చిన్న పత్రికల సమస్య లను రాష్ట్ర ముఖ్యమంత్రి ద్రుష్టి కి తీసుకెళ్దాం - టిఎస్ఎంఎన్ ఎం ఏ రాష్ట్ర అధ్యక్షులు యూసుఫ్ బాబు


 చిన్న పత్రికల సమస్య లను రాష్ట్ర ముఖ్యమంత్రి ద్రుష్టి కి తీసుకెళ్దాం 


 టిఎస్ఎంఎన్ ఎం ఏ రాష్ట్ర అధ్యక్షులు యూసుఫ్ బాబు  


 రాష్ట్ర కార్యవర్గ సమావేశం లో నిర్ణయం 


( హైదరాబాద్ ) 

చిన్న పత్రికల యాజమాన్యాలు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి మీడియా అకాడమీ ద్వారా రాష్ట్ర ముఖ్యమంత్రి దృష్టికి తీసుకుపోయేలా సమిష్టిగా కృషి చేద్దామని తెలంగాణ చిన్న మధ్య తరహా అండ్ మ్యాగజైన్స్ అసోసియేషన్ అధ్యక్షులు యూసుఫ్ బాబు అభిప్రాయపడ్డారు. శుక్రవారం బషీర్బాగ్ ప్రెస్ క్లబ్ లో నిర్వహించిన సంఘం రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో పలు అంశాలను చర్చించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత ప్రభుత్వంలో ఎదుర్కొన్న సమస్యలే ఈ ప్రభుత్వంలోనూ కొనసాగుతున్నాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. పత్రికల గ్రేడింగ్, పెండింగ్ బిల్లులు, అక్రిడి టేషన్ ల కేటాయింపు అంశాలను మీడియా అకాడమీ చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి తో చర్చించి పరిష్కారానికి కృషి చేస్తున్నానన్నారు. చిన్న పత్రికల ఎడిటర్లందరూ ఐక్యమత్యంతో ఉంటేనే సమస్యల పరిష్కారానికి అవకాశం ఉంటుందని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు జర్నలిస్టులందరికీ ఇళ్ల స్థలాల కేటాయింపు చేయాలని ప్రభుత్వాన్ని ఈ సందర్భంగా ఆయన విజ్ఞప్తి చేశారు. అవసరమైతే ఆందోళన కూడా సిద్ధంగా ఉంటామని స్పష్టం చేశారు. కార్యక్రమంలో సంఘం ప్రధాన కార్యదర్శి అశోక్, కోశాధికారి అజం ఖాన్, సీనియర్ నాయకులు మాతంగి దాస్, టియుడబ్ల్యుజె మేడ్చల్ అధ్యక్షులు గడ్డమీది బాలరాజు, సంఘం రాష్ట్ర నాయకులు అజాం ఖాన్, గోళ్ళ రమేష్, బాలకృష్ణ,అఫ్రోజ్, అమీర్ అమానుల్లా ఖాన్ ,వెంకటయ్య, రవి కుమార్,జాన్ షహీద్,కలకొండ రామకృష్ణ, అహ్మద్ అలీ,చంద్ర శేఖర్, మోసిన్ అలీ, గౌస్ ,శ్రీనివాస్,నవీన్,అంజాద్, ఇల్యాస్, తదితరులు పాల్గొన్నారు.

Comments

Popular posts from this blog

250 కోట్ల స్కాం లో రైస్ మిల్లు ఓనర్ ఇమ్మడి సోమనర్సయ్య అరెస్ట్: డి ఎస్పీ. గతంలో గూఢచారి ఈ కుంభకోణం పై వార్త కథనం

తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ ఎన్నికలకు అంగీకరించిన అమరవాది - మిడిదొడ్డి శ్యామ్ సుందర్

తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ అధ్యక్ష పదవి కొత్తవారికి అవకాశం కల్పించాలి - మిడిదొడ్డి శ్యామ్