రైస్ మిల్లర్లు కస్టమ్ మిల్లింగ్ రైస్ (సి ఎం ఆర్ )ను తక్షణమే పూర్తి చేయాలి


   

 రైస్ మిల్లర్లు కస్టమ్ మిల్లింగ్ రైస్ (సి ఎం ఆర్ )ను తక్షణమే పూర్తి చేయాలని అదనపు కలెక్టర్ జె.శ్రీనివాస్ ఆదేశించారు.


      బుధవారం అయన తన చాంబర్లో రైస్ మిల్లర్లతో వాన కాలం ,గత యాసంగి సిఎంఆర్ పై సమీక్ష నిర్వహించారు.


        గత వానాకాలానికి సంబంధించి 71% సీఎంఆర్ పూర్తి చేయడం జరిగిందని, తక్కిన 29 శాతాన్ని రైస్ మిల్లర్లు రోజువారి నిర్దేశించిన ప్రకారం సెప్టెంబర్ లోపు పూర్తి చేయాలని అన్నారు. ఇందుకుగాను ప్రతిరోజు సీఎంఆర్ డెలివరీ చేయాలని అన్నారు.యాసంగికి సంబంధించిన 54% సీఎంఆర్ పూర్తి కాగా, తక్కిన వి డెలివరీ చేయడం పై ప్రత్యేక దృష్టి కేంద్రీకరించాలని ,రెండు సీజన్లకు సంబంధించిన సీఎంఆర్ ను సెప్టెంబర్ లోగా పూర్తి చేయాలని అన్నారు


      జిల్లా పౌర సరఫరాల మేనేజర్ నాగేశ్వరరావు, డిఎస్ఓ వెంకటేశ్వర్లు, ఎన్ఫోర్స్మెంట్ సిబ్బంది ,రైస్ మిల్లర్లు ఈ సమావేశానికి హాజరయ్యారు

____________________________________

 జారీ చేసిన వారు సహాయ సంచాలకులు, సమాచార శాఖ, నల్గొండ*

Comments

Popular posts from this blog

250 కోట్ల స్కాం లో రైస్ మిల్లు ఓనర్ ఇమ్మడి సోమనర్సయ్య అరెస్ట్: డి ఎస్పీ. గతంలో గూఢచారి ఈ కుంభకోణం పై వార్త కథనం

తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ ఎన్నికలకు అంగీకరించిన అమరవాది - మిడిదొడ్డి శ్యామ్ సుందర్

తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ అధ్యక్ష పదవి కొత్తవారికి అవకాశం కల్పించాలి - మిడిదొడ్డి శ్యామ్