జిల్లా సర్వోత్తముఖాభివృద్ధికి అందరి సహకారం అవసరం - రాష్ట్ర రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి


  నల్గొండ, (గూఢచారి) 15-8-2024

 నల్గొండ జిల్లా సర్వోత్తముఖాభివృద్ధికి అందరి సహకారం అవసరమని రాష్ట్ర రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు.


        78వ భారత స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల సందర్భంగా గురువారం ఆయన నల్గొండ జిల్లా కేంద్రంలోని పోలీస్ పరేడ్ మైదానంలో జాతీయ పతాకాన్ని ఎగురవేసి పోలీసు గౌరవ వందనం స్వీకరించారు.


        అనంతరం జిల్లా ప్రజలను ఉద్దేశించి ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలపై సందేశం ఇస్తూ..... ప్రజా సమస్యల పరిష్కారంలో ముందుండాలన్న ఉద్దేశంతో ప్రభుత్వం ఏర్పాటైన 48 గంటలలోనే ప్రజలకు ఇచ్చిన 6 గ్యారంటీలను తమ ప్రభుత్వం అమలు చేసిందని అన్నారు.


        ఇందులో భాగంగా మహాలక్ష్మి పథకం కకింద జిల్లాలో రెండు కోట్ల 27 లక్షల మంది మహిళలు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యాన్ని వినియోగించుకున్నారని, ఇందుకు ఆర్టీసీ కి 98 కోట్ల 26 లక్షల రూపాయలు లబ్ధి పొందిందని తెలిపారు.


       రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకం కింద పరిమితిని 5 నుండి 10 లక్షల కు పెంచడం జరిగిందని, దీని ద్వారా జిల్లాలో 33 వేల 312 మంది చికిత్సలు చేయించుకొని లబ్ధి పొందగలిగారని తెలిపారు.

       ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంలో భాగంగా ప్రతి నియోజకవర్గానికి 3500 చొప్పున ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం చేయనున్నామని, 3500 చొప్పున జిల్లాలో మొత్తం 21 వేల ఇందిరమ్మ ఇండ్లు నిర్మించనున్నామని తెలిపారు.


        500 రూపాయలకే ఎల్పీజీ సిలిండర్ పథకం కింద రెండు లక్షల 38వేల 251 మందికి నాలుగు లక్షల ఇరవై మూడు వేల 390 సిలిండర్ లను పంపిణీ చేయడం జరిగిందని, ఇందుకు 12 కోట్ల 41 లక్షల సబ్సిడీని ప్రభుత్వం ఇచ్చిందని చెప్పారు.


         గృహ జ్యోతి పథకం కింద 200 యూనిట్ల వరకు వినియోగదారులకు ఉచిత విద్యుత్తు ను ప్రభుత్వం అందిస్తున్నదని, ఇందులో భాగంగా నల్గొండ జిల్లాలో రెండు లక్షల 13390 జీరో బిల్లులు జారీ చేయడం జరిగిందని, ఇందుకుగాను ప్రభుత్వం 36 కోట్ల 15 లక్షల రూపాయల సబ్సిడీని ఇచ్చిందని తెలిపారు.


          రైతు రుణమాఫీ పథకంలో భాగంగా బ్యాంకుల ద్వారా రెండు లక్షల రూపాయల వరకు రుణాలు పొందిన రైతుల రుణమాఫీ ప్రకటించిందని, ఇందులో భాగంగా నల్గొండ జిల్లాలో లక్ష 71 788 మంది రైతులకు 1421 కోట్ల 35 లక్షల రూపాయలు రుణమాఫీ అయిందని తెలిపారు .


       ప్రజావాణి కార్యక్రమంలో భాగంగా రాష్ట్రస్థాయిలో 672 దరఖాస్తులకు గాను 595 పరిష్కారం అయ్యాయని, జిల్లాలో 7814 దరఖాస్తులకు గాను ,5785, మండలాలలో 6549 దరఖాస్తులకు గాను, 5317 పరిష్కారం అయ్యాయని తెలిపారు .


        సాగునీటి రంగంలో భాగంగా ఎస్ఎల్బీసీ ద్వారా 3 లక్షల ఎకరాలకుసాగునీరు అందించనున్నామని, డిండి లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా 3 లక్షల 61,000 ఎకరాలకు నీటిని అందిస్తున్నామని, అలాగే బ్రాహ్మణ వెల్లేముల తో పాటు,ఉదయ సముద్రం, తడితర ప్రాజెక్టుల ద్వారా సైతం రైతులకు సాగునీటిని అందించనున్నట్లు వెల్లడించారు.


       రైతు భరోసా పథకం కింద 15 వేల రూపాయలు సబ్సిడీని అందించనున్నామని,ఇందుకు ప్రణాళికలు సిద్ధం చేసినట్లు మంత్రి వెల్లడించారు.


