాంట్లోని ప్రావిణ్యతను ప్రదర్శిస్తూ దృశ్యాలను కంటికి కొట్టొచ్చినట్లు చూపిస్తున్న ఫోటో జర్నలిస్టులందరికీ మనస్పూర్తిగా ప్రభుత్వ పక్షాన్న అభినందనలు తెలుపుతున్నాన్నారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ మీడియా అకాడమీ చైర్మన్ కె.శ్రీనివాస్ రెడ్డి తో పాటు ఉన్నతాధికారులు హాజరయ్యారు. అంతకు ముందు బషీర్ బాగ్ ప్రెస్ క్లబ్ లో తెలంగాణ ఫోటో జర్నలిస్టుల సంఘం నిర్వహిచిన రాష్ట్ర స్థాయి న్యూస్ ఫోటో కాంపిటిషన్ ఎగ్జిబిషన్ ను మంత్రి ప్రారంభించారు.


Comments

Popular posts from this blog

250 కోట్ల స్కాం లో రైస్ మిల్లు ఓనర్ ఇమ్మడి సోమనర్సయ్య అరెస్ట్: డి ఎస్పీ. గతంలో గూఢచారి ఈ కుంభకోణం పై వార్త కథనం

తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ ఎన్నికలకు అంగీకరించిన అమరవాది - మిడిదొడ్డి శ్యామ్ సుందర్

తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ అధ్యక్ష పదవి కొత్తవారికి అవకాశం కల్పించాలి - మిడిదొడ్డి శ్యామ్