తుస్సు మన్న చలో చింతల బస్తీ..... ఘనంగా స్వాతంత్ర దినోత్సవ వేడుకలు
తుస్సు మన్న చలో చింతల బస్తీ.....ఘనంగా స్వాతంత్ర దినోత్సవ వేడుకలు
హైద్రాబాద్, గూఢచారి ప్రతినిధి, 15-8-2024:
తెలంగాణ ఆర్యవైశ్య మహాసభ విముక్తి కొరకు దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన రోజు స్వాతంత్ర దినోత్సవం రోజున తెలంగాణ ఆర్యవైశ్య మహాసభ విముక్తి కొరకు చలో చింతల బస్తీ తుస్సు మంది. వాట్సాప్ గ్రూప్ లో భారీ ఎత్తున పోస్ట్లు పెట్టీ, వాటి కొరకు తగావులాడుకొన్న వారు కానీ, బీరాలు పలికి మొత్తం మార్పు తెస్తాం, ఎన్నికలు పెట్టిస్థామన్న వారీ లో ఒకరు ఇద్దరు తప్ప ఎవరు రాలేదు. వచ్చిన వారు మాట్లాడలేదు. అంత ప్రశాంతంగా జరిగింది. ఇప్పుడు చెప్పుకుంటున్న మహాసభ పాలకవర్గం మాత్రం ఏమో జరుగవచ్చు, జనం బాగా వస్తారని అని పోలీస్ బందో బస్తు ఏర్పాటు చేసినట్లు గుసగుసలు. ప్రతి ఏడాది లాగానే జాతీయ పతాకం ఆవిష్కరణ చేసి జాతీయ గీతం ఆలపించి, చాయి, టిఫిన్ చేశారట.
మహాసభ విముక్తి వాట్సాప్ గ్రూప్ తో కాదన్న ఓ జర్నలిస్టు.
👇👇
https://www.gudachari.page/2024/07/blog-post_44.html
మరి ఎలా జరుగుతుంది విముక్తి అనేదానికి
జవాబు లేని ప్రశ్న గా మిగలకుండా
ఓ 10 మంది ఒకే ఆలోచన ఉన్న వ్యక్తులు ప్రముఖులు, రాజకీయనాయకులు, స్వచ్ఛంద సేవా సంస్థ ల నాయకులు, డాక్టర్లు, అడ్వకేట్ లు వ్యాపారస్తులు, జర్నలిస్టుల తో ఒక రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేసి చర్చించి కార్యాచరణ చేసి, చట్ట బద్ధంగా, గాంధీ మార్గం లో ఎలా ముందుకు పోవాలి నిర్ణయించుకుంటే సాధ్యం కానిది ఏది లేదని, భారత విముక్తి కొరకు, తెలంగాణ సాధన కొరకు చేసిన పోరాటాలను ఆదర్శంగా తీసుకోవాలని పలువురు పెద్దలు సలహా ఇస్తున్నారు.
Comments
Post a Comment