       నల్గొండలో 5ఎకరాల విస్తీర్ణంలో 20 కోట్ల రూపాయలతో నర్సింగ్ కళాశాల నిర్మాణాన్ని చేపట్టామని, ఇది ప్రారంభానికి సిద్ధంగా ఉందని ఆయన తెలిపారు. అలాగే 20 కోట్ల రూపాయల వ్యయంతో యువతకు ఉపాధి, ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు నైపుణ్యాల అభివృద్ధి సంస్థ నిర్మాణాన్ని చేపట్టామని, పనులు పురోగతిలో ఉన్నాయని తెలిపారు.


        రహదారుల అభివృద్ధిలో భాగంగా నల్గొండ జిల్లాలో 2024- 25 సంవత్సరంలో 241.90 కిలో మీటర్ల రోడ్లు ,బ్రిడ్జిల మరమ్మతులకు 512 కోట్ల 81 లక్షల రూపాయలను మంజూరు చేయడం జరిగిందని, ఇవే కాకుండా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ సంక్షేమం కింద అన్ని వర్గాల ప్రజలకు సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నామని తెలిపారు.


         ఈ సందర్భంగా మంత్రి వివిధ పథకాల కింద లబ్ధిదారులకు చెక్కులను పంపిణీ చేశారు.


           డిఆర్డిఏ ద్వారా బ్యాంకు లింకేజీ కింద 355.34 కోట్ల రూపాయల చెక్కును, శ్రీనిధి పథకం కింద 25 కోట్ల 22 లక్షల రూపాయల చెక్కును అందజేశారు. పరిశ్రమల శాఖ ద్వారా వాణిజ్య వాహనాలకు 11 లక్షల రూపాయల చెక్కును, మెప్మా ద్వారా 768. 30 లక్షల రూపాయల చెక్కులను పంపిణీ చేశారు.


        ఉత్తమ సేవలందించిన ప్రభుత్వ అధికారులు, ఉద్యోగులకు మంత్రి ప్రశంస పత్రాలను అందజేశారు.


          స్వాతంత్ర దినోత్సవ వేడుకలలో భాగంగా ఏర్పాటుచేసిన విద్యార్థుల సాంస్కృతిక ప్రదర్శనలు ఆహుతులను ఆకట్టుకున్నాయి.

      వివిధ శాఖల అభివృద్ధిని తెలిపే విధంగా ఆయా శాఖలు శకటాలను రూపొందించగా, మొదటి ఉత్తమ శకటంగా వ్యవసాయ శాఖ, రెండవ ఉత్తమ శకటం గా డిఆర్డిఏ, మూడవ ఉత్తమ శకటం గా వైద్య ఆరోగ్యశాఖ, నాల్గవ ఉత్తమ శకటం గా అటవీశాఖలు గెలుచుకున్నాయి.


         స్వతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా ఆయా శాఖలు వారు చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలపై స్టాల్స్ ను ఏర్పాటు చేయడం జరిగింది.


       ఖమ్మం జిల్లాలో సీతారామ ప్రాజెక్టుతో పాటు, రైతు రుణమాఫీ చివరి విడత నిధుల విడుదల కార్యక్రమానికి రాష్ట్ర ముఖ్య మంత్రి ఏ .రేవంత్ రెడ్డి హాజరవుతున్న కార్యక్రమానికి మంత్రి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి హాజరయ్యె నిమిత్తం వెళ్ళగా ,అనంతరం జిల్లా కలెక్టర్ సి.నారాయణరెడ్డి,

తదితరులు ప్రభుత్వ స్టాల్స్ ను సందర్శించారు. అంతేకాక సాంస్కృతీక ప్రదర్శనలు ఇచ్చిన విద్యార్థులకు బహుమతులను అందజేశారు.


      ఈ స్వాతంత్ర దినోత్సవ వేడుకలకు ఎమ్మెల్సీలు నర్సిరెడ్డి, కోటిరెడ్డి ,మున్సిపల్ చైర్మన్ బుర్రి శ్రీనివాస్ రెడ్డి, జిల్లా కలెక్టర్ సి.నారాయణరెడ్డి, జిల్లా ఎస్ పి శరత్ చంద్ర పవార్,అదనపు కలెక్టర్లు టీ. పూర్ణచంద్ర ,జె. శ్రీనివాస్, అడిషనల్ ఎస్పీ రాములు నాయక్ , ఆర్ డి ఓ రవి, జిల్లా అధికారులు, ప్రజాప్రతినిధులు, ప్రజలు పెద్ద ఎత్తున హాజరయ్యారు.

Comments

Popular posts from this blog

250 కోట్ల స్కాం లో రైస్ మిల్లు ఓనర్ ఇమ్మడి సోమనర్సయ్య అరెస్ట్: డి ఎస్పీ. గతంలో గూఢచారి ఈ కుంభకోణం పై వార్త కథనం

తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ ఎన్నికలకు అంగీకరించిన అమరవాది - మిడిదొడ్డి శ్యామ్ సుందర్

తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ అధ్యక్ష పదవి కొత్తవారికి అవకాశం కల్పించాలి - మిడిదొడ్డి శ్యామ్